10, మార్చి 2015, మంగళవారం

నిన్న నేను "అతడు అడవిని జయించాడు" నవలను చదివాను.అది పూర్తిగా రాయలసీమ మాండలికంలో ఉన్నట్లుంది.నేను అర్ధం చేసుకోవడానికి "ఇంచుక" సమయం పట్టింది.అదొక విభిన్నమైన కథాంశం.నాకు సాధారణంగా కుటుంబ కథలంటే ఇష్టం...కానీ ఈ నవలను చదివాక ఇలాంటి కథలంటే కూడా నాకు ఇష్టం కలిగింది.ఆ కథ చదువుతుంటే నేనూ ఆ ముసలివానితో పక్కనే తిరుగుతూ జరిగినదంతా గమనిస్తున్నట్టు అనిపించింది.చదువూన్నంతసేపూ పుస్తకాన్ని పక్కన పెట్టాలనిపించలేదు.మొత్తానికి రెండు గంటల్లో పూర్తి చేసేసాను.అందులో నాకు చాలా పదాలకు అర్ధం తెలియలేదు...అందులో నాకు బాగా గుర్తు ఉన్న పదాలు..."సుంక్రేసు చెట్టు","తీంట్ర పొదలు",తోటి గువ్వ"...ముఖ్యంగా "సుక్క పంది"..ఈ పదాలకు అర్ధం మీకు తెలిస్తే నాకు చెప్పరూ....!

ఈ నవల్లో నాకు నచ్చిన వాక్యాల్లో ఓ రెండు..."పందులు గునగున నడచివస్తుంటే నల్లగుండ్లు దొర్లుకుని వస్తున్నట్లుంది"...
"పక్షికి గాని,జంతువుకు గాను మానవుడు చేయగల మహోపకారం-వాటి మానాన వాటిని వదిలిపెట్టడమే"


చివరగా నేను చెప్పేదేంటంటే పుస్తక ప్రియులంతా తప్పకుండా...చదవవల్సిన ముఖ్య నవల "అతడు అడవిని జయించాడు"

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...

Freerice.com

Online game to end hunger

freeflour