ఈ వేసవి సెలవులను నేను అస్సలు మర్చిపోలేను.ఎందుకంటే నాకంటూ ఒకబ్లాగు ప్రారంభించుకున్నాను.అసలు బ్లాగు అంటే ఏంటో కూడా తెలియదు నేను బ్లాగు ప్రారంభించేనాటికి.అప్పుడు ఏం రాయాలో తెలియలేదు.ఏదో రాశాను.ఏప్రిల్,మే రెండు నెలలు అనుకోకుండా మాకు సెలవులు ఇచ్చారు.ఈ రెండు నెలలూ కూడా నాకు ఈ బ్లాగుతోనే సరిపోయింది.
ఉదయం 7 గంటలకి లేవడం.9గంటలకల్లా Laptop ముందు కూర్చోవడం.విద్యుత్తు సరఫరా ఉన్న లేకపోయినా ఏం ఫరవాలేదు కదా..ముందు నేనేమైనా టపాలు వేయాలనుకుంటే వాటిని ప్రచురించేసి, ఆ తర్వాత కూడలి,జల్లెడ,హారం,మాలిక,బ్లాగిల్లు మరియు సంకలిని లలో కొత్త బ్లాగులు వెతికి చూడడం, నాకు నచ్చితే వ్యాఖ్యలు పెట్టడం,ఇంకా కావాలనుకున్న పాటలు దిగుమతి చేసుకోవడం ...ఇదే నా పని.
నా టపాలకి ఏమైనా వ్యాఖ్యలొస్తే ఎంత ఆనందపడేదాన్నో.ప్చ్ అప్పుడే సెలవులయిపోయాయే అనిపిస్తుంది.నా బ్లాగుకి ఎన్ని Templates మార్చానో నాకే తెలియదు.నచ్చిన template పెడితేనేమో లే అవుట్ లో page elements అన్నీ చిందరవందర గా ఉండేవి.ఎంత చిరాకొచ్చేదో.చివరికి ఇప్పుడున్న Template ఉంచా.బాగుందా..
రోజూ కొత్త బ్లాగులు వెతుకుతుంటే కనీసం రోజుకొక పదివరకూ కొత్తబ్లాగులు కనిపించేవి.నాకు ఆశ్చర్యమనిపించిన బ్లాగు యశోదకృష్ణ.సాహితి గారు రోజూ ఒక టపా ను ప్రచురిస్తారు.అది కూడా ఉదయం 10:10ని. లకు.కావాలంటే మీరూ చూడండి.
మధ్యాహ్న సమయంలో నండూరి రామ్మోహనరావు గారు రచించిన "విశ్వరూపం" పుస్తకం చదివేదాన్ని.అందులో విషయాలు ఎంతో ఆశక్తికరంగా ఉంటాయి.అది ఎంతో ఉపయోగకరమైన పుస్తకం.
అసలైతే మాకు సెలవులు జూలై 21వరకు.నేను జీవశాస్త్రం అదనంగా తీసుకున్నందువల్ల ముందు వెళ్ళవల్సి వస్తుంది.మళ్ళి ఐటీ ని ఒక ఐచ్చికాంశం గా పెట్టారట.దానికి మా స్నేహితులు జీవశాస్త్రం తీసుకోని వారు నమోదు అయ్యారు.
తెలుగులో టైపు చెయ్యడం అంత కష్టం కాలేదు.ఎందుకంటే మా కళాశాలలో టైపింగ్ మేము నేర్చుకోవాలి.అక్కడ అది తప్పనిసరి.
మొదట బ్లాగు ప్రారంభించాలనుకున్నప్పుడు దేని గురించి రాద్దామూ అని ఆలోచిస్తే మా విశ్వవిద్యాలయం గురించి రాద్దాం అని RGUKT జీవితం అని శీర్షిక పెట్టాను.ఒక నెల తర్వాత ఒక్క RGUKT గురించే అయితే కుదరట్లేదు అని నా పేరు మీదే శీర్షిక పెట్టేశా.

బాగుంది. మీ బ్లాగు నేను ఫాలో అవుతున్నాను. బాగా రాస్తున్నారు.
రిప్లయితొలగించండిThank you sisira garu.
రిప్లయితొలగించండినేను కూడా ఫాలో అవుతున్నాను
రిప్లయితొలగించండిNice blog
రిప్లయితొలగించండిVery nice..keep it up....!
రిప్లయితొలగించండిblog baagundi...all the best...
రిప్లయితొలగించండిమురళి గారికి,లాస్య గారికి,మూర్తి గారికి మరియు రాఘవేందర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ బాగుంటుందండి .నేనూ చూస్తుంటా .మాది ప.గో.జిల్లానే
రిప్లయితొలగించండిDhanyavadalu radhika garu.
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ ఈ రోజే చూసానండి . బాగుంది.పేరు కూడా బాగుంది.
రిప్లయితొలగించండిthank you mala kumar garu
రిప్లయితొలగించండిబాగా రాస్తున్నారండీ!
రిప్లయితొలగించండిఇలాగే మీరు మరిన్ని మంచి కబుర్లతో ముందుకి దూసుకుపోవాలని కోరుకుంటున్నాను :)
Thank you priya garu:p
రిప్లయితొలగించండి