25, జులై 2014, శుక్రవారం

విచిత్రమైన వ్యాధి!

శుక్రవారం, జులై 25, 2014 1 Comments

Lawrence kim peek


మా విశ్వవిద్యాలయం లో రోజూ ఇ-దినపత్రిక చదవడం నా అలవాటు.ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,హిందు చదువుతాను.ఒక రోజు ఆంధ్రజ్యోతి చదువుతున్నప్పుడు ఒక వార్త చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.
అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో ఉండే "లారెన్స్ కిం పీక్"కి విచిత్రమైన వ్యాధి ఉంది.అదే "మాక్రోసిఫిలీ".


"మాక్రోసిఫిలీ"--మెదడులోని రెండు భాగాల్ని కలిపి ఉంచాల్సిన నాడులు మెదడులో ఉండవు.మొత్తం ఒకటిగా కలిసి ఉండాల్సిన మెదడు,రెండుగా విడిపోయి ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా వ్యవహరిస్తుంది.దీన్నే "Split Brain Symdrome" అని కూడా అంటారు.దీని వల్ల ఆ వ్యాధి గ్రస్తునికి విపరీతమైన జ్ఞాపక శక్తి వస్తుంది.

మెదడులో "కార్పస్ కల్లోసం" ఉండదు,దాంతో మెదడులో రెండు భాగాల మధ్య భాషాపరమైన అనిసంధానం ఏర్పర్చుకునే లక్షణాన్ని స్వతహాగా మెదడే ఏర్పాటు చేసుకుంటుంది.దీని ఫలితంగా మెదడుకి వేగంగా చదవగలగటం,చదివింది గుర్తు పెట్టుకో గలిగే సామర్ధ్యం ఉంటుంది.
లారెన్స్ కిం పీక్ జీవితం ఆధారంగా 1988లో "Rainman" అనే సినిమాను కూడా తీశారు.


ఈ వ్యాధి బాగుంది కదా!!!

24, జులై 2014, గురువారం

ఇ-పుస్తకాలు

గురువారం, జులై 24, 2014 1 Comments

New books అనే ఫోల్డర్ లో నేను అక్కడక్కడా సేకరించిన e-పుస్తకాలు ఉంచుతున్నాను.ఆశక్తి గలవారు దిగుమతి చేసుకోండి.


ఇక్కడ క్లిక్ చెయ్యండి.New books 

23, జులై 2014, బుధవారం

వేమన పద్యాల్లో కొన్ని

బుధవారం, జులై 23, 2014 0 Comments

పాలకడలిపైన పవ్వళించినవాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేల?
ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి
విశ్వధాభిరామ వినురవేమ!

కనక మృగము భువిని కద్దులేదనకుండ
తరుణి విడిచిపోయె దాశరథియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వధాభిరామ వినురవేమ!

పలుగురాళ్ళుదెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయు ఫలమేమి కలుగురా?
విశ్వధాభిరామ వినురవేమ!

మాలవానినంటి మరినీట మునిగితే 
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?
విశ్వధాభిరామ వినురవేమ!

పిండములనుజేసి,పితురులదలపోసి
కాకులకు పెట్టు గాడ్దెల్లారా
పెంట తినెడు కాకి పితురుడెట్లాయెరా?
విశ్వధాభిరామ వినురవేమ!

21, జులై 2014, సోమవారం

"దృశ్యం"-నా అభిప్రాయం

సోమవారం, జులై 21, 2014 2 Comments






నిన్న నేనూ,మా పెద్దమ్మ వాళ్ళమ్మాయి,తన స్నేహితురాలూ కలిసి "దృశ్యం" చిత్రానికి వెళ్ళాము.థియేటర్ లో జనం బాగానే ఉన్నారు.కొంచెం ముందు వెళ్ళడంవల్ల టికెట్ దొరికింది.


ఇక సినిమా విషయానికొస్తే,కుటుంబ సమేతంగా చూడగలిగే చిత్రం.ప్రేక్షకుడికి, ఏమవుతుందా? అనే ఉత్కంఠ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.వికీపీడియా పేజీలో కథ మొత్తం ఉంది.కానీ కథ తెలుసుకోవడం కంటే సినిమా చూస్తేనే బాగుంటుంది.ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం చుట్టూనే కథ తిరుగుతుంది."ఆగష్టులో ఫలానా తారీఖుల్లో మా హోటల్లోనే ఉన్నారండీ","మా థియేటర్లోనే సినిమా చూశారు","అంత మంచి కస్టమర్లను ఎలా మర్చిపోగల్గుతాం"అని ప్రతీ ఒక్కరూ వెంకటేష్ కి అనుకూలంగా చెప్తూంటే థియేటర్లో ఒకటే కేకలు,చప్పట్లూనూ.


అందరి నటనా బాగుంది.వీరభద్రం మరియు అను(చిన్నపిల్ల) పాత్రలు చిత్రానికే హైలెట్.కానీ వీరభద్రం వెంకటేష్ కుటుంబాన్ని అలా చితక్కొట్టడం చాలా బాధ కలిగించింది.కుటుంబమంతా ఒకే మాట మీద ఉండడం బాగుంది.అంజు(పెద్దమ్మాయి)ని తన కాలేజీలో పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నప్పటి సీన్ కూడా చాలా బాగుంది.ఇంకా పచ్చటి పొలాలు,ఆ ఇంటి చుట్టూ ఉండే దృశ్యాలు బావున్నాయి.పాటలు కూడా సినిమాకి తగ్గట్టే ఉన్నాయి.సినిమాలోని ప్రతీ సీన్ ని హీరో తనకు అనుకూలంగా మలచుకోవడం చాలా బాగుంది.సినిమాల వల్ల ఇంత తెలివితేటలు వస్తాయా అన్నది మాత్రం ప్రశ్నే!

నాకు నచ్చిన "దృశ్యం" చిత్ర సమీక్షలు

సమీక్ష-1

సమీక్ష-2

Kritika Jayakumar

Esther Anil

19, జులై 2014, శనివారం

క్విజ్ సంగతి

శనివారం, జులై 19, 2014 0 Comments

ఏప్రిల్ లో మా విశ్వవిద్యాలయంలో CYGNUS'14 పేరుతో యాన్యువల్ సంబరాలు నిర్వహించారు.అందులో భాగంగా Cogno quest పేరుతో క్విజ్ కార్యక్రమం నిర్వహించారు.పీయూసీ వారికీ,ఇంజనీరింగ్ వారికీ వేరేవేరేగా పెట్టారు.మా స్నేహితులందరూ ఆరుగురు ఒక టీముగా అందులో పాల్గొన్నాము.మొదటి రౌండులో ఒక ప్రశ్నాపత్రమిచ్చి జవాబులు వ్రాయమంటారు.అందులో ఎక్కువ మార్కులొచ్చిన టీముల్ని రెండవ రౌండుకి ఎంపిక చేస్తారు.పీయూసీ వారికి పూల్-ఏ,ఇంజనీరింగ్ వారికి పూల్-బి ప్రశ్నాపత్రాలిచ్చారు.మేము బాగానే వ్రాశాము.ఫలితాల కోసం ఎదురు చూశాం.మా తరగతిలో అమ్మాయిల్లో రెండు టీములు పాల్గొన్నాము.Cygnus'14 కి ప్రత్యేకంగా ఒక సైట్ ఉంది.అందులో అన్ని అప్ డేట్స్ ఉంటుంటాయి.అందులో రెండవ రౌండుకి ఎంపికయినవారిలో మా టీం కూడా ఉంది.నేనైతే చాలా సంతోషపడ్డాను.ఎందుకంటే చాలా సార్లు అక్కడ క్విజ్ లలో పాల్గొన్నా ఎప్పుడూ ముందుకు వెళ్ళలేదు.కానీ ఈసారి ఎలాగైనా ఒదటి మూడు స్థానాల్లో ఏదోఒకటి దక్కించుకోవాలని అనుకున్నాం.రెండవ రౌండులో మామూలు క్విజ్ లాగానే జరిగింది.చాలా ఆసక్తిగా జరిగింది.మాకొచ్చిన మార్కులు చూసుకుంటే 50-50 అవకాశాలు ఉన్నాయి.మా అదృష్టం కొద్దీ అందులో కూడా మేము సెలెక్టయ్యాము.విశేషం ఏంటంటే ఫైనల్స్ కి ఎంపికయ్యిన వారిలో మేమే పీయూసీ నుండి ఉన్నాము,అందరూ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం వాళ్ళే.మేము షాకయ్యాము.ఇంక మాకేమి వస్తుంది అనుకున్నాము.అసలు ఇంజనీరింగ్ వాళ్ళతో మాకు పోటీ ఏంటి?కనీసం మాకు మూడవ స్థానం ఇవ్వొచ్చుకదా! అనిపించింది.ఏదో అక్కడున్నామన్న పేరుకి మూడు,నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వచ్చేశాము.ఫైనల్ కి వెళ్లామన్న ఆనందం తప్ప మాకింకేం మిగల్లేదు.


పూల్-ఏ ప్రశ్నాపత్రం కోసం-ఇక్కడ క్లిక్ చెయ్యండి


పూల్-బి ప్రశ్నాపత్రం కోసం-ఇక్కడ క్లిక్ చెయ్యండి


అలాగే సినిమాలపై కూడా క్విజ్ నిర్వహించారు.అందులో కూడా మేము పాల్గొన్నాము కానీ మాకేము రాలేదులెండి.ఆ ప్రశ్నాపత్రం కోసం-ఇక్కడ క్లిక్ చెయ్యండి

అన్నట్టు నా బ్లాగ్ హెడర్ బాగుందా?నేనే తయారు చేశాను.

