1-1744-మొక్కలు,జంతువులు పరిసరాలకు అనుగుణంగా తమ శరీరభాగాలను మార్చుకుంటాయనీ,ఆ మార్పులు తర్వాత వాటి సంతతికి సంక్రమిస్తాయనీ వివరించిన ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త "జీన్ బాప్టిస్ట్ లామార్క్" జన్మదినం. 2-1861-బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ స్థాపకుడు,భారతీయ రసాయన శాస్త్రవేత్త "ప్రఫుల్ల చంద్ర రే" జన్మదినం. 4-1956-ట్రాంబేలోని అణుశక్తి పరిశోధనశాల ప్రస్తుత భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో రూపొందించిన మొట్టమొదటి అణు రియాక్టరు "అప్సర" విజయవంతంగా ప్రయోగింపబడిన రోజు. 5-1914-అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఓహియొ లోని క్లీవ్ లాండ్ లో మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ లైట్లు ప్రారంభించబడ్డాయి. 6-1818-"అలెగ్జాండర్ ఫ్లెమింగ్" పుట్టినరోజు. 6-1945-2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ,జపాన్ లోని హిరోషిమా నగరం మీద మొట్టమొదటి అణుబాంబును ప్రయోగించింది. 10-1945-ద్రవ ఇంధనంతో రాకెట్ ను నిర్మించిన అమెరికన్ ఇంజనీర్ "రాబర్ట్ హెచ్ గాడార్డ్" మరణించిన రోజు. 12-1919-భారత అంతరిక్ష విజ్ఞానరంగంలో పునాదిలాంటి వాడైన "విక్రం సారాభాయ్" జన్మదినం. 13-1963-వాతావరణం పై ఉన్న అయనోస్పియర్ కు సంబంధించి పరిశోధనలు చేసిన భారత శాస్త్రవేత్త "శిశిర్ కుమార్ మిత్రా" మరణించిన రోజు. 18-1868-హీలియం మూలకాన్ని కనుగొన్న రోజు.సంపూర్ణ సూర్య గ్రహణ సందర్భంగా తీసిన వర్ణపటాన్ని విశ్లేషించగా,అందులో హీలియం ఉనికి లభించింది. 20-1779-రసాయన సంకేతాలను సూచించే ఆధునిక పద్ధతిని ప్రవేశపెట్టిన స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త "జాన్స్ జకబ్ బెర్జీలియస్" మరణ దినం. 21-1975-అమెరికా వారి NASA మానవ రహిత అంతరిక్ష నౌక వైకింగ్-1 ను కుజ గ్రహం మీదకి ప్రయోగించిన రోజు. 25-1966-చంద్రుని నుంచి చూస్తే భూమి ఎలా కనబడుతుందో మొట్టమొదటిసారి చిత్రాలు తీశారు.మానవ రహిత అంతరిక్ష నౌక "ఆర్బిటార్" నుండి భూమి ఫోటోను తీశారు. 26-1743-ద్రవ్యనిత్యత్వ నియమంను ప్రతిపాదించిన ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త "ఆంటోనీ లారెంట్ లేవోయిజర్" జన్మదినం. 31-1955-మొదటి సారి సౌర శక్తితో నడిచే కారును అమెరికా వారు తయారు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...