16, మే 2013, గురువారం

RGUKT లో ప్రవేశం పొందిన వారందరూ ప్రతిభావంతులే.కానీ అక్కడ క్లాస్ ఫస్టు అని ఎవరూ పట్టించుకోరు.మన చదువూ మన ఇష్టం.ఎవరూ ఒత్తిడి చెయ్యరు.బయటి కార్పోరేట్ కాలేజీల కంటే ఇది చాలా బావుంటుంది.కానీ బయటి సిలబస్ కంటే ఇక్కడ ఎక్కువ సిలబస్ ఉంటుంది.
అక్కడ 60% మంది పాస్ అయితే చాలు అని అనుకుంటారు.మా తరగతి లో అయితే అమ్మాయిల్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు.వాళ్ళు ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని కూర్చుంటారు.మామూలుగా అయితే ఫరవాలేదు. కానీ వాళ్ళు రాత్రి పదింటి తర్వాత క్లాస్ నుండి వచ్చేక కూడా మొబైల్ టార్చి వెలుగు లో కూడా చదువుతారు.ఇక పరీక్షల సమయంలో అయితే చెప్పనవసరం లేదు.నైటవుట్ లు కూడా చేస్తారు.ఆప్పుడు స్నానం చేసినా,టిఫిన్ చేసిన,భోజనం చేసినా ఎక్కడ సమయం వ్యర్ధం అవుతుందోనని అవి కూడా చేయడం మానేస్తారు.నిజంగా ఇది నిజం.
కానీ అలా చేస్తే మానసికంగా వీక్ అవుతారని చాలా సార్లు వింటాం.కానీ వాళ్ళకి అలా ఏం అవ్వదు,మంచి మార్కులు వస్తాయి.నాకదే అర్థం కాదు.డాక్టర్స్ చెప్పేది నమ్మాలో నమ్మకూడదో.పరీక్షలు ముగిసాయంటే మేము ఒక బరువు దిగినట్లు ఫీల్ అవుతాం. పరీక్షల ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియదు.అంతే ముందుగా చెప్పరు.మేమే ఆ సైట్ చూసుకుంటూ ఉండాలి.నీకెన్ని మార్కులు లేదా పాయింట్లు వచ్చాయని ఎవరూ అడగరు.మాలో మేమే చెప్పుకుంటాము.
ఇక నా విషయాని కొస్తే నాకు అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చేసుకోవాలని లేదు.పుస్తకాల ద్వారాగానీ అంతర్జాలం ద్వారా గానీ కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంటుంది.నా లక్ష్యం IAS కావడం.అలాగే నాకు నచ్చిన సంగీతం,చిత్రలేఖనంలలో కూడా ప్రావీణ్యం పొందడం.చిన్న చిన్న రచనలు చేయడం నాకు అలవాటు.అలాగని వాటిని ఎప్పుడూ చదవమని ఎవరికీ ఇవ్వలేదు.
ఎప్పట్నుంచో నాకు బ్లాగు ప్రారంభించాలని ఉండేది.మా నాన్న గారిని అడిగితే నీకెందుకు ఇవన్నీ అన్నారు.కానీ నేను వినలేదు.ఈ వేసవి సెలవుల్లో బ్లాగింగ్ ప్రారంభించేశాను.నాకీ అవకాశం సెలవుల ముగింపు వరకే.మళ్ళీ దశరా సెలవులకి.కానీ అప్పుడు వారం రోజులే సెలవులు.అసలు వేసవిలో మాకు మే నెల ఒక్కటే సేలవులు. కానీ మా అదృష్టం ఏమో మూడు నెలలు సెలవులు ఇచ్చారు.కానీ నాకు రెండు నెలలే.ఎందుకంటే ఆప్షనల్ సబ్జెక్టుగా జీవశాస్త్రం తీసుకున్నా.ఆ తరగతులు ఒక నెల ముందుగా ఉంటాయి.ఆగష్టు నుండి అసలు తరగతులు ప్రారంభమవుతాయి.RGUKT ప్రవేశాల ప్రకటన ఈ నెలలో విడుదల అవుతుంది.అంటే 2013-14 విద్యా సంవత్సరానికి.రేపు పదవ తరగతి పరీక్షల ఫలితాలు కదా.విధ్యార్థులందరికీ నా శుభాకాంక్షలు.

1 comments:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...

Freerice.com

Online game to end hunger

freeflour