17, జులై 2014, గురువారం

పిల్లి-దాని పిల్లలు

గురువారం, జులై 17, 2014 0 Comments

మా ఇంటిముందు ఒక పోర్షన్ ఖాళీగా ఉంది.ఇంకా ఎవరూ అద్దెకి రాకపోవడంతో మేము అందులో కొన్ని సామాన్లూ అవీ, మా ఇంట్లో చెద పడుతున్నాయని ఆ ఇంట్లో పెట్టాము.ఈ రోజు ఆ ఇంట్లోకి అద్దెకి వచ్చేవాళ్ళు ఇల్లు దులుపుకుందామని వచ్చారు.మరి ఆ సామను అంతా తీసెయ్యాలి కదా!అందుకు డాడీ చూస్తుంటే ఒక అట్టపెట్టెలో పిల్లి దాని పిల్లలతో ఉంది.డాడీ రావడం చూసి పారిపోయింది.డాడీ ఆ పెట్టెను తీసుకొచ్చి బయట ఒక మూల పెట్టారు.అప్పుడు నేను ఇలా క్లిక్ మనిపించాను.


ఆ తల్లి పిల్లి మళ్ళీ వచ్చింది.పిల్లలని వెతుకుతుంది.చివరికి చూసింది.ఒక పిల్లని నోట్లో కరచుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది.నేనిక వాటిని గమనించటం మానేశాను.ఇప్పుడు ఈ పిల్లి గురించి టపా వ్రాయడానికి లాప్ టాప్ ఆన్ చేస్తుంటే పిల్లి అరుపు చిన్నగా వినిపించింది.నేనంత పట్టించుకోలేదు.మళ్ళీ వినిపించింది.ఎక్కడా అని చూస్తే మాది డూప్లెక్స్ లాంటి ఇల్లు,ఇంటి గలవాళ్ళు ఇదివరకు పై వాటాలో ఉండేవారు.అందుకని మా వాటాలోంచి పై వాటాకి మెట్లు ఉన్నాయి.కాని వాటిని ఇప్పుడు మూసేసారులే.ఆ అరుపు ఆ మెట్ల కింద నుండి వస్తుంది.నేను లైట్ వేసి చూస్తే అక్కడ పిల్లి ఉంది.నేను చీపురు తీసుకొచ్చి కొంచెం అటూఇటూ కదిపాను.ఆ పిల్లని వదిలేసి తల్లి పారిపోయింది.అ పిల్లని తీయడం ఎలాగో ఏంటో?


ఇదివరకు ఒక సారి ఆ తల్లి పిల్లి నీళ్ళ ట్యాంకు కింద ఇలాగే పిల్లలను పెట్టింది.మా పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువ.ఆ పిల్లలని కోతులు చంపేసాయట.ఈ సారి అలా జరక్కుండా జాగ్రత్త పడుతుంది కాబోలు!







14, జులై 2014, సోమవారం

ఈ చిత్రమేమిటో చెప్పండి?

సోమవారం, జులై 14, 2014 2 Comments

డీడీ సప్తగిరిలో ఆణిముత్యాలు కార్యక్రమం గూర్చి చెప్పను కదా.అదే కార్యక్రమంలో ఈ రోజు ఒక చలనచిత్రం ప్రారంభం అయింది.

నిర్మలకి ఇద్దరు కూతుర్లు,రాజసులోచన మరియు సావిత్రి.రాజ సులోచన డాక్టర్ కావలనుకుంటుంది.అలాగే పరీక్ష కూడా పాసవుతుంది.నిర్మల భర్త చనిపోతూ సూర్యకాంతం కొడుకు,జగ్గయ్య కి రాజసులోచన ని ఇచ్చి పెళ్ళి చెయ్యాలని ఆఖరి కోరిక కోరి చనిపోతాడు.కానీ రాజసులోచనకేమో ఇష్టం ఉండదు.ఓ పక్క నుండి తనకి బాలయ్య అనే డాక్టర్ పరిచయమవుతాడు.ఆమె అతణ్ని ప్రేమిస్తూ ఉంటుంది.రాజ సులోచన-జగ్గయ్య పెళ్ళికి ముహూర్తాలు కూడా ఖరారయ్యిపోతాయి.

ఇదీ ఈరోజు జరిగింది.మరి ఇది ఏ చిత్రమో చెప్తారా??

Some different words in American and British English

సోమవారం, జులై 14, 2014 3 Comments


American-British


Apartment-Flat
Automobile-Car
Candy-Sweets
Drapes-Curtains
Elevator-Lift
Flash light-Torch
Gas/Gasoline-Petrol
Great-Very good
Kerosene-Paraffin
Kid-Child
Rail road-Railway
Side walk-Pavement
Store-Shop
Truck-Lorry
Vacation-Holiday
Zip code-Pin code

                                                                                         Source:-Manorama year book

12, జులై 2014, శనివారం

Some other languages words in English..

శనివారం, జులై 12, 2014 3 Comments

Greek words:-
Agnostic
Alphabet
Character
Clinic
Cycle
Electron
Epidemic
Idea
Irony
Museum
Neurology
Parallel
Polystyrene
Rhythm
Telegraph
Theory
Normal French words:-
Baron
Beauty
Bible
Court
Crown
Dress
Feast
Joy
Justice
Liberty
Market
Marriage
Navy
Parliment
Peace
People
Pleasure
Power
Prayer
Reign
Soldier
Treasure
Verdict
War
Modern French:-
Ballet
Cafe
Camouflage
Elite
Espionage
Garage
Menu
Police
Regime
Soup
Persian words:-
Azure
Candy
Caravan
Checkmate
Divan
Lemon
Magic
Taffeta
Talcum
Latin words:-
Accommodate
Bacilus
Circus
Exit
Focus
Invention
Manufacture
Penicillin
Persecute
Refrigerator
Status
Tradition
Vaccum
African languages words:-
Banana
Banjo
Chimpanzee
Cola
Mumbo
Jumbo
Raffia
Tote
Voodoo
Yam
Zombie
Dutch words:-
Brandy
Decoy
Landscape
Schoones
Spanish words:-
Bravado
Cafeteria
Lasso
Rodeo
Tornado
German words:-
Noodle
Nix
Snorkel
Sipel
Chinese words:-
Ketchup
Kotow
Tea
Typhoon
Indian languages words:-
Agarbatti
Bangle
Bandicoot
Batta
Bogy
Bunglaw
Chintz
Guru
Juggernaut
Jungle
Khaki
Lady's finger
Mulligatawny
Pepper
Pajamas
Shampoo
Stepeny
Tabla
Teak
Thug
Tiffin
Arabic words:-
Alcohol
Algebra
Amber
Assassin
Ciphes
Crimson
Cotton
Ghoul
Mattress
Sofa
Zero
Caribbean languages words:-
Barbecue
Canoe
Hammock
Hurricane
Maize
Mosquito
Tobacco

11, జులై 2014, శుక్రవారం

చెకుముకితో నేను

శుక్రవారం, జులై 11, 2014 0 Comments

ఈ చిత్రం తొమ్మిదో తరగతిలో మండల స్థాయిలో మేము నెగ్గినపుడు....


నేను ఎనిమిదో తరగతిలో ఉండగా ఒక రోజు చెకుముకి పాఠశాల స్థాయి పరీక్ష జరిగింది.నిజం చెప్పాలంటే అప్పటికి ఆ పరీక్ష పేరు కూడా నాకు తెలియదు.హై స్కూల్లో ఆ సంవత్సరమే చేరాను.అప్పటి వరకు అప్పర్ ప్రైమరీ పాఠశాల్లో చదివాను.


మా స్నేహితులందరూ రాస్తుండటంతో నాకు రాయాలనిపించి నేనూ వాళ్ళతో వెళ్ళి రాశాను.
ఆ పరీక్ష జనవిజ్ఞాన వేదిక వారు నిర్వహిస్తారు.8,9,10 తరగతులవారు మాత్రమే అర్హులు.ఈ మూడు తరగతులకి ఒకే పరీక్షాపత్రం ఉంటుంది.ఒక్కో తరగతి నుండి ఎక్కువ మార్కులు పొందిన ఒక్కర్ని మాత్రమే ఎంపిక చేసి,ఆ ముగ్గుర్ని ఆ పాఠశాల నుండి మండల స్థాయి కి పంపుతారు.ఇక పరీక్షాపత్రం విషయానికి వస్తే ప్రశ్నలు అన్ని విభాగాల నుండి ఉంటాయి.
ఆ రోజు నేనే ఎనిమిదవ తరగతిలో ఎంపికయ్యాను.తర్వాతి మండల స్థాయిలో కూడా మా పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది.తరవాత జిల్లా స్థాయి మా పాలకొల్లు సబితా మహిళ కళాశాలలో జరిగింది.జిల్లా స్థాయిలో ఏంటంటే వచ్చిన టీములందరూ పరీక్ష రాయాలి.వారిలోనుండి 6 టీములను ఎంపిక చేసి వారికి క్విజ్ నిర్వహిస్తారు.అందులో విజేతను ప్రకటిస్తారు.అందులోనూ మా టీమే గెలిచింది.


మా టీం సభ్యులు ఎనిమిదవ తరగతి నుండి నేను,తొమ్మిదవ తరగతి నుండి మహేశ్,పదవ తరగతి నుండి సత్యవేణి.
ఇక రాష్ట్ర స్థాయి రాజమండ్రిలో,రివర్ బే లో జరిగింది.అక్కడ కేవలం క్విజ్ మాత్రమే నిర్వహించారు.అక్కడ విజేతలంటూ ఎవర్నీ ఎంపిక చెయ్యలేదు.అక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ జ్ఞాపికలు,ధృవ పత్రాలు ఇచ్చారు.
ఇదంతా ఎనిమిదో తరగతిలోని సంగతి.ఇక తొమ్మిదో తరగతిలో ఆ తరగతి నుండి నేను ఎంపికయ్యాను.జిల్ల స్థాయి వరకు వెళ్ళాము.అక్కడ నాలుగవ స్థానం తో సరిపెట్టుకున్నాము.ఆ తర్వాత పదవ తరతిలో కూడా నేనే.అప్పుడు కూడా 4వ స్థానమే!
ఇవండీ చెకుముకి పరీక్షతో నేను,నా సంగతులు.మరి ఇప్పుడు ఈ పరీక్ష ఎలా నిర్వహిస్తున్నారో నాకు తెలియదు.అప్పట్లో నేను ఈ పరీక్ష ఎప్పుడు పెడతారోనని ఎదుచూసేదాన్ని.

