ఏప్రిల్ లో మా విశ్వవిద్యాలయంలో CYGNUS'14 పేరుతో యాన్యువల్ సంబరాలు నిర్వహించారు.అందులో భాగంగా Cogno quest పేరుతో క్విజ్ కార్యక్రమం నిర్వహించారు.పీయూసీ వారికీ,ఇంజనీరింగ్ వారికీ వేరేవేరేగా పెట్టారు.మా స్నేహితులందరూ ఆరుగురు ఒక టీముగా అందులో పాల్గొన్నాము.మొదటి రౌండులో ఒక ప్రశ్నాపత్రమిచ్చి జవాబులు వ్రాయమంటారు.అందులో ఎక్కువ మార్కులొచ్చిన టీముల్ని రెండవ రౌండుకి ఎంపిక చేస్తారు.పీయూసీ వారికి పూల్-ఏ,ఇంజనీరింగ్ వారికి పూల్-బి ప్రశ్నాపత్రాలిచ్చారు.మేము బాగానే వ్రాశాము.ఫలితాల కోసం ఎదురు చూశాం.మా తరగతిలో అమ్మాయిల్లో రెండు టీములు పాల్గొన్నాము.Cygnus'14 కి ప్రత్యేకంగా ఒక సైట్ ఉంది.అందులో అన్ని అప్ డేట్స్ ఉంటుంటాయి.అందులో రెండవ రౌండుకి ఎంపికయినవారిలో మా టీం కూడా ఉంది.నేనైతే చాలా సంతోషపడ్డాను.ఎందుకంటే చాలా సార్లు అక్కడ క్విజ్ లలో పాల్గొన్నా ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదు.కానీ ఈసారి ఎలాగైనా ఒదటి మూడు స్థానాల్లో ఏదోఒకటి దక్కించుకోవాలని అనుకున్నాం.రెండవ రౌండులో మామూలు క్విజ్ లాగానే జరిగింది.చాలా ఆసక్తిగా జరిగింది.మాకొచ్చిన మార్కులు చూసుకుంటే 50-50 అవకాశాలు ఉన్నాయి.మా అదృష్టం కొద్దీ అందులో కూడా మేము సెలెక్టయ్యాము.విశేషం ఏంటంటే ఫైనల్స్ కి ఎంపికయ్యిన వారిలో మేమే పీయూసీ నుండి ఉన్నాము,అందరూ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం వాళ్ళే.మేము షాకయ్యాము.ఇంక మాకేమి వస్తుంది అనుకున్నాము.అసలు ఇంజనీరింగ్ వాళ్ళతో మాకు పోటీ ఏంటి?కనీసం మాకు మూడవ స్థానం ఇవ్వొచ్చుకదా! అనిపించింది.ఏదో అక్కడున్నామన్న పేరుకి మూడు,నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వచ్చేశాము.ఫైనల్ కి వెళ్లామన్న ఆనందం తప్ప మాకింకేం మిగల్లేదు.
మా విశ్వవిద్యాలయంలో మాకు ఉబుంటు OS ఉంటుందని చెప్పా కదా!ఉబుంటు 11.10 వర్షన్ మాది.అందులో టెర్మినల్ లో ఫైల్స్ ని జిప్ చేసుకుంటాం.అందులో కంప్రెస్స్ అనే ఆప్షన్ లేదు.అలా కొన్ని ఫైల్స్ జిప్ చేసి డ్రైవ్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చా.మొత్తం పూర్తయ్యాకే టెర్మినల్ ని క్లోజ్ చేశా.ఆ జిప్ ఫైల్స్ మా విండోస్ 7 లో ఓపెన్ కావట్లేదు.అందులో కొన్ని ఓపెన్ అయ్యాయి.కొన్ని కావట్లేదు.అవి జిప్ సరిగా కాలేదని ఎర్రర్ వస్తుంది.ఇక జిప్ లోని ఫైల్స్ బయటికి రావా?అందులో ముఖ్యమైన బుక్స్ అవీ తెచ్చుకున్నా! ప్లీజ్ తెలిస్తే చెప్పరూ....
