మొన్న మా అమ్మ,నేను,చెల్లి మనం సినిమాకి వెళ్ళాము.అసలు విక్రమసిమ్హ కి వెళ్దామనుకున్నాం.కానీ ఎందుకో మనం కి వెళ్ళలనిపించింది.చివరిసారి "నాగవల్లి" సినిమాకి చెల్లితో వెళ్ళాను.సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ థియేటర్ కి ఇప్పుడు మనంకి.మారుతి టాకీసుకి ఆటోలో వెళ్ళాము.టిక్కెట్టు 100 రూపాయలు.మేము వెళ్ళేసరికే బాల్కనీ టిక్కెట్స్ అయిపోయాయి.హాల్ మధ్యలో కూర్చున్నాం(కూర్చోబెట్టారు).టిక్కెట్ మీదే సీట్ అలాట్మెంట్ ఉంది.టీవీలోనే అనుకుంటే సినిమా థియేటర్లో కూడా యాడ్స్ గోల తప్పట్లేదు.ప్రభుత్వ జారీ చేసేవైతే పర్వాలేదు కానీ,సబ్బులు,సర్ఫ్ ల యాడ్స్ అవసరం లేదనుకుంటా.జంప్ జిలాని ట్రైలర్ కూడా వేశారు. ఇక "మనం" కి వస్తే ముందు ఊహించినట్టే బాగుంది.ముఖ్యంగా పిక్చరైజేషన్ చాలా చాలా బావుంది.కెమెరా పనితనం బాగుంది.తర్వాత సంగీతం కూడా,ముఖ్యంగా "కనులను తాకే" పాట నాకు నచ్చింది.సమంతని బాగా చూపించారు.శ్రియ రామలక్ష్మి పాత్రలో కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా అనిపించినా బావుంది..నాగార్జున,నాగేశ్వర రావుల నటనే సినిమాకి హైలెట్.ముగింపులో అఖిల్ ఎంట్రీ బావుంది.
మళ్ళీ మందు సన్నివేశాలు,"లేడీస్ ఫస్ట్" సన్నివేశాలు లేకపోయినా సినిమా బావుండేదేమో!అమ్మ సెంటిమెంట్ బాగుంది. మొత్తానికి సినిమా చాలా బాగుంది.సినిమా చూసిన తర్వాత రోజు "కనులను తాకే" పాటను డౌన్ లోడ్ చేసి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు.
మా విశ్వవిద్యాలయంలో మాకు ఉబుంటు OS ఉంటుందని చెప్పా కదా!ఉబుంటు 11.10 వర్షన్ మాది.అందులో టెర్మినల్ లో ఫైల్స్ ని జిప్ చేసుకుంటాం.అందులో కంప్రెస్స్ అనే ఆప్షన్ లేదు.అలా కొన్ని ఫైల్స్ జిప్ చేసి డ్రైవ్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చా.మొత్తం పూర్తయ్యాకే టెర్మినల్ ని క్లోజ్ చేశా.ఆ జిప్ ఫైల్స్ మా విండోస్ 7 లో ఓపెన్ కావట్లేదు.అందులో కొన్ని ఓపెన్ అయ్యాయి.కొన్ని కావట్లేదు.అవి జిప్ సరిగా కాలేదని ఎర్రర్ వస్తుంది.ఇక జిప్ లోని ఫైల్స్ బయటికి రావా?అందులో ముఖ్యమైన బుక్స్ అవీ తెచ్చుకున్నా! ప్లీజ్ తెలిస్తే చెప్పరూ....
మొన్న వచ్చిన గాలివానకి నాన్న గారు పనిచేసే కళాశాల పక్కన ఉన్న మామిడితోటలో కాయలు పడిపోయాయట.వాటిని అమ్ముతుంటే వాటిని కొన్నారట.అవే ఇవి.చాలా పెద్దగా ఉన్నాయి,తియ్యగా కూడా ఉన్నాయి.ఇంకా చెట్టునే ఉంటే ఇంకా బావుండేవేమో!
ఉదయం 7.30 కి DD సప్తగిరి లో "ఆణిముత్యాలు" శీర్షికన పాత తెలుగు చలనచిత్రాలను ధారావహిక రూపంలో ప్రసారం చేస్తారు.నాకవి చూడటం అలవాటు.దానిలో భాగంగా ఈరోజు సోమవారం కదా.ఒక చిత్రం ప్రారంభమయింది.దాని పేరు చూడలేకపోయా.