చెకుముకి జిల్లాస్థాయి ప్రశ్నలు

శుక్రవారం, జులై 11, 2014 0 Comments


1.ఇస్రో ప్రారంభించిన భారతదేశంలోనే అతి శక్తివంతమైన కంప్యూటర్ పేరేమిటి?


SAGA-220


2.శక్తి విడుదలయ్యే జీవక్రియ ఏది?


శ్వాసక్రియ


3.రైబోజోముల విధి ఏది?


ప్రోటీన్ల సంశ్లేషణ


4.చంద్రకళలు రావడానికి కారణం ఏంటి?


చంద్రుని మీద పడే సూర్యకాంతి వివిష ప్రాంతాల్లో వేరువేరుగా ఉండడం.


5.విద్యుత్ తీగలపై కూర్చుని ఉండే పక్షిలకి షాక్ ఎందుకు కొట్టదు?


పక్షి రెండు కాళ్ళలో ఒకే పొటెన్షియల్ భేధం ఉండడం వల్ల


6.శ్వాసక్రియ,హృదయస్పందన,రక్తపీడనం,శరీర ఉష్ణోగ్రత వంటి అతి ముఖ్యమైన చర్యలను 

నియంత్రించే కేంద్రాలు దేనిలో ఉంటాయి?


మజ్జాముఖం


7.ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెను ఎక్కువ వేడి చేసినపుడు దానికి అదే(ఆటోమేటిక్) విద్యుత్ ప్రసారం 

నిలిచిపోవుటకు కారణమైన పరికరం ఏది?


థర్మోస్టాట్


8.ఖగోళ దూరదర్శినిలో ఆఖరి ప్రతిబింబం ఎలా ఉంటుంది?


తలక్రిందులుగా


9.ఇండియన్ ప్రమాణాల ప్రకారం రక్షిత మంచినీటిలో ఉండాల్సిన ఫ్లోరైడ్ పరిమాణం ఎంత?


0.4-1.5 ppm


10.మానవ శరీరంలో తయారయ్యే బీటా-ఎండార్ఫిన్ ఎలా ఉపయోగపడుతుంది?


నొప్పిని తగ్గించడానికి.


11.గాలివానలో గొడుగుతో నడిస్తే కొన్ని సందర్భాల్లో గొడుగు తారుమారై పైకి 

తిరుగుతుంది.ఎందుకు?


గొడుగు పై భాగంలో గాలి వేగంగా వీచడం వలన


12.నోబెల్ బహుమతి పొందిన సి.వి.రామన్ పరిశోధనాంశం?


కాంతి పరిక్షేపణం


13.0 డిగ్రీల సెంటీగ్రేడు కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే శీతల ప్రదేశాల్లో పంట దిగుబడిని 

పెంచడానికి,వ్యవసాయ క్షేత్రాల్లో కొద్దిపాటి నీరు ఉంచుతారు.ఎందుకు?


చల్లబడే నీరు ఇచ్చే ఉష్ణం,మొక్కల ఉష్ణోగ్రతను 0 డిగ్రీల సెంటీగ్రేడు కంటే తక్కువ కాకుండా 

చూస్తుంది.


14.కాలేయం,కొవ్వు పదార్ధంతో నిండినపుడు(ఫ్యాటీ లివర్)దాన్ని సహజ స్థితికి తీసుకుని వచ్చే ఏ 

పోషక పదార్ధాన్ని కండర చక్కెర(Muscle sugar) అంటారు?

ఇనాసిటాల్


15.దారానికి చిన్న రాయిని కట్టి,చేతితో గిరగిరా తిప్పి వదిలితే,రాయి ఏ దిశలో ప్రయాణిస్తుంది?


స్పర్శరేఖాదిశలో


16.మోకాళ్ళ లోతు నీటిలో నిలబడిన వ్యక్తి కాళ్ళు పొట్టిగా ఉన్నట్లు భ్రమ కలుగడానికి కారణం?


కాంతి వక్రీభవనం


17."వోస్తాక్" అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షయానం చేసిన మహిళ?


వాలెంటినా తెరిష్కోవా.


18.అర్ధవాహకాల ఉష్ణోగ్రత పెంచితే వాటి విద్యుత్ నిరోధం.......


పెరుగుతుంది.


19.అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం.


జూన్ 1


20.రక్తపీడనాన్ని కొలిచే సాధనం..


స్పిగ్మోమానోమీటర్


21.ఆంలాలు,లోహాలతో చర్య జరిగినపుడు విడుదలయ్యే వాయువు ఏది?


ఉదజని


22.లైకెన్లు ఏ జీవుల  సింబయాటిక్ అసోసియేషన్ తో ఏర్పడుతాయి?


శిలీంధ్రాలు,శైవలాలు


23.నీరులేని ప్రతికూల పరిస్థితులలో జంతువులు,భూమి లోపల బొరియల్లో దాక్కోవడాన్ని 

ఏమంటారు?


వేసవికాల సుప్తావస్థ.

10, జులై 2014, గురువారం

జూన్ నెల సైన్సు సంగతులు

గురువారం, జులై 10, 2014 0 Comments



2-1892-ఇటలీ దేశానికి చెందిన "మార్కొనీ" రెడియోను కనిపెట్టిన రోజు.


3-1857-మొట్టమొదటి మానవ శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో వివరించిన "విలియం 

హార్వే" మరణం.


4-1934-భౌతిక,రసాయన శాస్త్రాల్లో నోబెల్ పొందిన "మేరీ క్యూరీ" మరణం.


6-1866-దక్షిణ ధృవాన్ని చేరిన రెండవ వ్యక్తి,ఇంగ్లండ్ కు చెందిన "రాబర్ట్ ఫాల్కన్" జననం.


7-1875-కాలా అజార్ ను నిర్మూలించే మందును కనుగొన్న భారతీయ వైద్యుడు "ఉపేంద్రనాధ్ 

బ్రహ్మచారి" జననం.


8-1904-భారతీయ రసాయన శాస్త్రవేత్త "బీరిస్ చంద్రగుహ" జననం.వీరు విటమిన్ సి,బొగ్గు 

వాయువీకరణ,సిట్రిక్ ఆసిడ్ మొదలైన వాటి గూర్చి పరిశోధనలు చేసారు.


12-1967-రష్యా దేశం మానవ రహిత అంతరిక్ష నౌక "వెనీరా-4"ను శుక్రునిపై పంపిన రోజు.


16-1963-అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ "వాలెంటీన తెరిష్కోవా" అంతరిక్ష యాత్ర 

ప్రారంభమైన రోజు.


17-1950-చికాగొలోని లిటిల్ కంపెనీ ఆఫ్ మేరీ హాస్పిటల్ లో డా.రిచార్డ్ లాలర్ ఆధ్వర్యంలో 

మొదటిసారిగా మానవ మూత్రపిండాల మార్పిడి చేసిన రోజు.


19-1981-భారతీయ తొలి జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ "ఆపిల్"(Ariane Project 

Payload Experiment) ను ఫ్రెంచి గయానా నుండి ప్రయోగించిన రోజు.


22-1887-శరీరధర్మాలను విశ్లేషించడానికి గణిత  పధ్ధతులను రూపొందించిన బ్రిటిష్ జీవ శాస్త్రవేత్త 

"జూలియన్ హాక్స్లీ" జననం.వీరు యునెస్కోకు మొదటి డైరెక్టర్ జనరల్.


23-1985-గుంటూరు జిల్లా యలవర్తిలో జన్మించి,అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చర్మ సాంకేతిక 

శాస్త్రవేత్త "డా.యలవర్తి నాయుడమ్మ" మరణం.వీరు జవహర్లాల్ నెహ్రూ

 విశ్వవిద్యాలయానికి(1981-82)ఉపకులపతిగా,CSIR కు(1971-77) డైరెక్టర్ గా 

పనిచేసారు.1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని రాష్ట్ర శాస్త్ర విజ్ఞానరంగ సలహాదారునిగా 

నియమించింది.


24-1915-విశ్వానికి సంబంధించిన "Steady state theory"ను రూపొందించిన బ్రిటిష్

 గణిత,ఖగోళ శాస్త్రవేత్త "ఫ్రెడ్ హయర్" జననం.


26-1824-"లార్డ్ కెల్విన్" జననం.పరమోష్ణోగ్రత స్కేలు(కెల్విన్ 

స్కేలు)ను,విద్యుత్,అయస్కాంతత్వం,ఉష్ణగతిక శాస్త్రాలలో కృషి చేసారు.దని ఆ రోజు గమనించారు.

మే నెల సైన్సు సంగతులు

గురువారం, జులై 10, 2014 0 Comments



4-1825-బ్రిటిష్ జీవ శాస్త్రవేత్త "చార్లెస్ డార్విన్" యొక్క జీవ పరిణామ సిద్ధాంత విశ్లేషకుడు 

అయిన "థామస్ హెన్రీ హెక్స్ లీ" జననం.


6-1856-ఆస్ట్రియా దేశపు వైద్యుడు,మనస్తత్వ శాస్త్రవేత్త "సిగ్మండ్ ఫ్రాయిడ్" జననం.


8-1794-గాలి అనేది ఆక్సిజన్,హైడ్రోజన్ ల మిశ్రమమనీ,నీరు అనేది ఆక్సిజన్,హైడ్రోజన్ ల 

సమ్మేళనమనీ,మండడానికి,జీర్ణం కావడానికి ఆక్సిజన్ వాయువు తోడ్పడుతుందని గుర్తించిన 

"లేవోయిజర్" మరణం.


