2-1892-ఇటలీ దేశానికి చెందిన "మార్కొనీ" రెడియోను కనిపెట్టిన రోజు. 3-1857-మొట్టమొదటి మానవ శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో వివరించిన "విలియం హార్వే" మరణం. 4-1934-భౌతిక,రసాయన శాస్త్రాల్లో నోబెల్ పొందిన "మేరీ క్యూరీ" మరణం. 6-1866-దక్షిణ ధృవాన్ని చేరిన రెండవ వ్యక్తి,ఇంగ్లండ్ కు చెందిన "రాబర్ట్ ఫాల్కన్" జననం. 7-1875-కాలా అజార్ ను నిర్మూలించే మందును కనుగొన్న భారతీయ వైద్యుడు "ఉపేంద్రనాధ్ బ్రహ్మచారి" జననం. 8-1904-భారతీయ రసాయన శాస్త్రవేత్త "బీరిస్ చంద్రగుహ" జననం.వీరు విటమిన్ సి,బొగ్గు వాయువీకరణ,సిట్రిక్ ఆసిడ్ మొదలైన వాటి గూర్చి పరిశోధనలు చేసారు. 12-1967-రష్యా దేశం మానవ రహిత అంతరిక్ష నౌక "వెనీరా-4"ను శుక్రునిపై పంపిన రోజు. 16-1963-అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళ "వాలెంటీన తెరిష్కోవా" అంతరిక్ష యాత్ర ప్రారంభమైన రోజు. 17-1950-చికాగొలోని లిటిల్ కంపెనీ ఆఫ్ మేరీ హాస్పిటల్ లో డా.రిచార్డ్ లాలర్ ఆధ్వర్యంలో మొదటిసారిగా మానవ మూత్రపిండాల మార్పిడి చేసిన రోజు. 19-1981-భారతీయ తొలి జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ "ఆపిల్"(Ariane Project Payload Experiment) ను ఫ్రెంచి గయానా నుండి ప్రయోగించిన రోజు. 22-1887-శరీరధర్మాలను విశ్లేషించడానికి గణిత పధ్ధతులను రూపొందించిన బ్రిటిష్ జీవ శాస్త్రవేత్త "జూలియన్ హాక్స్లీ" జననం.వీరు యునెస్కోకు మొదటి డైరెక్టర్ జనరల్. 23-1985-గుంటూరు జిల్లా యలవర్తిలో జన్మించి,అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చర్మ సాంకేతిక శాస్త్రవేత్త "డా.యలవర్తి నాయుడమ్మ" మరణం.వీరు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి(1981-82)ఉపకులపతిగా,CSIR కు(1971-77) డైరెక్టర్ గా పనిచేసారు.1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని రాష్ట్ర శాస్త్ర విజ్ఞానరంగ సలహాదారునిగా నియమించింది. 24-1915-విశ్వానికి సంబంధించిన "Steady state theory"ను రూపొందించిన బ్రిటిష్ గణిత,ఖగోళ శాస్త్రవేత్త "ఫ్రెడ్ హయర్" జననం. 26-1824-"లార్డ్ కెల్విన్" జననం.పరమోష్ణోగ్రత స్కేలు(కెల్విన్ స్కేలు)ను,విద్యుత్,అయస్కాంతత్వం,ఉష్ణగతిక శాస్త్రాలలో కృషి చేసారు.దని ఆ రోజు గమనించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...