క్విల్లింగ్...Jewellery
మోహన
ఆదివారం, జూన్ 21, 2015
0 Comments
ఫేస్ బుక్ లో క్విల్లింగ్ చెవి జుంకాలు ఎన్ని ఉన్నాయో!!!మాకూ అలాగ చెయ్యాలనిపించింది..చిన్నచిన్న పువ్వులు,ఆకులు లాంటివి చెయ్యడం వచ్చు కానీ..ఇలా చెవి జుంకాలు చెయ్యడం తెలియదు..అయితే ఈ అంతర్జాలం ద్వారా నేర్చుకోలేనివి ఏమున్నాయి..ఫలానాది చెయ్యడం నాకు రాదు అనడానికి లేదు....అలా అంతర్జాలం ద్వారా చూసి నేర్చుకున్నాం..ఇంతకీ చెయ్యడం వచ్చేసింది..సరే...మరి అవి తయారు చెయ్యడానికి కావల్సిన సామాగ్రి కావాలి కదా!!
ఆన్ లైన్ అంగళ్ళలో ఉన్నాయి కానీ...షిప్పింగ్ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి..ఏం చెయ్యాలో అర్ధం కాలేదు...ఫేస్ బుక్ లో అలాంటివి అమ్మే కొన్ని పేజీలు దొరికాయి...వాటిలో కూడా ఆ కొరియర్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి..చివరికి మా పాలకొల్లులోనే మామిడిపల్లి ఫ్యాన్సీ దుకాణం లో దొరికాయి...హమ్మయ్య...దొరికేసాయ్...అని కొనుక్కుని తెచ్చేసుకున్నాం..కానీ అక్కడ సిల్వర్ కలర్ వి లేవట...ప్చ్..క్విల్లింగ్ పేపర్స్ అమెజాన్ ద్వారా తెప్పించుకున్నాం..ఆ తర్వాత ఇలా....