10-1901-ప్రాణంగల పదార్ధాలు,ప్రాణం లేని పదార్ధాలు, విద్యుత్,యాంత్రిక ప్రభావాలకు ఒకే 

రకమైన స్పందన ఇస్తాయని "జగదీశ్ చంద్రబోస్" తెలిపిన రోజు.


13-1857-మలేరియా వ్యాప్తికి దోమలు కారణమని నిరూపించి 1902లో నోబెల్ పొందిన "సర్ 

రోనాల్డ్ రాస్" జననం.


14-1796-"ఎడ్వర్డ్ జెన్నర్" మశూచి నిరోధక సూది మందును 8 సంవత్సరాల కుర్రాడు జేంస్ కు 

ఇంగ్లండ్ లో ఇచ్చిన రోజు.


15-1859-అయస్కాంత ధర్మాలకు సంబంధించి పరిశోధనలు చేసిన వారు,రేడియోధార్మికతకు 

సంబంధించి "మేడం క్యూరీ","హెన్రీ బెకెరెల్" లతో కలిసి 1903లో నోబెల్ అందుకున్న "పియరీ 

క్యూరీ" జననం.


18-1966-పుష్పించే మొక్క గూర్చి ప్రయోగాలు చేసిన భారతీయ వృక్షశాస్త్రవేత్త "పంచానన్ 

మహేశ్వరి" మరణం.


23-1707-స్వీడన్ కు చెందిన వృక్షశాస్త్రవేత్త "కెరోలస్ లిన్నేయస్" జననం.మొక్కలకు 

శాస్త్రీయంగా పేర్లు పెట్టే విధానాన్ని ఈయన రూపొందించారు.నేడు అంతర్జాతీయంగా ఈ విధానాన్నే

 అనుసరిస్తున్నారు.


24-1543-సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన "నికోలస్ కోపర్నికస్" మరణం.ఆనాటి మత

 మౌఢ్యానికి భయపడి ఈ సిద్ధాంతాన్ని గట్టిగా ప్రతిపాదించలేదు.


25-1973-అంతరిక్ష ప్రయోగశాల "స్కైలాబ్"ను ప్రయోగించిన రోజు.దీనిలో చార్లెస్ కొన్రెత్ 

నాయకత్వంలో మరో ఇద్దరు పరిశోధకులు 28 రోజులుండి ప్రయోగాలు చేశారు.


27-1910-వైద్యరంగంలో మెడికల్ బాక్టీరియాలజీ విభాగాన్ని శాస్త్రంగా అభివృద్ధి చేసి క్షయ వ్యాధికి

 సంబంధించి చేసిన పరిశోధనలకు గాను 1905లో నోబెల్ ను అందుకున్న జర్మన్ శాస్త్రవేత్త 

"రాబర్ట్ కాక్" మరణం.


29-1919-సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.సాపేక్షతా సిద్ధాంతంలో ఐనస్టీన్ పేర్కొన్నట్లు 

నక్షత్రాల కాంతి వంగి ప్రయాణిస్తుం1-1996-అమెరికావారి అంతరిక్షనౌక "సర్వేయర్" చంద్రునిపై 

దిగి,విజయవంతంగా అక్కడి చిత్రాలను పంపిన రోజు.

9, జులై 2014, బుధవారం

ఏప్రిల్ నెల సైన్సు సంగతులు

బుధవారం, జులై 09, 2014 0 Comments



1-1578-రక్త ప్రసరణ గురించి ప్రయోగాలు చేసిన బ్రిటిష్ వైద్యుడు "విలియం హార్వే" జననం.


2-1845-సూర్యునిలోని మచ్చలని "హిప్పొలైజ్ జో","లీన్ ఫోకాల్ట్" అనే శాస్త్రవేత్తలు ఫోటో తీసిన

 రోజు.


3-1984-తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడు "రాకేశ్ శర్మ" 'సోయజ్ టి-11' అనే 

అంతరిక్షనౌకలో మరో ఇద్దరు సోవియట్ వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో ప్రయాణించారు.


6-1928-డి.ఎన్.ఏ.నిర్మాణాన్ని ప్రతిపాదించిన బృందానికి నాయకుడు "జేంస్ డి.వాట్సన్

జననం.


7-1948-"ప్రపంచ ఆరోగ్య సంస్థ" ఏర్పడిన రోజు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఆరోగ్య 

సదుపాయాలు కల్పించటం ఈ సంస్థ లక్ష్యం.ప్రధాన కార్యాలయం జెనీవా(స్విట్జర్లాండ్)లో ఉంది.


8-1911-కిరణజన్యసంయోగ క్రియకు పరిశోధన చేసిన శాస్త్రవేత్త "మెల్విన్ కాల్విన్" జననం.


17-1979-మెరుపు ఒకరకమైన విద్యుత్ ఉత్సర్గమని వివరించిన "బెంజమిన్ ఫ్రాంక్లిన్" మరణం.


19-1882-జీవ పరిణామ సిద్ధాంతకర్త,బ్రిటిష్ శాస్త్రవేత్త "చార్లెస్ రాబర్ట్ డార్విన్" మరణం.


23-1858-క్వాంటం సిద్ధాంతాన్ని రూపొందించిన జర్మన్ శాస్త్రవేత్త "మాక్స్ ఫ్లాంక్" జననం.


25-1982-భారతదేశంలో మొదటిసారిగా కలర్ టెలివిజన్ ప్రసారాలు న్యూఢిల్లీలో ప్రారంభమైన 

రోజు.


25-1874-వైర్లెస్ టెలిగ్రాఫ్ ను కనుగొన్న ఇటలీ శాస్త్రవేత్త "మార్కొనీ" జననం.


28-ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం.


8, జులై 2014, మంగళవారం

మార్చి నెల సైన్సు సంగతులు

మంగళవారం, జులై 08, 2014 0 Comments



1-1982-సోవియట్ రష్యా వారి అంతరిక్ష నౌక "వెనీరా-13" శుక్రగ్రహం మీద దిగి దాదాపు 127 

నిమిషాలు పాటు సమాచారం పంపింది.


3-1703-పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి సూక్ష్మదర్శినిని ఉపయోగించి మొక్కలలో తేనెపట్టు

 గదులలాంటి కణాలున్నాయని చెప్పిన బ్రిటిష్ శాస్త్రవేత్త "రాబర్ట్ హుక్" మరణం.


5-1827-విద్యుత్ ఘటంను రూపొందించిన ఇటలీ శాస్త్రవేత్త "అలెస్సెండ్రో వోల్టా" మరణం.ఈయన 

కృషికి గుర్తుగా విద్యుచ్చాలక బలానికి "వోల్ట్" అని పేరు పెట్టబడింది.


6-1986-సోవియట్ అంతరిక్ష నౌక "వేగా-1" హేలీ తోకచుక్క సమీపానికి వెళ్ళి ఫోటోలను 

భూమికి చేరవేసింది.


10-1876-మొట్టమొదటిసారిగా మానవ స్వరం టెలీఫోన్ తీగల ద్వారా ప్రయాణించిన 

రోజు.టెలీఫోన్ సృష్టికర్త "అలెగ్జాండర్ గ్రహంబెల్" మాట్లాడిన "మిస్టర్ వాట్సన్,కం హియర్,ఐ 

వాంట్ యూ" అనే మాటలు తొలిసారిగా తీగలలో ప్రయాణించాయి.


11-1955-"పెన్సిలిన్" సృష్టికర్త "అలెగ్జాండర్ ఫ్లెమింగ్" మరణం.లాలాజలం,కన్నీరులలో కూడా

 బాక్టీరియా ఉందని ఈయన కనుగొన్నారు.


14-1879-ప్రఖ్యాత శాస్త్రవేత్త "ఆల్బర్ట్ ఐనస్టీన్" జన్మించిన రోజు.సాపేక్షతా సిద్ధాంతం వీరి ప్రముఖ

 ప్రతిపాదన.కాంతి విద్యుత్ ఫలితం సూత్రాలు రూపొందొంచినందుకు 1921లో నోబెల్ లభించింది.


17-1988-భారతదేశం తయారుచేసిన మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం IRS-1A సోవియట్ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించబడింది.


18-1858-డీజిల్ ఇంజన్ సృష్టికర్త "రుడాల్ఫ్ డీజిల్" జననం.


20-1727-ఇంగ్లీష్ శాస్త్రవేత్త "ఐజాక్ న్యూటన్" మరణం.న్యూటన్ స్థిరాకం.న్యూటన్ గమన 

నియమాలు,బలానికి ప్రమాణమైన "న్యూటన్" ఈయనకు సంబంధించినవే.


22-1990-"నేచర్" పత్రికలో పూణేకు చెందిన "నేషనల్ కెమికల్ లేబొరేటరీ"(NCL) శాస్త్రవేత్తలు

 కణజాలవర్ధనం ద్వారా మొట్టమొదటి సారిగా వెదురును పుష్పింపచేయడాన్ని గూర్చి 

పరిశోధనాపత్రాన్ని ప్రచురించారు.


25-1989-భారతదేశంలో సూపర్ కంప్యూటర్ ను ప్రారంభించిన రోజు.Cray XMP-14 అనే 

సూపర్ కంప్యూటర్ ను అమెరికా నుండి ఢిల్లీలోకి వాతవరణ శాస్త్ర విభాగం దిగుమతి చేసుకొంది.


27-1968-అంతరిక్షలో ప్రయాణించిన "యూరీగగారిన్" విమానప్రమాదంలో చనిపోయిన రోజు.


31-1811-ప్రయోగశాలలో వాడే బున్సెన్ బర్నర్ రూపశిల్పి "రాబర్ట్ విల్ హెల్మ్ బున్సెన్" జననం.