ఈ రోజు జరిగిన భాగం కథ చెపుతాను.ఆ చిత్రం పేరు చెప్పగలరేమో చెప్పండి.
రంగయ్య(ఎస్వీ రంగారావు),సీతమ్మ(పేరు తెలియదు) దంపతులకు ఇద్దరు పిల్లలు.సీతమ్మ గర్భవతి,ఒక బిడ్డను కని పురిట్లోనే చనిపోతుంది.
రంగయ్య వెల్డింగ్ షాపులో పనిచేస్తూ ప్రమాదం జరిగి రెండు కళ్ళూ పోతాయి.అప్పుల వాళ్ళు డబ్బులు కడితేనే సరుకులు ఇస్తామంటారు.వీరి పక్కింట్లో అల్లు రామలింగయ్య భార్యతో కలిసి ఉంటాడు.అతనికి రంగయ్య అంటే ఇష్టం ఉండదు.అతను అన్న నిష్టూరపు మాటలు విని రంగయ్య భరించలేక ఇంటి నుండి పిల్లలకి చెప్పకుండా వెళ్ళిపోతాడు.ఈ పిల్లలు దిక్కులేనివాళ్ళవుతారు.అల్లు భార్య కి పిల్లలు ఉండరు.అందుకు ఈ పిల్లలంటే ఆవిడకి అభిమానం.ఒకరోజు భర్తకు తెలియకుండా వాళ్ళకి భోజనం ఇస్తుంది.ఈ పిల్లల మూలంగా షావుకారుని తిడుతుంది.ఇవన్నీ తెలిసి అల్లు రామలింగయ్య ఆవిడని తన్ని తరిమేస్తాడు.
ఆ పిల్లలు ఇదంతా వారివల్లే జరుగుతుందనీ,వారి ఇల్లుని అప్పులవాళ్ళు తీసేసుకుంటారనీ తెలిసి ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారు.రైళ్ళో TC వచ్చేసరికి ఆ ముగ్గురు పిల్లల్లో పెద్దదైన అమ్మాయి మూడో బాబుతో టికెట్ లేక దొరికిపోతుంది.TC వారిద్దరినీ రైలు నుండి దించేస్తాడు.రెండో అబ్బాయి సీటు కింద పడుకుని అందులోనే ఉండిపోతాడు.
ఆ రెండో బాబు నాటకాల కంపెనీలో చేరుతాడు.మొదటి అమ్మాయి చిన్న బాబుతో కలిసి వానలో తడవకుండ ఉండేందుకు ఒక ఇంటిని ఆశ్రయిస్తుంది.ఆ ఇంటిలో ఆ అమ్మాయి వయసున్న అబ్బాయి,లోపలికి రమ్మని అన్నం పెడతాడు.దీనికి వాళ్ళ నాన్న వద్దంటాడు.
ఈరోజు భాగంలో ఈ కథ జరిగింది.ఇది ఏ చిత్రకథ అయి ఉంటుందో చెప్పండే.....
ఒక ఆదివారం మా కళాశాలకి విశాలాంధ్ర మొబైల్ వ్యాన్ వచ్చింది.వెంటనే వెళ్ళి చూడాలనిపించింది.పుస్తకాలు తప్పకుండా కొనాలనుకున్నా.అప్పటి వరకు దాచుకున్న డబ్బులు 300 రూపాయలు ఉన్నాయి.నేను కొనాలనుకున్న పుస్తకాల మొత్తం ధర సుమారు 600 అయింది.ఆ పుస్తకాలలో ఖరీదైనది బారిష్టర్ పార్వతీశం.అదొక్కటీ 300/- దాన్ని మార్చేసి చిన్న పుస్తకాలు తీసుకున్నా.నాక్కవల్సిన 300/- నా స్నేహితురాలి నాన్న గారి దగ్గర తీసుకున్నా.మా నాన్న గారు డబ్బులు నా బ్యాంకు ఖాతాలో వేశాక నేను వాటిని తీసుకుని తనకు ఇచ్చేశా.మొత్తానికి మంచి పుస్తకాలు కొన్నాననిపించింది.నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులుంటే ఇంకొన్ని మంచి పుస్తకాలు కొనేదాన్ని ప్చ్.నాకైతే మొత్తం పుస్తకాలు కొనుక్కోవాలనిపించింది.అలా కుదరదు కదా!!!
మరి ఈ పుస్తకాలు బావున్నాయా? మొత్తానికి ఈ "కొత్త పుస్తకాలు" మా చిన్న గ్రంథాలయం లోకి చేరాయి.