8, జూన్ 2013, శనివారం

వీడుకోలు

శనివారం, జూన్ 08, 2013 2 Comments
రేపే నేను మా విశ్వవిద్యాలయానికి (నూజివీడు)వెళ్ళిపోతున్నాను.మా విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.rgukt.in చూడండి.పదవతరగతిలో 9.5 పైన GPA వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివితే మరీ తొందరగా ప్రవేశం పొందొచ్చు.ఐతే ఆలస్యం దేనికి....మళ్ళి దసరా దాకా నేను మీకు అందుబాటులో ఉండను.అంతవరకూ నేను చాలా టపాలు వేశాను కదా అవన్నీ తప్పకుండా చదివేసి మీ వ్యాఖ్యలతో కామెంట్ బాక్స్ నింపేయడేం.మీ వ్యాఖ్యలను చదివి స్పందించడానికి కూడా కుదరదు కదా. మీరేమీ అనుకోకండే...మరేమో నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికీ వ్యాఖ్యలతో నా బ్లాగు నిండుగా ఉంటుందని  ఆశిస్తూ..

మరి ఉంటానే.......


మోహన








పాల ముంజెలు

శనివారం, జూన్ 08, 2013 6 Comments
ఈ రోజు అమ్మ ఒక పిండి వంట చేసింది.నేను హాస్టల్ వెళ్ళిపోతున్నాను కదా.అవేంటంటే పాలముంజెలు.రాజమండ్రి లో ఉన్న తాతమ్మ నుండి అమ్మ నేర్చుకుంది.వీటిని మా ఇంట్లో ఇప్పుడు చేయడం రెండో సారి.

చేసే విధానం

ఇవి చూడటానికి బూరెలలాగే ఉంటాయి.ముందు బూరెల లోపల ఉండే పూర్ణం చేసేసుకోవాలి.తర్వాత పాలల్లో గోధుమ రవ్వ, కొంచెం ఉప్పు,పంచదార వేసుకుని ఉడికించుకోవాలి.అది అయిపోయాక పిండిని చిన్న ఉండలు చేసుకుని అందులో పూర్ణం పెట్టి దానిని పిండితో ముసేసి లడ్డూ లా చుట్టాలి.ఆ తర్వాత వాటిని నూనె లో వేయించుకోవాలి.

ఈ చిత్రాలు మీకోసం.

పూర్ణాలు
                                       

   

గోధుమ రవ్వతో చేసిన మిశ్రమం


ఆ మిశ్రమం లో పూర్ణం పెట్టి చేసిన ఉండలు













తియ్యని పాల ముంజెలు తయారు

7, జూన్ 2013, శుక్రవారం

పాలకొల్లు విహారం-పెద్ద గోపురం

శుక్రవారం, జూన్ 07, 2013 0 Comments
నిన్న షాపింగ్ కి పాలకొల్లు సెంటర్ కి వెళ్ళాం(ఏవో పెద్దపెద్ద వస్తువులు అనుకోకండి.ఇంట్లోకి కావల్సిన చిన్న చిన్న సరుకులు).నేనైతే పెద్ద గోపురాన్ని మా కెమేరా లో బంధించడానికి వెళ్ళాను.ఎప్పట్నుంచో పెద్ద గుడిని చిత్రాలు తీయాలని ఉండేది.ఆ కోరిక బ్లాగు ప్రారంభించైనప్పటి నుండి మరీ ఎక్కువైంది.ఇదిగో ఇపుడు ఇలా నెరవేరింది.

ముందు దేశాలమ్మ జాతర జరుగుతుందని చెప్పాను కదా.ఆ గుడికి వెళ్ళాం.అక్కడ్నుంచి నడుచుకుంటూ పెద్ద గోపురానికి వెళ్ళా.ఇదిగో ఈ చిత్రాలు వెళ్తూ వెళ్తూ తీసినవి.





దీనిని గాంధీ బొమ్మల సెంటర్ అంటారు


ఇది ఏనుగుల మేడ


ఇది పెద్ద గోపురం వీధి




ఇదే పెద్ద గోపురం.సుమారు 120 అడుగుల ఎత్తు ఉంటుంది.అసలు పైకి ఎక్కి చిత్రాలు తీద్దామనుకున్నా.కానీ కుదరలేదు.ఈ పట్టు వచ్చినప్పుడు తప్పకుండా తీస్తాను.

 గుడిలో ఏదో వ్రతం జరుగుతుంది.దర్శనం అయిపోయాక ప్రదక్షిన మండపం లో ఉన్న వివిధ దేవతల ను చిత్రాలు తీశాను.


ఇది సింహ ద్వారం నుండి తీశాను.


ఈ ద్వారం నుండి గోపురం పైకి ఎక్కేది.

ఇదే కళ్యాణ మండపం






                                                           కిందవి ప్రదక్షణ మండపం లోని దేవతల విగ్రహాలు.














ఇక్కడ వినాయకుడు వెలిశారట.








ఇక్కడ శివుడు వెలిశారట.



నందీశ్వరుడు


ఈ గంట చూశారా..దీన్ని ఒక్కసారే కొట్టాలి.ఎందుకంటే ఒక్కసారి కొడితే పెద్ద శబ్దం తో ఓంకార నాదం వస్తుంది.


హోమ గుండం




ఇదిగో ఇదే ధ్వజస్థంభం.నిరుడు గాలివాన కి విరిగి పడిపోయింది.దీనిని పునర్నిర్మిస్తున్నారు.



మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నడిచి వచ్చాం.దారిలో దేశాలమ్మ ఆలయం దగ్గర ఈ విద్యుద్దీపాలంకరణలు కనిపించాయి.