7, జులై 2014, సోమవారం

ఫిబ్రవరి నెల సైన్సు సంగతులు

సోమవారం, జులై 07, 2014 0 Comments



2-1907-ప్రకృతిలో లభించే మూలకాల ధర్మాలను క్రోడీకరించి,ఆవర్తన పట్టిక(Periodic

 Table)ను తయారు చేసిన రష్యన్ రసాయన శాస్త్రవేత్త "మెండలీవ్" మరణించిన రోజు.


3-1468-అచ్చుయంత్రాన్ని కనుగొన్న జర్మనీ శాస్త్రవేత్త "జాన్ గూటంబర్గ్" మరణించిన రోజు.


6-1804-ఆక్సిజన్ తో పాటు హైడ్రోక్లోరిక్ ఏసిడ్,సల్ఫ్యూరిక్ ఏసిడ్ వంటి ఎన్నో ఏసిడ్ లను 

కనుగొన్న "జోసెఫ్ ఫ్రీస్ట్లీ" మరణం.


7-1834-రష్యన్ రసాయన శాస్త్రవేత్త "మెండలీవ్" జననం.


11-1847-అమెరికా శాస్త్రవేత్త "థామస్ ఆల్వా ఎడిసన్" జన్మించిన రోజు.ఎలక్ట్రిక్ బల్బు,ఫోనోగ్రాఫ్

 లతో పాటు మైనింగ్,బ్యాటరీ,రబ్బర్,సిమెంట్,రక్షణ ఉత్పత్తులు మానవజీవితాన్ని నాగరికత వైపు

 మళ్ళించాయి.1300 ఆవిష్కరణలపై పేటెంట్ హక్కులను పొందాడు.ఆయన అంత్యక్రియలు రోజున

 ఆయన గౌరవార్ధం అమెరికా ప్రజలు తమ గృహాల్లో లైట్లను ఆర్పివేసి ఆయనకు నివాళి 

అర్పించారు.


12-1809-పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రిటిష్ ప్రకృతి శాస్త్రవేత్త "చార్లెస్ రాబర్ట్ డార్విన్"

 జననం.


15-1564-టెలిస్కోపును వాడి మొట్టమొదట ఖగోళ వస్తువులను పరిశీలించిన ఇటలీకి చెందిన 

ఖగోళ,భౌతిక శాస్త్రవేత్త "గెలీలియో గెలీలి" జన్మించిన రోజు.


15-1880-"అలెగ్జాండర్ గ్రహం బెల్","చార్లెస్ సమ్నర్ టెయింటర్" తో కలిసి మొదటిసారిగా 

రేడియో టెలీఫోన్ ను ప్రయోగాత్మకంగా చూపిన రోజు.


16-1956-భారతీయ ఖగోళ,భౌతిక శాస్త్రవేత్త "మేఘ్ నాధ్ సాహా" మరణం.ఈయన థర్మల్ 

అయనైజేషన్ సమీకరణమును రూపొందించారు."సైన్స్ అండ్ కల్చర్"అనే పత్రిక ను స్థాపించారు.


28-1928-"సి.వి.రామన్" తన "రామన్ ఎఫెక్ట్" ను ప్రకటించిన రోజు.ఈ రోజున మనం జాతీయ 

సైన్స్ దినోత్సవం గా జరుపుకుంటున్నాము.


29-1892-"రుడాల్ఫ్ డీజిల్" అనే శాస్త్రవేత్త అధిక పీడనం తో నడిచే డీజిల్ ఇంజన్ ను పేటెంట్

 చేశారు.

6, జులై 2014, ఆదివారం

చెకుముకి మండల స్థాయి ప్రశ్నలు

ఆదివారం, జులై 06, 2014 0 Comments

1.సాధారణంగా ఆసుపత్రులలో ఉపయోగించే ఆక్సిజన్ సిలండర్ లలో ఆక్సిజన్ తోపాటు అధికంగా

 ఉండే వాయువు..

నైట్రోజన్

2.దోమ మనిషి రక్తాన్ని తాగడానికి కారణం..

మనిషి రక్తం దాని అండోత్పత్తికి అవసరం.


3.గుండెపోటు రావడానికి గల ముఖ్యకారణం.


కరోనరి ధమనిలో కొవ్వు పెరగడం.


4.గ్రంధాలయాల్లో లేదా మన దగ్గర ఉండే పాతపుస్తకాలు పసుపు రంగులోకి మారడానికి 

కారణమయ్యే వాయువు ఏది.


సల్ఫర్ డై ఆక్సైడ్


5.కేంద్ర విజ్ఞాన శాస్త్రం (Central science)అని ఏ శాస్త్రాన్ని అంటారు.


రసాయన శాస్త్రం.


6."పిడుగులు" ఫడటానికి కారణం..


మేఘాల మధ్య విద్యుత్సర్గం


7.కొండ పైకి ఎక్కుతున్న వ్యక్తి కొద్దిగా ముందుకు వంగుటకు కారణం ఏమిటి?


గరిమనాభి నుండి గీసిన నిలువు రేఖ పాదాల గుండా వెళ్లేందుకు


8.విమాన రెక్కల నిర్మాణం ఏ సూత్రంపై ఆధారపడి నిర్మిస్తారు?


బెర్నౌలి సూత్రం


9.రెండు సమతల దర్పణాలను ఏ విధంగా అమర్చితే అనంత ప్రతిబింబాలు ఏర్పడును.


ఎదురెదురుగా,సమాతరంగా


10.అనార్ధ్ర ఘటంలో ఉపయోగించే లోహం పేరు.


జింక్


11.సముద్రనీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ ఏది?


స్వేదనం


12.మూత్రపిండాలు చెడిపోయిన రోగులకు నిర్వహించే "డయాలసిస్" లో ఇమిడి ఉన్న ప్రక్రియ 

ఏది?


ద్రవాభిసరణము.


13.ఎలెక్ట్రిక్ ఫిట్టింగ్ లలో ఎందుకని ఎర్తింగ్ చేస్తారు?


అధిక విద్యుత్ ప్రవహించినపుడు విద్యుత్ పరికరాలు చెడిపోకుండా ఉండడానికి


14.ఎరిత్రోసైట్స్ తమజీవితకాలం తర్వాత ఎక్కడ విచ్చిన్నం అవుతాయి


ప్లీహం


15.ఈ దేశ భాషతో మన తెలుగును పోలుస్తారు


ఇటలీ


16.ఆప్టిక ఫైబర్లలో జరిగే ముఖ్య ప్రక్రియ


సంపూర్ణాంతర పరావర్తనం(Total Internal Reflection)


17.స్వచ్చమైన మంచినీటి వనరు


వర్షపు నీరు


18.భూమి పుట్టినపుడు వాతావరణంలో లేని వాయువు


ఆక్సిజన్


19.లాంగ్ జంప్ చేసే వ్యక్తి చాలా దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి దూకుతాడు.ఎందుకు?


అతను తన గమన జడత్వాన్ని పొందేందుకు


20.డెంగ్యూ వ్యాధికి గురైన వారిలో వీటి సంఖ్య తగ్గిపోతుంది?


రక్త ఫలకికలు


21.నిప్పులపై మనిషి నడకను ఏ విధంగా వివరించగలము


గాలికి,అరికాలి చర్మానికి ఉష్ణ వాహకత్వం తక్కువగా ఉండటం వల్ల.


22.జీవుల్లో క్షయకరణ విభజన ప్రాముఖ్యత ఏమిటి?


ప్రతి తరంలో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంచడం


23."రివర్స్ ఆస్మాసిస్" పద్ధతిని దేనికోసం వాడుతారు.


నీటిని శుభ్రపరచటం


24.శరీరంలో వేగంగ కదిలే కండరాలతో నిర్మితమైన భాగం


కనురెప్ప


25."విగ్రహాలు పాలు తాగుతున్నాయి" అనే దృగ్విషయంలో దాగి ఉన్న వాస్తవం ఏమిటి?


తలతన్యతకు సంబంధించిన కేశనళికీయత


26.ఇంద్రధనుస్సును స్పష్టంగా చూడాలంటే వర్షపు చినుకుల్ని, సూర్యుడికి ఏ దిశలో నిలబడి

 చూడాలి?


సూర్యుడిని వ్యతిరేకంగా


27.కొళాయి కింద పెట్టిన బిందె నిండిందనే సంగతి దానివైపు చూడకుండానే చెప్పగలగడంలో 

ఇమిడి ఉన్న సూత్రమేది.


లోతును బట్టి శబ్ధ పౌనపున్యం మారడం.


28.ప్రగతిని కోరుకునే సంస్థలు బి.టి. వంకాయ తదితర విత్తనాల ప్రవేశాన్ని వ్యతిరేకించడానికి 

కారణం.


సాంప్రదాయ రకాలు అంతరించిపోతాయని,బి.టి. వంకాయలు నుంచి వచ్చే రెండో తరం విత్తనాలు 

మొలకెత్తవని.


29."కరోనా" ఎప్పుడు ఏర్పడుతుంది


సంపూర్ణ సూర్య గ్రహణం రోజున


30.రెండవ ప్రపంచ యుద్ధ ప్రధాన కారకుడు


అడాల్ఫ్ హిట్లర్

5, జులై 2014, శనివారం

డిసెంబరు నెల సైన్సు సంగతులు

శనివారం, జులై 05, 2014 0 Comments



1-1971-భారతదేశంలో మొట్టమొదటి మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్ తమిళనాడు 

వేలూరులోని సి.ఎం.సి.ఆసుపత్రిలో విజయవంతగా జరిగింది.



2-1942-న్యూక్లియర్ గొలుసు చర్యను "ఎన్రికో ఫెర్మి" సాధించారు.


3-1910-పారిస్ లో నియాన్ కాంతి దీపాలను వాడటం ప్రారంభించారు.


