1-1578-రక్త ప్రసరణ గురించి ప్రయోగాలు చేసిన బ్రిటిష్ వైద్యుడు "విలియం హార్వే" జననం. 2-1845-సూర్యునిలోని మచ్చలని "హిప్పొలైజ్ జో","లీన్ ఫోకాల్ట్" అనే శాస్త్రవేత్తలు ఫోటో తీసిన రోజు. 3-1984-తొలి భారతీయ అంతరిక్ష యాత్రికుడు "రాకేశ్ శర్మ" 'సోయజ్ టి-11' అనే అంతరిక్షనౌకలో మరో ఇద్దరు సోవియట్ వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో ప్రయాణించారు. 6-1928-డి.ఎన్.ఏ.నిర్మాణాన్ని ప్రతిపాదించిన బృందానికి నాయకుడు "జేంస్ డి.వాట్సన్" జననం. 7-1948-"ప్రపంచ ఆరోగ్య సంస్థ" ఏర్పడిన రోజు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు కల్పించటం ఈ సంస్థ లక్ష్యం.ప్రధాన కార్యాలయం జెనీవా(స్విట్జర్లాండ్)లో ఉంది. 8-1911-కిరణజన్యసంయోగ క్రియకు పరిశోధన చేసిన శాస్త్రవేత్త "మెల్విన్ కాల్విన్" జననం. 17-1979-మెరుపు ఒకరకమైన విద్యుత్ ఉత్సర్గమని వివరించిన "బెంజమిన్ ఫ్రాంక్లిన్" మరణం. 19-1882-జీవ పరిణామ సిద్ధాంతకర్త,బ్రిటిష్ శాస్త్రవేత్త "చార్లెస్ రాబర్ట్ డార్విన్" మరణం. 23-1858-క్వాంటం సిద్ధాంతాన్ని రూపొందించిన జర్మన్ శాస్త్రవేత్త "మాక్స్ ఫ్లాంక్" జననం. 25-1982-భారతదేశంలో మొదటిసారిగా కలర్ టెలివిజన్ ప్రసారాలు న్యూఢిల్లీలో ప్రారంభమైన రోజు. 25-1874-వైర్లెస్ టెలిగ్రాఫ్ ను కనుగొన్న ఇటలీ శాస్త్రవేత్త "మార్కొనీ" జననం. 28-ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...