ఒక శుభదినాన YouTube లో పాటలు చూస్తుంటే..video suggestions లో నాకు "వారాయ్" పాట కనిపించింది. నాకేంటో మరి ఆ పాట ని (తెలుగు అయినా తమిళం అయినా) ఎన్ని సార్లు చూసినా విన్నా తనివి తీరదు...ఆ పిచ్చి తోనే పదో తరగతి ఫేర్వెల్ పార్టీ లో ఇంకో అమ్మాయితో కలిపి పాటను పాడి వినిపించాను. (ఎలా ఉందో విన్న వారికే తెలియాలి. ఇపుడు మాత్రం పాడమనకండి 😅)..
ఎప్పుడో 14 సం|| క్రిందటి మాట. సినిమా విడుదల అయినప్పటి సంగతి. ఇప్పటి కంటే అప్పట్లో సినిమాలకి థియేటర్లకు వెళ్ళేది ఎక్కువగా ఉండేది. అలాగే ఒకరోజు మా పోరు పడలేక డాడీ అందర్నీ ఆ సినిమాకి తీసుకెళ్లారు. అప్పుడు నాకు ఏడెనిమిది ఏళ్లు ఉండొచ్చేమో. అప్పట్లో మా డాడీ కి Hero Honda CD 100 ఉండేది. దానిమీద అమ్మ, డాడీ, నేను, చెల్లి సినిమాకి వెళ్ళాం. ఆ సినిమా చూస్తున్నపుడు సినిమా హాల్లో నా ప్రతిస్పందన ఏమీ గుర్తు లేదు..కానీ ...తర్వాత జరిగినవి మాత్రం అలా నా మస్తిష్కంలో ముద్ర పడిపోయాయి. అసలు విషయం చెప్పడం మరిచిపోయాను. ఆ సినిమాకి వెళ్ళింది రెండో ఆటకి..హా..అవునండీ..వచ్చేటపుడు బండి మీద ఇలా కూర్చున్నాం...పెట్రోలు టాంక్ మీద చెల్లి, తర్వాత డాడీ, తర్వాత నేను,..వెనుక అమ్మ..అయితే ఆ సినిమా చూశాక కలిగిన భయమో ఏమో గానీ..ఇంటికి వచ్చేటపుడు బండి మీద కూర్చుని వెనక్కి వెనక్కి చూసా. అప్పట్లో అదొక భయం..ఎక్కడ చంద్రముఖి మా బండి వెనకాలే వచ్చేస్తుందో ఏమో..లకలకలకమని అరుచుకుంటూ అని😝..
ఇంకా అపుడు వేసవికాలం కదా..రాత్రుళ్ళు నేల మీదే పడుకునే వాళ్ళం. తలుపులు కొంచెం తెరిచి ఉంచేవాళ్ళం చల్ల గాలి కోసం. అసలే వేసవి..పైగా రాత్రి సమయాల్లో నే కరెంటు కోతలు..ఇక చూడండి..మా చెల్లి నన్ను ఎలా ఆడుకునేదంటే, ఆ సమయం లో కావాలని మరీ "లకలకలక" అని గట్టిగా అనేది. అప్పుడు నా ముఖం చూడాలి😧 ఎందుకో చాలా భయం వేసేది..ఒక విధంగా మెరిసే చంద్రముఖి కళ్ళు, ఆ విశిష్టమైన తమిళ భాష మాట్లాడే ఆమె గొంతు, క్లైమాక్స్ లో అరుపులు ...ఇవన్నీ గుర్తు వచ్చేవి. అప్పట్లో "లకలకలక..." అని ఆపకుండా అనడం కూడా ఒక గొప్పే!! ఇలా మా చెల్లి నన్ను భయపెట్టడం చాలా కాలం సాగింది..తర్వాత్తర్వాత భయం గియం ఏమీ లేవనుకోండి...
కానీ చంద్రముఖి సినిమా అయిపోయాక ఏమైపోయంది? అన్న ప్రశ్న మాత్రం నాతో పాటు పెరిగి పెద్దదైంది. "నాగవల్లి" సినిమాకి వెళ్ళడానికి కారణం ఆ ఉత్సుకత నే. ఈ సినిమా చంద్రముఖి అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇదండీ!!.."చంద్రముఖి" తో నాకున్న అనుబంధం. ఇప్పుడు ఇవన్నీ గుర్తు వస్తుంటే నా ముఖం మీద ఒక చిరునవ్వు వస్తుంది😁
చంద్రముఖి సినిమా వచ్చి 14 ఏళ్ళు అయ్యిందా!!
రిప్లయితొలగించండికాలం ఎంత తొందరగా కరిగిపోయిందనిపిస్తుంది.
అప్పట్లో ఈ సినిమా చాలా మందిని బయపెట్టింది.
ముఖ్యంగా వారాయ్ పాట తమిళంలోనే ఉన్నా తెలుగు వాళ్ళను బాగా ఆకట్టుకుంది.. చంద్రముఖి సినిమా జ్యోతిక గారి నట విశ్వరూపం.
అవునండీ...!!..ధన్యవాదాలు :)
తొలగించండిబ్లాగ్ పోస్ట్‌లో రాసిన టైంలైన్ బట్టి మీరు చాలా చిన్నవారని తోస్తోంది. మీ తెలుగు చాలా బావుంది. రాస్తూ వుండండి.
రిప్లయితొలగించండిమీలాంటి వారి మాటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి..ధన్యవాదాలు లలిత గారూ!!..
తొలగించండిచాలా బాగుందండి
రిప్లయితొలగించండిధన్యవాదాలు సందీప్ గారూ...!!
తొలగించండి