4-1131-ఇరాన్ లోని నైషాపూర్ లో 18-5-1048 న జన్మించిన ఖగోళ శాస్త్రవేత్త,కవి "ఉమర్ 

ఖయ్యాం" మరణం.


6-1877-"థామస్ ఆల్వా ఎడిసన్" మానవ స్వరాన్ని మొట్టమొదటి సారిగా రికార్డు చేసిన 

రోజు."Mark Had a Little Lamb" అనే తన మాటలను తానే రికార్డు చేసారు.


7-1972-చంద్రునిపై అపోలో ప్రయోగశాలలో చివరిదైన "అపోలో-17" అంతరిక్ష నౌక 

ప్రయోగింపబడిన రోజు.


8-1993-అంతరిక్ష నౌక "ఎండీవర్" సిబ్బంది అంతరిక్ష కక్ష్యలో "హబుల్ స్పేస్ టెలీస్కోపును

బాగు చేశారు.


9-1868-వాతావరణపు నైట్రొజన్ నుండి అమ్మోనియాను తయారు చేసి,1918లో రసాయన 

శాస్త్రంలో నోబెల్ ను పొందిన జర్మనీ శాస్త్రవేత్త "ఫ్రెడ్జి హేబర్" జననం.


10-1896-నైట్రోగ్లిజరిన్ ను ఉపయోగించి డైనమైట్ ను తయారు చేసిన స్వీడిష్ శాస్త్రవేత్త "ఆల్ఫ్రెడ్

 నోబెల్" మరణం.


11-1843-క్షయ వ్యాధికి మందును కనుగొని,1905లో నోబెల్ బహుమతిని పొందిన జర్మనీ 

శాస్త్రవేత్త "డాక్టర్ రాబర్ట్" జననం.


12-1866-పరమాణువుల మధ్య రసాయన బంధాలను వివరించి,1913లో నోబెల్ పొందిన 

రసాయన శాస్త్రవేత్త "ఆల్ఫ్రెడ్ వెర్నర్" జననం.


13-1930-సేంద్రీయ పదార్ధాల సూక్ష్మ విశ్లేషణకు గానూ 1923లో నోబెల్ ను పొందిన ఆస్ట్రేలియా 

శాస్త్రవేత్త "ఫ్రిట్జ్ ప్రీగల్" మరణం.


14-1958-పౌలీవర్జన సూత్రం రూపొందించినందుకు గాను 1945లో నోబెల్ ను పొందిన "ఊల్ఫ్ 

గాంగ్ పౌలి" మరణం.


15-1852-"సహజ రేడియో ధార్మికత కనుగొన్నందుకు మేడం క్యూరీ దంపతులతో పాటుగా 

1903లో నోబెల్ ను పొందిన ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్త "ఆంటోనీ హెన్రీ బెకెరెల్" జననం.


16-1796-సూర్యునికి,గ్రహాలకు మధ్య గల సంబంధాలను గురించి వివరించే "టిటినీ-బోడ్" 

సూత్రం రూపకర్త,జర్మనీ ఖగోళ శాస్త్రవేత్త "జోడాన్ టిటిస్" మరణం.


17-1778-సేఫ్టీల్యాండ్ రూపకర్త,బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త "హంఫ్రీ డేవీ" జననం.


18-1856-ఎలక్ట్రాన్ ఆవిష్కరణకు 1906లో నోబెల్ ను పొందిన బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త "జోసెఫ్ 

జాన్ థాంసన్" జననం.


19-1852-కాంతికి సంబంధించిన గణనలకు,వర్ణపట అధ్యయనానికి గానూ 1907లో నోబెల్ ను 

పొందిన శాస్త్రవేత్త "ఆల్బర్ట్ అబ్రహాం మైఖేల్సన్" జననం.


20-1890-ఎలక్ట్రో కెమికల్ ఎనాలసిస్ కు సంబంధించిన పోలార్ గ్రాఫిక్ టెక్నిక్ రూపొందించి 

1959లో నోబెల్ ను పొందిన రసాయన శాస్త్రవేత్త "జరొస్లార్ శ్రీరోవ్స్కీ" జననం.


21-1978-మానవరహిత అంతరిక్ష నౌక "వెనీరా-11" శుక్రగ్రహం మీద దిగి,దాదాపు గంట సేపు

 చిత్రాలను పంపిన రోజు.


22-1887-రాయల్ సొసైటీలో ఫెలోషిప్ అందుకున్న తొలి భారతీయుడు,గణిత శాస్త్రవేత్త "శ్రీనివాస

 రామానుజన్" జననం.


23-1956-అమెరికా శాస్త్రవేత్తలు "విలియం షాక్లీ","వాల్టర్ బ్రిటన్","జాన్ బర్డీన్" పరిశోధనతో 

ట్రాన్సిస్టర్ ఆవిష్కరించబడిన రోజు.


24-1843-వివిధ శక్తి రూపాల మధ్య మార్పిడి సూత్రాన్ని ప్రతిపాదించిన "జేంస్ జౌల్" జననం.


25-1642-గురుత్వాకర్షణ సిద్ధాంతకర్త,స్పెక్ట్రాగ్రాఫ్,స్పెక్ట్రామీటర్ పరికరాల రూపకర్త,"ఫిలసోఫియా 

నాచురాలిస్ ప్రిన్సిపియా మాథమేటికా" గ్రంథకర్త "సర్ ఐజాక్ న్యూటన్" జననం.


26-1792-"డిఫరెన్స్ ఇంజన్" అని పిలువబడిన "మెకానికల్ కంప్యూటర్" రూపశిల్పి,గణిత 

శాస్త్రవేత్త "చారెస్ బాబేజ్" జననం.


27-1571-గ్రహచలన సిద్ధాంతాలను ప్రతిపాదించిన "జోహెన్నెస్ కెప్లర్" జననం.


28-1829-"బయాలజీ" అన్న పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టిన "లామార్క్" మరణం.


29-1993-జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అమెరికాలో సమావేశం జరిగిన రోజు.భారత్ సహా 

వందకు పైగా దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.డిసెంబరు 29న అంతర్జాతీయ జీవవైవిధ్య 

దినోత్సవంగా పాటిస్తారు.


30-1971-భారత్ మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి,అహ్మదాబాద్లో వస్త్ర 

కర్మాగారాల పరిశోధన సంస్థ స్థాపనకు కారకుడు,శాస్త్రవేత్త "డా.విక్రం సారాభాయ్" మరణం.


31-1991-ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ(1956) కు,"అతివాహకత్వం" వివరించినందుకు(1972) రెండు

 సార్లు నోబెల్ అందుకున్న "జాన్ బర్డీన్" మరణం.

4, జులై 2014, శుక్రవారం

నవంబరు నెల సైన్సు సంగతులు

శుక్రవారం, జులై 04, 2014 0 Comments



1-1919-విశ్వం పుట్టుకకు సంబంధించి "Steady state theory" ని ప్రతిపాదించిన గణిత 

శాస్త్రవేత్త "హెర్మన్ బాండి" జన్మదినం.



2-1833-"Indian association for cultivation of science" సంస్థాపకులు "మహేంద్ర లాల్ 

సర్కార్" జన్మదినం.



3-1957-"లైకా" అనే కుక్క అంతరిక్షయానం చేసిన "స్పుత్నిక్-2" ను అప్పటి రష్యా దేశం ఈ 

రోజునే ప్రయోగించింది.



7-1867-"మేరీ క్యూరి" జన్మదినం.రేడియోథార్మికతకు సంబంధించి 1903లో భర్త "పియరీ 

క్యూరీ" మరియు "హెన్రీ బెకెరెల్" తో కలిసి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ని 


అందుకున్నారు."రేడియం","పోలోనియం" మూలకాలను ఆవిష్కరించినందుకు 1911లో 2వ 

సారి రసాయనశాస్త్రంలో నోబెల్ లభించింది.



7-1888-"సర్ సి.వి.రామన్" పుట్టిన రోజు.



8-1895-"Wilhelm Roentgen" X-కిరణాలను ఆవిష్కరించారు.


9-1904-పుష్పించే మొక్కలజు సంబంధించి విస్తృత పరిశోధనలు చేసిన భారతీయ వృక్ష శాస్త్రవేత్త 

"పంచానన్ మహేశ్వరి" జన్మదినం.



12-1896-భారతదేశంలో పక్షులకు సంబంధించి ఆనేక పరిశోధనలు చేసి,బొంబాయిలో "నేచురల్

 హిస్టరీ సొసైటీ" ఏర్పడటానికి కృషి చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త "సలీం అలీ" జన్మదినం.



14-1891-భారతీయ వృక్ష శాస్త్రవేత్త "బీర్బల్ సాహ్ని" జన్మదినం.



15-1640-ఖగోళ శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి గ్రహగతులకు సంబంధించి కెప్లర్ గ్రహగమన

 సూత్రాలను నిర్వచించిన "జోహెన్నెస్ కెప్లర్" మరణించిన రోజు.



16-1965-రష్యా మానవరహిత అంతరిక్ష నౌక "వెనీరా-3" శుక్రగ్రహం వైపు ప్రయాణించిన రోజు.



18-1962-పరమాణు నిర్మాణానికి పరిశోధనలు చేసి,1922లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని

 పొందిన "నీల్స్ బోర్" మరణ దినం.



20-1889-అమెరికా ఖగోళ శాస్త్రవేత్త "ఎడ్విన్ హబుల్" జన్మదినం.పాలపుంతలు,విశ్వ 

నిర్మాణానికి సంబంధించిన పరిశోధనలు చేశారు.



21-1970-సర్ సి.వి.రామన్ మరణించిన రోజు.



23-1937-"జగదీశ్ చంద్రబోస్" మరణదినం.



24-1859-"ఆరిజన్ ఆఫ్ స్పిషీస్" ప్రచురించిన రోజు(చార్లెస్ డార్విన్).



