8, ఫిబ్రవరి 2015, ఆదివారం

చిన్ని అతిథులు

ఆదివారం, ఫిబ్రవరి 08, 2015 2 Comments

మా ఇంటికి రోజూ ఈ అతిథులు వస్తాయి..మా నాన్న గారు వీటిని అలవాటు చేసారు.ఉదయాన్నే 8 అవకుండా వచ్చేస్తాయి.టోపీ పిట్టలు,పిచ్చుకలు,తోక కింద ఎర్రగా ఉండే నల్ల పిట్టలు(నాకు పేరు తెలీదు) ఇంకా కాకులు వస్తాయి..మేమేమి తింటే అదే కొంచెం పెడతాం..టోపీ పిట్టలు సపోటా,అరటి పళ్ళను ఎంత ఇష్టంగా తింటాయో!సంక్రాంతికి నాన్నగారికి,ఎవరో వరి ధాన్యాలు గుత్తు ఇచ్చారు..దాన్ని ఇంటి ముందు వేలాడదీస్తే పిచ్చుకలు రోజూ వస్తున్నాయి..అవి దాని మీద వాలి,ధాన్యంపైన ఉండే పొట్టును వొలిచి మరీ తింటున్నాయి..
ఇక టోపీ పిట్టలు ఉన్నాయంటే మేము దాని దగ్గర్నునంచి వెళ్తున్నా,అవి కదలవు.అదంతా మా మీద నమ్మకమే!వీటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది.ఒకేసారి నాలుగైదు తింటానికి వస్తాయి.ఒకటి తిన్న తర్వాతే ఇంకోటి తింటుంది!అంతవరకు పక్కనే నిల్చుని చూస్తుంది!బకెట్లలో ఉండే నీటిలో జలకాలాటలు కూడా ఆడతాయి..
నాకు పేరు తెలియని పిట్టలు,మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి ఎంత గోల చేస్తాయో!(సరదాగా)..ఆ గోల వినసొంపుగా ఉంటుంది.
ఈ చిత్రాలన్నీ ఐదు రోజులు కష్టపడి తీశాను.

విద్యుత్తీగే ఊయల


క్షీరన్నం తింటూ..


ఫ్రెండ్ కోసం..


ఇదిగో వచ్చేసింది..


మధ్యాహ్నం కిలకిలలు





ఇంటి పైకెక్కి


స్థంభం పైన..




గులాబ్ జాం తినాలా వద్దా?


సర్లే తిందాం!


ఎడమొహం పెడమొహం..ఇప్పుడే గొడవయింది.