31, మే 2014, శనివారం

"మనం" కి మేము

మొన్న మా అమ్మ,నేను,చెల్లి మనం సినిమాకి వెళ్ళాము.అసలు విక్రమసిమ్హ కి వెళ్దామనుకున్నాం.కానీ ఎందుకో మనం కి వెళ్ళలనిపించింది.చివరిసారి "నాగవల్లి" సినిమాకి చెల్లితో వెళ్ళాను.సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ థియేటర్ కి ఇప్పుడు మనంకి.మారుతి టాకీసుకి ఆటోలో వెళ్ళాము.టిక్కెట్టు 100 రూపాయలు.మేము వెళ్ళేసరికే బాల్కనీ టిక్కెట్స్ అయిపోయాయి.హాల్ మధ్యలో కూర్చున్నాం(కూర్చోబెట్టారు).టిక్కెట్ మీదే సీట్ అలాట్మెంట్ ఉంది.టీవీలోనే అనుకుంటే సినిమా థియేటర్లో కూడా యాడ్స్ గోల తప్పట్లేదు.ప్రభుత్వ జారీ చేసేవైతే పర్వాలేదు కానీ,సబ్బులు,సర్ఫ్ ల యాడ్స్ అవసరం లేదనుకుంటా.జంప్ జిలాని ట్రైలర్ కూడా వేశారు.
ఇక "మనం" కి వస్తే ముందు ఊహించినట్టే బాగుంది.ముఖ్యంగా పిక్చరైజేషన్ చాలా చాలా బావుంది.కెమెరా పనితనం బాగుంది.తర్వాత సంగీతం కూడా,ముఖ్యంగా "కనులను తాకే" పాట నాకు నచ్చింది.సమంతని బాగా చూపించారు.శ్రియ రామలక్ష్మి పాత్రలో కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా అనిపించినా బావుంది..నాగార్జున,నాగేశ్వర రావుల నటనే సినిమాకి హైలెట్.ముగింపులో అఖిల్ ఎంట్రీ బావుంది.

మళ్ళీ మందు సన్నివేశాలు,"లేడీస్ ఫస్ట్" సన్నివేశాలు లేకపోయినా సినిమా బావుండేదేమో!అమ్మ సెంటిమెంట్ బాగుంది.
మొత్తానికి సినిమా చాలా బాగుంది.సినిమా చూసిన తర్వాత రోజు "కనులను తాకే" పాటను డౌన్ లోడ్ చేసి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...