నిన్న పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో సంక్రాంతి సంబరాలు మా పాఠశాల లో జరిగాయి.దీనికి MLA Dr.నిమ్మల రామానాయుడు గారు అధ్యక్షత వహించారు. నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు జరిగాయి.ఆ ప్రాంగణానికి సంక్రాంతి శోభ వచ్చింది.నిజంగా పల్లెలో ఉన్నట్టు అనిపించింది.ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు బాగున్నాయి.ప్రభుత్వ పాఠశాలలకు అవకాశం ఇవ్వలేదేమో!మా పాఠశాలకి పెద్ద మైదానం ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీమతి పీతల సుజాత పాల్గొన్నారు."సంక్రాంతి వచ్చిందె తుమ్మెదా" పాట సుమారు పది సార్లు విని ఉంటాం..ఆకాశంలో టపాకాయల వెలుగులు కన్నుల విందుగా ఉన్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు,హరిదాసులు,రంగురంగుల రంగవల్లులు,పిట్టలదొర,సోదెమ్మల వేషాలు,దేశవాళీ ఆవులు,కపిల ఆవులూ...అబ్బో...ఇలా ఎన్నో...కనులవిందుగా ఉన్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...