19, ఏప్రిల్ 2013, శుక్రవారం


చాలా రోజుల తర్వాత బ్లాగు రాస్తున్నాను.నేను RGUKT లో చేరేక తర్వాతి వారం అమ్మ,నాన్న,చిన్నా(మా చెల్లి హరిత)వచ్చారు.చిన్నా పెదవేగి(ఏలూరు) నవోదయ లో పదవ తరగతి చదువుతుంది.అమ్మా వాళ్లు ముందు అక్కడికి వెళ్లి చిన్నా ని తీసుకుని నా దగ్గర కి వచ్చారు. వాళ్ళని చూడగానే నాకు ఏడుపు ఆగలేదు.ఎందుకో అలా ఏడ్చేశాను.వాళ్ళు రావడమే మధ్యాహ్నం వచ్చారు. ఆదివారం తల్లిదండ్రులకు కూడా భోజనం పెడతారు.ఫ్లేటు 30/-. చిన్నా మాత్రం నాతో పాటే మా మెస్స్ లో తినేసింది. PUC అమ్మాయిలకు 3 భోజనశాలలు ఉన్నాయి.వాటి పేర్లు Windows,Linux ,Mac Operating Systems కదూ. ఆదివారం తల్లిదండ్రుల కోసం ఒక మెస్స్ ను కేటాయిస్తారు. అందులో కూర్చుని మాట్లాడుకున్నాం. నాకు అప్పటి వరకూ నాకు Mobile Phone లేదు. చాలా మంది తెచ్చుకున్నారు.కానీ నాకు తెలియక తెచ్చుకోలేదు. ఆ రోజు డాడీ తెచ్చారు. దాన్ని కొన్ని నెలల ముందు కొన్నారు. ఇంట్లోకని. కానీ నాకు దక్కింది.అది Intex 2020 QT Memory Card కూడా ఉంది. పాటలు కూడా ఉన్నాయి.నాకు పాటలు వినడం చాలా ఇష్టం.సాయంత్రం 4 గంటలకు వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్నా ని డాడీ తీసుకెళ్ళారు. అమ్మ ఏమో ఇంటికి వెళ్ళి పోయింది.
అంతకు ముందు రోజు మాకు సినిమా వేశారు,అది "దూకుడు" సినిమా.ఎక్కడో తెలుశా మా తరగతి లోనే. Projectors ఉన్నాయి కదా.అందులో. మాది Kappa-1 కదా. మా Room లో అమ్మాయిలని, Kappa2 లో అబ్బాయిలని కూర్చోబెట్టారు. అలా చూడడం చాలా బాగుంది. ప్రతీ శనివారం సినిమా వేస్తానన్నరు. కానీ పరీక్షల సమయములో వెయ్యరట.అక్కడితో ఒక వారం పూర్తయ్యింది.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...

Freerice.com

Online game to end hunger

freeflour