6, డిసెంబర్ 2014, శనివారం

ఆత్రేయ గీతమా ఇది ఆరుద్ర భావమా
తేనెతేట మాటల్లో నింపిన వేటూరి సారమా
సినారె మనసు పొరలో దాగిన తెలుగింటి అందమా
ఆడువారి మనసంతో తెలిసిన పింగళి కలముకు దొరకని తరుణీ


ఆ వనితను చూసిన కవితగ మలిచేవాడు కృష్ణశాస్త్రి
నిను మరిచానని మరు జన్మనెత్తడా మహాకవి శ్రీశ్రీ
నీమాట వింటే మా పదాల రేడు సీతారామ శాస్త్రి
నీ సోయగాలు వర్ణించ బూనెనమ్మా చెలియా ప్రతి రాత్రి
భువన చంద్రుడె చిన్నెలు చూసి పరవశించిపోతూ
ఈ వన్నెలు కన్నా వెన్నెలకంటి తరము కాదు అంటూ
కన్నులా చురకత్తులని మైమరచెను జొన్నవిత్తుల
ఏమది సొగసిరులది అంటున్నాడమ్మ జాలాది
బోసు గిలిగింత అక్షరం నీ చుట్టు తిరిగె నాతోమరి
సుద్దాల గారి లక్షణం మరి బెట్టు చేసే సౌదామిని
వరమల్లె నను చేరుప్రాణమా....

నీ చిలుకలపలుకుల మధురిమ లోనా రసాలూరు స్వరమా
నీ అలకల మెలికలు ఎవరికి అందని రమేష్ నాయుడిరాగమా
నీ చేతిగాజుల సవ్వళ్ళ మాటునున్నది అదిగో మా సత్యమే
ఈ జానపదములు గానమే వినబడితే అది చక్రవర్తి పనితనమే
స్వరబ్రహ్మ మహదేవన్ ఒడిలో ఒదిగినట్టి స్వరవీణవా
ఇళయరాజా మదినుండి పుట్టిన పాటలోని సుకుమారమా
నడుములో నీ నడకలో శృతిలయలే మీటే కోటి
నీ నవ్వుల విరితోటలో సుధలొలికించె కీరవాణి
ఊసులందించు శ్వాసలో రెహమాను నాదాల లాహిరి
దాచుకున్నావా మేనిలో మణిశర్మ రాగాల మాధురి
నన్ను దోచుకున్నావే అందమా....


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...

Freerice.com

Online game to end hunger

freeflour