ఉదయం 7.30 కి DD సప్తగిరి లో "ఆణిముత్యాలు" శీర్షికన పాత తెలుగు చలనచిత్రాలను ధారావహిక రూపంలో ప్రసారం చేస్తారు.నాకవి చూడటం అలవాటు.దానిలో భాగంగా ఈరోజు సోమవారం కదా.ఒక చిత్రం ప్రారంభమయింది.దాని పేరు చూడలేకపోయా.
ఈ రోజు జరిగిన భాగం కథ చెపుతాను.ఆ చిత్రం పేరు చెప్పగలరేమో చెప్పండి.
రంగయ్య(ఎస్వీ రంగారావు),సీతమ్మ(పేరు తెలియదు) దంపతులకు ఇద్దరు పిల్లలు.సీతమ్మ గర్భవతి,ఒక బిడ్డను కని పురిట్లోనే చనిపోతుంది.
రంగయ్య వెల్డింగ్ షాపులో పనిచేస్తూ ప్రమాదం జరిగి రెండు కళ్ళూ పోతాయి.అప్పుల వాళ్ళు డబ్బులు కడితేనే సరుకులు ఇస్తామంటారు.వీరి పక్కింట్లో అల్లు రామలింగయ్య భార్యతో కలిసి ఉంటాడు.అతనికి రంగయ్య అంటే ఇష్టం ఉండదు.అతను అన్న నిష్టూరపు మాటలు విని రంగయ్య భరించలేక ఇంటి నుండి పిల్లలకి చెప్పకుండా వెళ్ళిపోతాడు.ఈ పిల్లలు దిక్కులేనివాళ్ళవుతారు.అల్లు భార్య కి పిల్లలు ఉండరు.అందుకు ఈ పిల్లలంటే ఆవిడకి అభిమానం.ఒకరోజు భర్తకు తెలియకుండా వాళ్ళకి భోజనం ఇస్తుంది.ఈ పిల్లల మూలంగా షావుకారుని తిడుతుంది.ఇవన్నీ తెలిసి అల్లు రామలింగయ్య ఆవిడని తన్ని తరిమేస్తాడు.
ఆ పిల్లలు ఇదంతా వారివల్లే జరుగుతుందనీ,వారి ఇల్లుని అప్పులవాళ్ళు తీసేసుకుంటారనీ తెలిసి ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారు.రైళ్ళో TC వచ్చేసరికి ఆ ముగ్గురు పిల్లల్లో పెద్దదైన అమ్మాయి మూడో బాబుతో టికెట్ లేక దొరికిపోతుంది.TC వారిద్దరినీ రైలు నుండి దించేస్తాడు.రెండో అబ్బాయి సీటు కింద పడుకుని అందులోనే ఉండిపోతాడు.
ఆ రెండో బాబు నాటకాల కంపెనీలో చేరుతాడు.మొదటి అమ్మాయి చిన్న బాబుతో కలిసి వానలో తడవకుండ ఉండేందుకు ఒక ఇంటిని ఆశ్రయిస్తుంది.ఆ ఇంటిలో ఆ అమ్మాయి వయసున్న అబ్బాయి,లోపలికి రమ్మని అన్నం పెడతాడు.దీనికి వాళ్ళ నాన్న వద్దంటాడు.
ఈరోజు భాగంలో ఈ కథ జరిగింది.ఇది ఏ చిత్రకథ అయి ఉంటుందో చెప్పండే.....
సంతానం సినిమా
రిప్లయితొలగించండిఅవును. ఆ చిత్రం ‘సంతానం’. లతా మంగేష్కర్ పాడిన తెలుగు పాట ‘నిదరపోరా తమ్ముడా’ ఈ చిత్రం లోనిదే..
తొలగించండిఅవునండి ఇది సంతానం చిత్రమే!1955 లో విడుదలైందని అంతర్జాలం ద్వార తెలుసుకున్నా."నిదురపోరా తమ్ముడా" పాట బావుంది.రోజూ సప్తగిరిలో చిత్రం చూస్తున్నా.స్పందించినందుకు ధన్యవాదాలు.
తొలగించండి