11, జులై 2014, శుక్రవారం

చెకుముకితో నేను

ఈ చిత్రం తొమ్మిదో తరగతిలో మండల స్థాయిలో మేము నెగ్గినపుడు....


నేను ఎనిమిదో తరగతిలో ఉండగా ఒక రోజు చెకుముకి పాఠశాల స్థాయి పరీక్ష జరిగింది.నిజం చెప్పాలంటే అప్పటికి ఆ పరీక్ష పేరు కూడా నాకు తెలియదు.హై స్కూల్లో ఆ సంవత్సరమే చేరాను.అప్పటి వరకు అప్పర్ ప్రైమరీ పాఠశాల్లో చదివాను.


మా స్నేహితులందరూ రాస్తుండటంతో నాకు రాయాలనిపించి నేనూ వాళ్ళతో వెళ్ళి రాశాను.
ఆ పరీక్ష జనవిజ్ఞాన వేదిక వారు నిర్వహిస్తారు.8,9,10 తరగతులవారు మాత్రమే అర్హులు.ఈ మూడు తరగతులకి ఒకే పరీక్షాపత్రం ఉంటుంది.ఒక్కో తరగతి నుండి ఎక్కువ మార్కులు పొందిన ఒక్కర్ని మాత్రమే ఎంపిక చేసి,ఆ ముగ్గుర్ని ఆ పాఠశాల నుండి మండల స్థాయి కి పంపుతారు.ఇక పరీక్షాపత్రం విషయానికి వస్తే ప్రశ్నలు అన్ని విభాగాల నుండి ఉంటాయి.
ఆ రోజు నేనే ఎనిమిదవ తరగతిలో ఎంపికయ్యాను.తర్వాతి మండల స్థాయిలో కూడా మా పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది.తరవాత జిల్లా స్థాయి మా పాలకొల్లు సబితా మహిళ కళాశాలలో జరిగింది.జిల్లా స్థాయిలో ఏంటంటే వచ్చిన టీములందరూ పరీక్ష రాయాలి.వారిలోనుండి 6 టీములను ఎంపిక చేసి వారికి క్విజ్ నిర్వహిస్తారు.అందులో విజేతను ప్రకటిస్తారు.అందులోనూ మా టీమే గెలిచింది.


మా టీం సభ్యులు ఎనిమిదవ తరగతి నుండి నేను,తొమ్మిదవ తరగతి నుండి మహేశ్,పదవ తరగతి నుండి సత్యవేణి.
ఇక రాష్ట్ర స్థాయి రాజమండ్రిలో,రివర్ బే లో జరిగింది.అక్కడ కేవలం క్విజ్ మాత్రమే నిర్వహించారు.అక్కడ విజేతలంటూ ఎవర్నీ ఎంపిక చెయ్యలేదు.అక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ జ్ఞాపికలు,ధృవ పత్రాలు ఇచ్చారు.
ఇదంతా ఎనిమిదో తరగతిలోని సంగతి.ఇక తొమ్మిదో తరగతిలో ఆ తరగతి నుండి నేను ఎంపికయ్యాను.జిల్ల స్థాయి వరకు వెళ్ళాము.అక్కడ నాలుగవ స్థానం తో సరిపెట్టుకున్నాము.ఆ తర్వాత పదవ తరతిలో కూడా నేనే.అప్పుడు కూడా 4వ స్థానమే!
ఇవండీ చెకుముకి పరీక్షతో నేను,నా సంగతులు.మరి ఇప్పుడు ఈ పరీక్ష ఎలా నిర్వహిస్తున్నారో నాకు తెలియదు.అప్పట్లో నేను ఈ పరీక్ష ఎప్పుడు పెడతారోనని ఎదుచూసేదాన్ని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...