26-1885-కాస్మిక్ రేస్,కృత్రిమ రేడియో థార్మికతకు సంబంధించి పరిశోధనలు చేసిన "దేబేంద్ర 

మోహన్ బోస్" జన్మదినం.



27-1971-రష్యా మానవరహిత అంతరిక్ష నౌక "మార్స్-2" కుజగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసింది.



28-1954-థర్మల్ న్యూట్రాన్స్ పై పరిశోధన చేసి 1938లో నోబెల్ పొందిన అమెరికా భౌతిక శాస్త్రవేత్త

 "ఎన్రికో ఫెర్మి" మరణించిన రోజు.

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పాఠశాల స్థాయి ప్రశ్నలు

శుక్రవారం, జులై 04, 2014 0 Comments

1.మనం వాడుతున్న PVC పైపుల పేరులోని PVCని విస్తరించగా?

2.నీటి అణువు ఆకృతి

3.సూర్యుడు వంటి అనేక నక్షత్రాలు వెలుగునివ్వడానికి ఖర్చవుతున్న ఇంధనం పేరేమిటి?

4.బోదకాలు వ్యాధి ఏ దోమ కుట్టడం వల్ల వస్తుంది..

5.శ్మశాన వాటికలో అప్పుడప్పుడు మంటలు లేస్తుంటాయి.ఎందువల్ల?

6.2010 కామన్వెల్త్ క్రీడలు మనదేశంలో ఎక్కడ జరిగాయి.

7.కోనులు,దండాలు శరీరంలో ఏ భాగంలో ఉంటాయి..

8.వెల్డింగ్ చేయుటలో ఉపయోగించే వాయువు..

9.పిల్లల పళ్ళమీద పసుపు పచ్చని మచ్చలు,గారలు రావట, ఏ వ్యాధి లక్షణం..

10.టెలివిజన్ లోపలి తెరమీద పడే కణాలు ఏవి..

11.దొంగస్వాములు,దొంగ బాబాలు గాలిలో నుండి విభూతి,హరాలు,లింగాలు వంటి పదార్ధాలను సృష్టిస్తామనడం ఏ శాస్త్రీయ నియమానికి వ్యతిరేకం..

12.సెల్ ఫోన్ బ్యాటరీలో విరివిగా వాడుతున్న లోహం ఏది..

13.మంత్రాలు,చేతబడి,బాణామతి(చిల్లంగి) చేయడం ద్వారా ఒక వ్యక్తిని చంపవచ్చా..

14.ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని "అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరం" గా ప్రకటించింది.

15.ఒక చేత్తో బకెట్ నిండా నీళ్ళను తీసుకెళ్తున్న వ్యక్తి తన రెండో చేతిని కొద్దిగా చాస్తాడు.ఎందుకు?

16.పొడి సున్నానికి నీటిని కలిపినపుడు జరిగే చర్య ఏ రకమైనది.

17.చంద్రగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది?

18.నీలం,పసుపు రంగులను కలపగా వచ్చే రంగు.

19.'B' సంకేతం గా ఉన్న మూలకం ఏది?

20.మానవుని శరీరంలో ఏ మూలకపు పరమాణువులు ఎక్కువగా ఉంటాయి?

21."సూర్య కేంద్రక" సిద్ధాంతకర్త.

22.మనదేశ జాతీయ పక్షి ఏది?

23.ఆంధ్రప్రదేశ్ లో బాలబాలికలకు ఉచిత,నిర్భంధ విద్యాహక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?

24.SIM ను విస్తరించగా...

25.మన ఇళ్ళలో ముగ్గులు వేయడానికి వాడే ముగ్గు రసాయన నామం.

26.మనదేశంలో జనాభా గణన(సెన్సస్) ఎన్నేళ్ళ కొకసారు జరుగుతుంది

27.2011 క్రికెట్ ప్రపంచకప్ విజేత

28.శిశువు లింగనిర్ధారణకు కారణం

29.ఉల్లి,వెల్లుల్లి లలో ఘాటైన వాసనకు కారణం.

అక్టోబరు నెల సైన్సు సంగతులు

శుక్రవారం, జులై 04, 2014 0 Comments



2-1608-మొట్టమొదటి ఆప్టికల్ టెలిస్కోపును "హాన్స్ లిప్పిర్షి" నెదర్లాండ్స్ లో ప్రయోగాత్మకంగా

 ఉపయోగించిన రోజు.


3-1947-"మాక్స్ ఫ్లాంక్"(జర్మనీ)మరణించిన రోజు.ఈయన కాంతి ధర్మాలు-క్వాంటం సిద్ధాంతం 

ను ప్రతిపాదించారు.


4-1957-రష్యా మానవ నిర్మిత "స్పుత్నిక్" ఉపగ్రహంను ప్రయోగించిన రోజు.


5-1864-ఫ్రెంచి శాస్త్రవేత్త "లూయిస్ జీన్ లూమీరీ" జన్మదినం.ఈయన తన సోదరుడు "ఆగష్ట్ 

జీన్ లూమీరీ" తో కలిసి సినిమాటోగ్రఫీ,కలర్ ఫోటోగ్రఫీ లను కనుగొన్నారు.


6-1807-"సర్ హంఫ్రీ డేవీ" పొటాషియం మూలకంను ఆవిష్కరించిన రోజు.పొటాష్ ను విద్యుత్ 

విశ్లేషణ చేయడంవల్ల పొటాషియం మూలకాన్ని వేరు చేసారు.


8-1922-భారతీయ భౌతిక శాస్త్రవేత్త "గోపాల సముద్రం నారాయణ రామచంద్రన్

జన్మదినం."కొల్లాజన్" ప్రొటీన్ నిర్మాణాన్ని వివరించారు.ఇది చర్మం మరియు ఎముకలలో 

ఉంటుంది.


9-1893-భారతీయ భౌతిక,ఖగోళ శాస్త్రవేత్త "మేఘ నాధ సాహా" జన్మదినం.ఈయన ఉష్ణ 

అయనీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించారు.


10-1731-బ్రిటిష్ శాస్త్రవేత్త "హెన్రీ కావెండిష్" జన్మదినం."హైడ్రోజన్" మరియు "ఆర్గాన్" 

వాయువులను ఈయనే కనుగొన్నారు.విద్యుత్ ధర్మాలపై పరిశోధనలు చేసారు.


11-1889-బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త "జేంస్ ప్రిస్కాట్ జౌల్" మరణ దినం.వివిధ రూపాల శక్తిలో 

పరస్పరం అంతర మార్పిడి జరుగుతుందని,వాయు అణు చలన సిద్ధాంతం ను ప్రతిపాదించారు.


15-1564-మానవ సరీరాన్ని మొదటగా కోసి నిర్మాణాన్ని తెల్పిన "ఆండ్రియాస్ వెసాలియస్

మరణించిన రోజు.


17-1831-బ్రిటిష్ శాస్త్రవేత్త "మైఖేల్ ఫారడే" విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్నారు.నిరోధక 

తీగలు చుట్టబడిన రెండు ఇనుప తీగలతో ప్రయోగాలు చేస్తూ దీన్ని కనుగొన్నారు.


18-1931-"థామస్ ఆల్వా ఎడిసన్" అమెరికా,న్యూజెర్సీ లో మరణించిన రోజు.విద్యుత్ 

బల్బు,కార్బన్,టెలీఫోన్,చలన చిత్రం...ఇలా ఎన్నో ఆవిష్కరించారు.


19-1910-భారతదేశంలో జన్మించి,అమెరికాలో స్థిరపడిన "సుబ్రహ్మణ్య చంద్రశేఖర్

జన్మదినం.నక్షత్రాల వయస్సు,వాటి నాశనం గూర్చి పరిశోధించారు.


21-1833-స్వీడన్ రసాయన శాస్త్రవేత్త,ఇంజనీర్ "ఆల్ఫ్రెడ్ నోబెల్" జన్మదినం.వీరి డైనమైట్ 

ఆవిష్కరణ వల్ల వచ్చిన మొత్తాన్ని నోబెల్ బహుమతుల కోసం వాడుతున్నారు.


24-1632-డచ్ శాస్త్రవేత్త "ఆంటోని వాన్ లీవెన్ హుక్" జన్మదినం.శక్తివంతమైన భూతద్దాల 

సాయంతో సూక్ష్మజీవులను పరిశీలించి ప్రపంచానికి పరిచయం చేసారు.


28-1914-"జోనస్ ఎడ్వర్డ్ సాక్" అమెరికాలోని న్యూయార్క్ లో జన్మించారు.


29-1656-బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త "ఎడ్మండ్ హేలీ" జన్మదినం.


30-1909-భారతీయ న్యూక్లియర్ శాస్త్రవేత్త "Dr.హోమీ జె భాభా" జన్మదినం.BARC వీరి పేరు 

మీదనే స్థాపించబడింది.




3, జులై 2014, గురువారం

సెప్టెంబరు నెల సైన్సు సంగతులు

గురువారం, జులై 03, 2014 0 Comments


2-1982-అయస్కాంతంతో నడిచే రైలుని జపాన్ లో విజయవంతంగా పరీక్షించిన రోజు.


3-1832-ఫ్రెంచి శాస్త్రవేత్త "హైపోలైట్ పిక్సీ" మొదటి డైనమోను విజయవంతంగా పని చేయించిన

 రోజు.


6-1793-అణు నిర్మాణం గురించి మొదటి ప్రతిపాదనలు,సిద్ధాంతాలను చేసిన "జాన్ డాల్టన్"

 జన్మదినం.


9-1737-ఇటలీ దేశానికి చెందిన జంతు శాస్త్రవేత్త "లూగీ గెల్వానీ" జన్మదినం.కప్ప కండరాల 

మీద విద్యుత్ ప్రభావాన్ని గమనించి,ఆ పరిశీలన ఆధారంగా విద్యుదుత్పత్తి చేసే రసాయన 

ఘటాలు రూపొందించబడ్డాయి.