మా విశ్వవిద్యాలయంలో మేము కూడా సమైఖ్యంధ్ర ఉద్యమం చేసాము.
ఒకరోజు సాయంత్రం నూజివీడు సమైఖ్యాంధ్ర JAC వ్యవస్థాపకులు వచ్చి మాకు సమైఖ్యంధ్ర మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు.చాలా స్పూర్తిదాయకంగా అనిపించింది.
మాకు పోయిన సెమిష్టరు లో చాలా సెలవులు సమైఖ్యంధ్ర వల్ల వచ్చాయి.బయటి ప్రభావం మా మీద ఉండకపోయినా ఎందుకు ఇచ్చారో తెలియలేదు.పోనీ మమ్మల్ని బయటికి తీసుకెళ్తారా అంటే అదీ లేదు.ఆ సెలవులు ఎలాంటివంటే తరగతులలో కూర్చొని చదువుకోవడమే.మెంటార్స్ రారు.అలాంటప్పుడు ఇవ్వడం ఎందుకో.బయట విద్యార్థులేమో వాళ్ళ చదువులు వదిలేసి సమైఖ్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తుంటే మేము మాత్రం హాయిగా కూర్చొని చదువుకుంటున్నాము.నాకిది నచ్చలేదు.
ఓ రోజు(నవంబర్ 1 న) అసెంబ్లీ అవ్వగానే మా PUC కో ఆర్డినేటర్ గారు ఇప్పుడు సమైఖ్యాంధ్ర విద్యార్థి గర్జన కు PUC 2 వాళ్ళని తీసుకెళ్తానన్నారు.మేము నమ్మలేకపోయాము.అంతకుముందు ఒకసారి మొత్తం విద్యార్థులందరూ క్యాంపస్ మొత్తం ఒకసారి తిరిగి సమైఖ్యాంధ్ర నినాదాలు చేశాము,కానీ బయటకు వెళ్ళలేదు.కానీ ఇప్పుడు నూజివీడు సెంటరులో ఉన్న పెద్దగాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలి.ఆరోజూ ఎండ గొప్పగా ఉంది.మాకదేమీ బాధనిపించలేదు.మేమందరం వెయ్యి మంది ఉన్నాము.మమ్మల్ని ఫిసికల్ డైరెక్టర్స్ కంట్రోల్ చేసారు.ఇద్దరిద్దరు కలిసి నడవమన్నారు.నేను ,రమ్య నడిచాము.అమ్మో చాలా దూరం ఉంది.ప్రతీ సారీ ఆటోలో వస్తాం కదా తెలియలేదు.చివరికి అక్కడికి వెళ్తే అక్కడ కూర్చోవడానికి స్థలం లేదు.అంటే అంతమంది వస్తారని నిర్వాహకులు ఊహించి ఉండరు.మమ్మల్నందర్నీ రోడ్డు పై కాసేపు కూర్చోబెట్టారు.మేము సమైఖ్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసాము.ఫోటోలు తీసుకున్నారు.మంచినీళ్ళు కూడా లేవు.నాకైతే కొంతసేపుంటే పడిపోతానేమో అనిపించింది.కొంతసేపటికి అక్కడ్నుంచి సబ్ కలెక్టరు కార్యాలయానికి వెళ్ళాము.అక్కడ చిన్నపాటి సభ జరిగింది.తిరిగొచ్చేటప్పుడు మా మొహాలు వాడిపోయాయి.కనీసం డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు.చేతులూపుకుంటూ వెళ్ళాను.ఒకవేళ తీసుకెళ్ళుంటే ఏమైనా కొనుకొచ్చేదాన్ని.ప్చ్..ఏం చేస్తాం.అవకాశం చేజారింది.ఇదండీ మా సమైఖ్యాంధ్ర.
