నా ఉద్యోగ ప్రయాణం - 5 @భాగ్యనగరం
మోహన
సోమవారం, అక్టోబర్ 28, 2019
2 Comments
అక్టోబర్ 4, 2018 నుండి….
Google image |
హైదరాబాదు ప్రయాణం..మా డాడీ కి నాకు RAC లో సైడ్ లోయర్ బెర్త్ వచ్చింది. ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఉదయం 4:30 కి సికింద్రాబాద్ లో దిగాము. ఆ రోజు గురువారం. దగ్గర్లో ఒక లాడ్జి కి వెళ్లి ఫ్రెష్ అయ్యి, కొంచెం సేపు పడుకుని 8 కి ఆఫీసు కి బయల్దేరాం. (CGO టవర్స్, కవాడిగూడ, సికింద్రాబాదు) క్యాంటీన్ లోనే టిఫిన్ చేసి అక్కడే కూర్చున్నాం. 9:30 తర్వాత స్టాఫ్ అందరూ వచ్చాక నా joining process అంతా చేశారు. స్టాఫ్ ఐడీ కార్డు ఇచ్చారు. ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ లో నమోదు ప్రక్రియ అయింది.
ఆ రోజంతా సర్వీస్ బుక్ తెరవడం..home town details ఇవ్వటం...వీటితో నే సరిపోయింది. మా డాడీ నన్ను ఆఫీస్ లో వదిలేసి దగ్గర్లో ఉన్న హాస్టల్స్ వెతికారు. ఒక km దూరం లో నడిచి వెళ్లేలా ఒకటి దొరికింది. సాయంత్రం డాడీ నన్ను అక్కడ దిగబెట్టి మళ్లీ రైల్వే స్టేషన్ కి వెళ్లిపోయారు. నేను వెంటనే జాయిన్ చేసుకుంటారు అని అనుకోలేదు. మళ్లీ రావాల్సి వస్తుందేమో అని 3-4 జతల బట్టలు మాత్రమే తెచ్చుకున్నా అంతే..😏
ఇదే మా cgo టవర్స్ |
నాకేంటో హాస్టల్ కీ, ఆఫీస్ కి రూటంతా గజిబిజి గా అనిపించేది. 😵ఆ మూడు రోజులు డాడీ పక్కన ఉన్నారు కాబట్టి ఏం భయం వేయలేదు. శనివారము డాడీ వెళ్ళిపోతారు.. అప్పుడు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఉన్నా కూడా..ఎందుకో భయం వేసేది. దాన్ని వాడటం అప్పటికి నాకంత తెలీదు. అందుకే తీవ్రంగా ఆలోచించి ఒక పరిష్కారం కనిపెట్టాను😁 సౌండ్ రికార్డర్ ద్వారా దార్లో ఉన్న లాండ్ మార్క్స్, షాపుల పేర్లు అన్నీ రికార్డ్ చేసుకున్నా..వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు...అలా రెండు మూడు సార్లు తిరిగి ఒక అవగాహన కి వచ్చాను. తర్వాత శనివారం సెలవు కాబట్టి ఇంటి నుండి తెచ్చుకోనివి అన్నీ షాపింగ్ చేశాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ చేశాం. అక్కడ నేను కొన్నవి ఒక చెప్పుల జత, చేతి గడియారం, పర్సు..ఆశ్చర్యం ఏంటంటే ఇవి ఇప్పటికీ పని చేస్తున్నాయి..ఇది నేను ఊహించనిది.
డాడీ ఆ రోజు సాయంత్రమే బయల్దేరిపోయారు. 😔నా దగ్గర అప్పటికి మొబైల్ లో balance కూడా లేదు.. కొన్ని రోజుల క్రితమే MNP ద్వారా docomo నుండి bsnl కి మార్పించాము. అది ఇంకా ఎనేబుల్ కాకపోవడం వలన ఇబ్బంది అయింది. హాస్టల్ ముఖం ఎరిగిన దాన్నే కానీ ఇక్కడ ఏమో అంతా కొత్తగా అనిపించింది.