10-1967-NASA వారు ప్రయోగించిన మానవ రహిత అంతరిక్ష నౌక "సర్వేయర్-5" చంద్రుని పై

 దిగిన రోజు.


11-1877-ఇంగ్లండుకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త "జేంస్ హావ్వుడ్ జీన్స్" జన్మదినం.ఈయన సౌర 

వ్యవస్థకు సంబంధించి "అల పరిణామ సిద్ధాంతం",నక్షత్ర నిర్మాణానికి సంబంధించి పరిశోధనలు 

చేశాడు.


13-1886-ఇంగ్లండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త "రాబర్ట్ రాబిన్సన్" పుట్టిన రోజు.మొక్క 

ఆల్కలాయిడ్ లకు సంబంధించిన పరిశోధనలు చేసి 1947లో నోబెల్ ను అందుకున్నాడు.


14-1939-రష్యా ఇంజనీర్ "సికోర్ స్కీ"భారీ ఎత్తున తయారు చేసిన హెలీకాప్టర్ లతో 

మొదటిదానిని నడిపిన రోజు.


15-1959-భారతదేశంలో టీవీ ప్రసారాలు(దూరదర్శన్) ప్రారంభమైన రోజు.


16-1932-మలేరియాకు సంబంధించి కారణాలు,వ్యాప్తి గూర్చి పరిశోధనలు చేసి 1902లో వైద్య

 రంగంలో నోబెల్ పొందిన "సర్ రోనాల్డ్ రాస్" మరణించిన రోజు.


18-1819-ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్త "జీన్ బెర్నార్డ్ లియోన్ ఫోకాల్ట్" జన్మదినం.వీరు "గైరోస్కోపు"

 ను రూపొందించి కాంతి వేగాన్ని తొలిసారి కనుగొన్నారు.


20-1842-థర్మోఫ్లాస్కు రూపకర్త "జేంస్ దీవార్" జన్మదినం.వీరు ప్రప్రథమంగాహైడ్రోజన్ 

వాయువును ధృవీకరించారు.


22-1791-విద్యుత్ అయస్కాంతత్వం,విద్యుత్ ప్రవాహ రసాయన థర్మాలు మొదలైన

 రంగాల్లోపరిశోధనలు చేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త "మైఖేల్ ఫారడే" జన్మ దినం.


26-1849-రష్యన్ శాస్త్రవేత్త "ఐవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్" జన్మదినం.జీర్ణక్రియలు,నిబంధన సహిత

 ప్రతీకార చర్యల గురించి పరిశోధనలు చేశారు.1904లో నోబెల్ బహుమతి పొందారు.


28-1895-ఫ్రెంచి రసాయన,జీవ శాస్త్రజ్ఞుడు "లూయిస్ పాశ్చర్" మరణ దినం.క్రిమి సిద్ధాంతం,కుక్క

 కాటుకి మందు,త్రిమితీయ రసాయన శాస్త్ర పరిశోధనలు చేశారు.


29-1962-మనదేశంలో మొట్టమొదటి పెద్ద ప్లానెటోరియం-"బిర్లా ప్లానెటోరియం"(కలకత్తాలో) 

ఆరంభింపబడిన రోజు.


2, జులై 2014, బుధవారం

ఆగష్టు నెల సైన్సు సంగతులు

బుధవారం, జులై 02, 2014 0 Comments



1-1744-మొక్కలు,జంతువులు పరిసరాలకు అనుగుణంగా తమ శరీరభాగాలను 

మార్చుకుంటాయనీ,ఆ మార్పులు తర్వాత వాటి సంతతికి సంక్రమిస్తాయనీ వివరించిన ఫ్రెంచి జీవ 

శాస్త్రవేత్త "జీన్ బాప్టిస్ట్ లామార్క్" జన్మదినం.


2-1861-బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ స్థాపకుడు,భారతీయ రసాయన శాస్త్రవేత్త 

"ప్రఫుల్ల చంద్ర రే" జన్మదినం.


4-1956-ట్రాంబేలోని అణుశక్తి పరిశోధనశాల ప్రస్తుత భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో 

రూపొందించిన మొట్టమొదటి అణు రియాక్టరు "అప్సర" విజయవంతంగా ప్రయోగింపబడిన 

రోజు.


5-1914-అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఓహియొ లోని క్లీవ్ లాండ్ లో మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ 

లైట్లు ప్రారంభించబడ్డాయి.


6-1818-"అలెగ్జాండర్ ఫ్లెమింగ్" పుట్టినరోజు.


6-1945-2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ,జపాన్ లోని హిరోషిమా నగరం మీద మొట్టమొదటి 

అణుబాంబును ప్రయోగించింది.


10-1945-ద్రవ ఇంధనంతో రాకెట్ ను నిర్మించిన అమెరికన్ ఇంజనీర్ "రాబర్ట్ హెచ్ గాడార్డ్

మరణించిన రోజు.


12-1919-భారత అంతరిక్ష విజ్ఞానరంగంలో పునాదిలాంటి వాడైన "విక్రం సారాభాయ్

జన్మదినం.


13-1963-వాతావరణం పై ఉన్న అయనోస్పియర్ కు సంబంధించి పరిశోధనలు చేసిన భారత 

శాస్త్రవేత్త "శిశిర్ కుమార్ మిత్రా" మరణించిన రోజు.


18-1868-హీలియం మూలకాన్ని కనుగొన్న రోజు.సంపూర్ణ సూర్య గ్రహణ సందర్భంగా తీసిన 

వర్ణపటాన్ని విశ్లేషించగా,అందులో హీలియం ఉనికి లభించింది.


20-1779-రసాయన సంకేతాలను సూచించే ఆధునిక పద్ధతిని ప్రవేశపెట్టిన స్వీడిష్ రసాయన 

శాస్త్రవేత్త "జాన్స్ జకబ్ బెర్జీలియస్" మరణ దినం.


21-1975-అమెరికా వారి NASA మానవ రహిత అంతరిక్ష నౌక వైకింగ్-1 ను కుజ గ్రహం మీదకి 

ప్రయోగించిన రోజు.


25-1966-చంద్రుని నుంచి చూస్తే భూమి ఎలా కనబడుతుందో మొట్టమొదటిసారి చిత్రాలు 

తీశారు.మానవ రహిత అంతరిక్ష నౌక "ఆర్బిటార్" నుండి భూమి ఫోటోను తీశారు.


26-1743-ద్రవ్యనిత్యత్వ నియమంను ప్రతిపాదించిన ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త "ఆంటోనీ లారెంట్ 

లేవోయిజర్" జన్మదినం.


31-1955-మొదటి సారి సౌర శక్తితో నడిచే కారును అమెరికా వారు తయారు చేశారు.

జూలై నెల సైన్స్ సంగతులు

బుధవారం, జులై 02, 2014 0 Comments


3-1928-లండన్ లో "జాన్ లాగ్ బయర్డ్" ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కలర్ టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమైన రోజు.


4-1934-మేడం క్యూరీ మరణించిన రోజు.


6-1929-వార్నర్ బ్రదర్స్ చే రూపొందించబడిన పూర్తి నిడివి మాటలు గల చలన చిత్రం "లైట్స్ ఆఫ్

 న్యూయార్క్" న్యూయార్క్ లో స్ట్రాండ్ థియేటర్ లో విడుదలైన రోజు.


7-1960-అమెరికా శాస్త్రవేత్త "థోడర్ మైమస్" రూబీ కడ్డీ మీద మొట్టమొదట రూపొందించిన 

లేజర్ ను ప్రదర్శించిన రోజు.


9-1819-అమెరికా లోని మసాచుసెట్స్ లో "ఇలియాస్ హోవె" కుట్టు మిషన్ ను రూపొందించారు.


12-1854-ఫోటోగ్రఫీకి చెందిన రోల్ ఫిల్మ్ ను తయారు చేసిన "జార్జి ఈస్ట్ మన్" జన్మించిన రోజు.


14-1867-రెడ్ హిల్స్ లో "ఆల్ఫ్రెడ్ నోబెల్" డైనమైట్ కున్న పేలుడు శక్తిని ప్రయోగాత్మకంగా 

నిరూపించిన రోజు.


20-1937-వైర్ లెస్ టెలీగ్రఫీని రూపొందించినందుకు 1909లో భౌతికశాస్త్రంలో నోబెల్ ను పొందిన 

మార్కోనీ మరణించిన రోజు.


18-1635-బ్రిటిష్ శాస్త్రవేత్త "రాబర్ట్ హుక్" జన్మదినం.సూక్ష్మదర్శిని సాయంతో మొక్క కణాలను 

పరిశీలించి,వాటికి సెల్స్ అని పేరు పెట్టడమే కాకుండా "స్థితిస్థాపకత" ను వివరించింది కూడా 

ఈయనే!


19-1993-బహుళార్థసాధక ఉపగ్రహం  ఇన్ శాట్ 2B ని ఫ్రెంచి గయానా నుండి విజయవంతంగా ప్రయోగించిన రోజు.


21-1969-నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద కాలు మోపిన చారిత్రాత్మక దినం.


22-1822-జన్యు శాస్త్రానికి పునాది వేసిన ఆస్ట్రియా మత గురువు,వృక్ష శాస్త్రవేత్త "గ్రెగర్ జోహాన్ 

మెండెల్" జన్మదినం.


25-1978-ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ "లూయిస్ బ్రౌన్" ఇంగ్లండులో జన్మించిన రోజు.


29-1973-అమెరికాకు చెందిన అంతరిక్ష స్థావరం "స్కై లాబ్" ప్రయోగించబడిన రోజు.1979 

అక్టోబర్ లో ఇది తన కక్ష్య నుండి బయటికి వచ్చి హిందూ మహా సముద్రం లో కూలిపోయింది.

                                                       

                                                                -చెకుముకి పత్రిక ఆధారంగా..