కొసమెరుపు:- మా కళాశాలలో తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు.
RGUKT లో నాకు నచ్చినవి చెప్పమంటే ముఖ్యంగా ల్యాప్ టాప్.నాకు ఏదైనా విషయం అర్ధం కాకపోతే వెంటనే చలో Google లేకపోతే Wikipedia.మా తరగతి అమ్మాయిల్లో అంతర్జాలాన్ని ఎక్కువ వాడేది నేనేనేమో.ఏదైనా పోటీ ఉంటే వెంటనే నోటీస్ బోర్డ్ లో ప్రకటిస్తారు.మొన్న కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ కి మా తరగతి నుండి నేను,అనూష మా కథలు పంపిచాము.పాల్గొందాము అనుకుందే తడవుగా,తర్వాత వచ్చిన వినాయక చవితి రెండు రోజుల సెలవుల్లో కథ తయారు చేసేసుకుని,వెంటనే మా తెలుగు అనువాద పరికరం ద్వారా కథ మొత్తం టైపు చేసి,మా HRT సార్ ని అడిగి మా మెయిలు ద్వారా పంపించాము.మాకు పూర్తి అంతర్జాల సౌకర్యం లేనందువల్ల సార్ ని అడగాల్సి వచ్చింది. అక్కడ వసతి సదుపాయాలు చాలా బాగుంటాయి.కొన్ని వెబ్ సైట్స్ లో నుండి పుస్తకాలు దిగుమతి చేస్తాను.ఖాళీ దొరికినప్పుడు అంటే పరీక్షలు ముగిసిన సందర్భాల్లో చదువుతా.రోజూ ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,హిందు పత్రికలు చూసి ఏమైనా ఆశక్తి కరమైన అంశాలను స్క్రీన్ షాట్ తీసి ఉంచుకుంటాను.ప్రతీ గురువారం భవిత,ఈనాడు ప్రతిభ,సాక్షి ఎడ్యుకేషన్ లను చూస్తుంటాను.
సెమిష్టరు పరీక్షలప్పుడు అంతర్జాల సౌకర్యాన్ని తీసేస్తారు.ఆ పరీక్షలు మొన్న జరిగాయి కదా,ఆ వారమంతా బయట ఏంజరుగుతుందో తెలియక పిచ్చెక్కినట్లు అనిపించింది.ఇంటికి వచ్చేతప్పుడు కూడా నెట్ రాలేదు.ఆ రాత్రి మాకు అత్తారింటికి దారేది చిత్రం వేసారు.
మొత్తానికి ల్యాప్ టాప్ లేని RGUKT ని ఊహించుకోవడం కష్టం.కాదు కాదు...ఊహించుకోలేము.
మిమ్మల్ని కొద్ది రోజుల్లోనే కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.మాకు శనివారం భౌతిక శాస్త్ర పరీక్షతో పీయూసీ రెండవ సంవత్సరం మొదటి సెమిస్టరు పరీక్షలు పూర్తయ్యాయి.నేను నిన్ననే ఇంటికి వచ్చాను.జనవరి 18 వరకూ మాకు సెమిస్టరు బ్రేక్.అంటే సెలవులన్నమాట.కానీ నేను ఇంతకు చెప్పినట్టు మాకు ఈ సెలవుల్లో జీవశాస్త్రం అదనంగా తీసుకున్నవారికి తరగతులు జరుగుతాయి.డిసెంబరు 2 నుండి 28 వరకూ ఉంటాయి.మొన్న జరిగిన వేసవి సెలవుల్లో మేము చదివిన జీవాశాస్త్రం మార్కులు మా జీపీయే లో కలిపారు.నాకు చాలా బాగ వచ్చాయి.నాకు చాలా ఆనందమేసింది.చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది.మున్ముందు చెప్తానే!!