ఆదివారం తర్వాతి సోమవారమే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది 😳grade up app ద్వారా. ఇక్కడికి వచ్చే ముందు అప్లై చేసిన kvs prt పరీక్ష డిసెంబర్ చివర్లో ఉంటుందని. నేను జనవరిలో ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ctet కీ దీనికీ అంత వ్యవధి లేదు. ఇక అప్పటి నుండి నిర్ణయించుకున్న రోజూ కొంచెం సేపు అయినా చదవాలి అని. అప్పటికి నా దగ్గర పుస్తకాలు ఏమీ లేవు...కానీ YouTube నుండీ, unacademy నుండీ వీడియో లు చూస్తూ notes రాయడం మొదలు పెట్టాను. Grade up నుండి నెలవారీ గా వచ్చే కరెంట్ అఫైర్స్ pdf డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను. అలాగే హిందీ గ్రామర్ కి ఒక మంచి notes pdf పుస్తకం దొరికింది. అది నాకు చాలా అంటే చాలా ఉపయోగపడింది. 😇
ఒక రోజు ఏమైంది అంటే...ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై maps చూడకుండా అమ్మ, చెల్లితో మాట్లాడుతూ ఆఫీసు కు నడుస్తున్నా. చాలా చిన్న గల్లీలు కావటం వల్ల దారి తప్పిపొయాను🤕 ఒక్కసారిగా భయం వేసి కాల్ ఆపేసి మ్యాప్స్ లో లొకేషన్ చూసాను. ఆఫీసుకు ఇంకా 10 నిముషాల దూరం లో ఉన్నట్టు చూపిస్తుంది.🤥బాబోయ్..చివరికి అలా మాప్స్..ఇంకా దారిలో కనబడిన వాళ్ళ సహాయంతో చేరుకో గలిగాను. ఆ తర్వాత ఇంకెప్పుడూ ఏమరుపాటు తో నడవలేదు.🙁
జాయిన్ అయిన 15 రోజులకే దసరా!!..అప్పుడే ఇంకో విషయం తెలిసింది. Kvs LDC typing టెస్టు కి సెలెక్ట్ అయ్యా కదా..దాని dates ఎనౌన్స్ చేశాడు. నవంబర్ లో అది కూడా..డిల్లీ లో అంట..అంతకు ముందు వరకు టైపింగ్ టెస్ట్ కి వెళ్ళాలి అనే ఉత్సాహం ఉండేది. కానీ ఇప్పుడు అంతగా అనిపించలేదు. ..అందుకే వదిలేసా. 😏
దసరా కి ఇంటికి రావడం కుదరదు ఏమో అనుకున్నా అప్పుడు..కానీ 3 రోజులు సెలవులు రావడం తో ఇంటి మీద బెంగ ఎక్కువైంది. శుక్రవారం దసరా సెలవు.. శని, ఆదివారాలు కలిసొచ్చేయి. ఇంటికి తీసుకు వెళ్లడానికి డాడీ వచ్చారు మళ్లీ🙆..ఆ రోజు RAC కన్ఫర్మ్ అయ్యి బెర్తులు దొరికాయి కాబట్టి సరిపోయింది. కానీ తిరుగు ప్రయాణం ఎలాగో ప్లాన్ చేసుకోలేదు. దసరా మూడు రోజులు ఇంటి దగ్గర గడిపేసి హాస్టల్ కీ కావాల్సినవి..పుస్తకాలు గట్రా సర్దేసుకుని ప్రయాణమయ్యాను.
బస్సు టికెట్ కోసం ప్రయత్నించాము కానీ దొరకలేదు. ఇక జనరల్ భోగి ప్రయాణమే గతి. ఆ రోజు నిజంగా నరకం కళ్ళ ముందు కనపడింది.😱😱 ఆదివారం కావటం వలన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (7 గం.) కాకుండా ఇంకో స్పెషల్ ఫేర్ ట్రైన్ ఉంటుంది. మాకిక్కడ seat దొరకదు అని డాడీ నరసాపురం వెళ్లి seat పట్టుకున్నారు. అక్కడ కూడా చాలా ఎక్కువ మంది జనం ఉన్నారట. పోలీసులు క్యూ ద్వారా ట్రైన్ ఎక్కించారు అంట. ఒక seat అయితే దొరికింది. కానీ రాత్రంతా కదలటానికి , కాలు కదపటానికి వీల్లేకుండా అయింది. 😰విజయవాడ దాకా కొంచెం బాగానే అనిపించినా తర్వాత అక్కడ చాలా మంది ఎక్కేసారు. ఎక్కడ చిన్న ఖాళీ దొరికినా కూర్చునిపోయారు...కొంతమంది అయితే పడుకున్నారు కూడా.. దానికి తోడు పొద్దున 6కి హైదరాబాద్ చేరాల్సినది 9 కి చేరింది. చాలా నీరసం అనిపించింది. ఆ రోజు ఆఫీసు లో మధ్యాహ్నం నిద్ర వచ్చినా ఆపుకున్నా😩😴….రద్దీ సమయాల్లో రిజర్వేషన్ లేని ప్రయాణం ఆరోగ్యానికి హానికరమని తెల్సుకున్నాను..అలా మొట్ట మొదటిసారి ఒక్కదాన్నే హైదరాబాద్ వచ్చేసాను...🤩

ఈ టపా ఎలా ఉందో చెప్పడం మరవకండి..!!
Google image |