29, నవంబర్ 2013, శుక్రవారం

RGUKT లో నాకిష్టమైనవి

RGUKT లో నాకు నచ్చినవి చెప్పమంటే ముఖ్యంగా ల్యాప్ టాప్.నాకు ఏదైనా విషయం అర్ధం కాకపోతే వెంటనే చలో Google లేకపోతే Wikipedia.మా తరగతి అమ్మాయిల్లో అంతర్జాలాన్ని ఎక్కువ వాడేది నేనేనేమో.ఏదైనా పోటీ ఉంటే వెంటనే నోటీస్ బోర్డ్ లో ప్రకటిస్తారు.మొన్న కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ కి మా తరగతి నుండి నేను,అనూష మా కథలు పంపిచాము.పాల్గొందాము అనుకుందే తడవుగా,తర్వాత వచ్చిన వినాయక చవితి రెండు రోజుల సెలవుల్లో కథ తయారు చేసేసుకుని,వెంటనే మా తెలుగు అనువాద పరికరం ద్వారా కథ మొత్తం టైపు చేసి,మా HRT సార్ ని అడిగి మా మెయిలు ద్వారా పంపించాము.మాకు పూర్తి అంతర్జాల సౌకర్యం లేనందువల్ల సార్ ని అడగాల్సి వచ్చింది.

  అక్కడ వసతి సదుపాయాలు చాలా బాగుంటాయి.కొన్ని వెబ్ సైట్స్ లో నుండి పుస్తకాలు దిగుమతి చేస్తాను.ఖాళీ దొరికినప్పుడు అంటే పరీక్షలు ముగిసిన సందర్భాల్లో చదువుతా.రోజూ ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,హిందు పత్రికలు చూసి ఏమైనా ఆశక్తి కరమైన అంశాలను స్క్రీన్ షాట్ తీసి ఉంచుకుంటాను.ప్రతీ గురువారం భవిత,ఈనాడు ప్రతిభ,సాక్షి ఎడ్యుకేషన్ లను చూస్తుంటాను.

సెమిష్టరు పరీక్షలప్పుడు అంతర్జాల సౌకర్యాన్ని తీసేస్తారు.ఆ పరీక్షలు మొన్న జరిగాయి కదా,ఆ వారమంతా బయట ఏంజరుగుతుందో తెలియక పిచ్చెక్కినట్లు అనిపించింది.ఇంటికి వచ్చేతప్పుడు కూడా నెట్ రాలేదు.ఆ రాత్రి మాకు అత్తారింటికి దారేది చిత్రం వేసారు.

 మొత్తానికి ల్యాప్ టాప్ లేని RGUKT ని ఊహించుకోవడం కష్టం.కాదు కాదు...ఊహించుకోలేము.

1 కామెంట్‌:

  1. "వెబ్ సైట్స్ లో నుండి పుస్తకాలు దిగుమతి చేస్తాను.ఖాళీ దొరికినప్పుడు అంటే పరీక్షలు ముగిసిన సందర్భాల్లో చదువుతా.రోజూ ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,హిందు పత్రికలు చూసి ఏమైనా ఆశక్తి కరమైన అంశాలను స్క్రీన్ షాట్ తీసి ఉంచుకుంటాను.ప్రతీ గురువారం భవిత,ఈనాడు ప్రతిభ,సాక్షి ఎడ్యుకేషన్ లను చూస్తుంటాను"- అద్భుతం; మీరు వీలుంటే బోధన రంగంలో కూడా మీ సేవలు కొనసాగించాలని ఆశిస్తున్నా.

    రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...