30, నవంబర్ 2013, శనివారం

RGUKT లో సమైఖ్యాంధ్ర

మా విశ్వవిద్యాలయంలో మేము కూడా సమైఖ్యంధ్ర ఉద్యమం చేసాము.

ఒకరోజు సాయంత్రం నూజివీడు సమైఖ్యాంధ్ర JAC వ్యవస్థాపకులు వచ్చి మాకు సమైఖ్యంధ్ర మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు.చాలా స్పూర్తిదాయకంగా అనిపించింది.

మాకు పోయిన సెమిష్టరు లో చాలా సెలవులు సమైఖ్యంధ్ర వల్ల వచ్చాయి.బయటి ప్రభావం మా మీద ఉండకపోయినా ఎందుకు ఇచ్చారో తెలియలేదు.పోనీ మమ్మల్ని బయటికి తీసుకెళ్తారా అంటే అదీ లేదు.ఆ సెలవులు ఎలాంటివంటే తరగతులలో కూర్చొని చదువుకోవడమే.మెంటార్స్ రారు.అలాంటప్పుడు ఇవ్వడం ఎందుకో.బయట విద్యార్థులేమో వాళ్ళ చదువులు వదిలేసి సమైఖ్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తుంటే మేము మాత్రం హాయిగా కూర్చొని చదువుకుంటున్నాము.నాకిది నచ్చలేదు.

ఓ రోజు(నవంబర్ 1 న) అసెంబ్లీ అవ్వగానే మా PUC కో ఆర్డినేటర్ గారు ఇప్పుడు సమైఖ్యాంధ్ర విద్యార్థి గర్జన కు PUC 2 వాళ్ళని తీసుకెళ్తానన్నారు.మేము నమ్మలేకపోయాము.అంతకుముందు ఒకసారి మొత్తం విద్యార్థులందరూ క్యాంపస్ మొత్తం ఒకసారి తిరిగి సమైఖ్యాంధ్ర నినాదాలు చేశాము,కానీ బయటకు వెళ్ళలేదు.కానీ ఇప్పుడు నూజివీడు సెంటరులో ఉన్న పెద్దగాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలి.ఆరోజూ ఎండ గొప్పగా ఉంది.మాకదేమీ బాధనిపించలేదు.మేమందరం వెయ్యి మంది ఉన్నాము.మమ్మల్ని ఫిసికల్ డైరెక్టర్స్ కంట్రోల్ చేసారు.ఇద్దరిద్దరు కలిసి నడవమన్నారు.నేను ,రమ్య నడిచాము.అమ్మో చాలా దూరం ఉంది.ప్రతీ సారీ ఆటోలో వస్తాం కదా తెలియలేదు.చివరికి అక్కడికి వెళ్తే అక్కడ కూర్చోవడానికి స్థలం లేదు.అంటే అంతమంది వస్తారని నిర్వాహకులు ఊహించి ఉండరు.మమ్మల్నందర్నీ రోడ్డు పై కాసేపు కూర్చోబెట్టారు.మేము సమైఖ్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసాము.ఫోటోలు తీసుకున్నారు.మంచినీళ్ళు కూడా లేవు.నాకైతే కొంతసేపుంటే పడిపోతానేమో అనిపించింది.కొంతసేపటికి అక్కడ్నుంచి సబ్ కలెక్టరు కార్యాలయానికి వెళ్ళాము.అక్కడ చిన్నపాటి సభ జరిగింది.తిరిగొచ్చేటప్పుడు మా మొహాలు వాడిపోయాయి.కనీసం డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు.చేతులూపుకుంటూ వెళ్ళాను.ఒకవేళ తీసుకెళ్ళుంటే ఏమైనా కొనుకొచ్చేదాన్ని.ప్చ్..ఏం చేస్తాం.అవకాశం చేజారింది.ఇదండీ మా సమైఖ్యాంధ్ర.


కొసమెరుపు:- మా కళాశాలలో తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు.

3 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...