25, ఫిబ్రవరి 2015, బుధవారం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం,2014 లో SSCలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రతిభ అవార్డులు 27న తిరుపతిలో ఇవ్వనుంది.మా పాలకొల్లు మండలానికి ఐదు బహుమతులు వచ్చాయి.విషయం ఏంటంటే అందరూ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే!అందరికీ 10 GPA నే!వారందరికీ 20వేల రూపాయలు,ప్రశంసా పత్రం,జ్ఙాపిక అందిస్తారట.


నాకు తెల్సినంతవరకూ మండల ప్రథమం(10/10) అంటే ప్రైవేటు పాఠశాలలే వస్తాయి.అంటే ఈ బహుమతుల్లో ఎక్కువ భాగం వారికేగా!ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 40% ఉంటారేమో!ప్రభుత్వమే ఇలా ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తే,ప్రభుత్వ బడులను పట్టించుకునేదెవరు?..ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన వారు ప్రస్తుతం ఏ "పేద్ద పేరున్న" కార్పొరెట్ కాళాశాల లోనో చదువుతూ ఉంటారు.ఈ అవార్డులేవో కేవలం సర్కారు బడి పిల్లలకే ఇస్తే వారికి గుర్తింపు,సహాయం అందించినట్టు ఉంటుంది కదా!ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది కేవలం పేదల పిల్లలే కదా!ఇప్పుడు సర్కారు బడుల్లో కూడా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి.వారికీ మంచి GPA లు వస్తున్నాయి...


ప్రభుత్వం చేస్తున్న పని బాగానే ఉంది,కానీ ఈ అవార్డులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారికి,పైగా తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఇస్తే బాగుంటుందని నా కోరిక....మీరేమంటారు?

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...

Freerice.com

Online game to end hunger

freeflour