2, ఆగస్టు 2015, ఆదివారం

పొట్టిక్కలూ..అప్పనపల్లి..!!

ఆదివారం, ఆగస్టు 02, 2015 6 Comments

ఈ రోజు మా కుటుంబ సమేతంగా అయినవిల్లి మరియు అప్పనపల్లి వెళ్ళాము..దారిలో చించినాడ గోదావరి రేవు దగ్గర ఆగి..గోదావరి అందాలను మా కేమేరాలో బంధించి తర్వాత..డొక్కా సీతమ్మ ఆక్విడక్టు ను కూడా చూసి...దారిలో అంబాజీపేట హోటల్లో "పొట్టిక్కలు"ను రుచి చూశాం...అవి చాలా బాగున్నాయి...తర్వాత అయినవిల్లి శ్రీ వరసిద్ధివినాయక స్వామిని దర్శనం చేసుకున్నాం..అక్కడే భోజనం చేసి అక్కడ్నించి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామిని దర్శనం చేసుకున్నాం..





చించినాడ వంతెన కింద ప్రభాత గోదావరి


డొక్కా సీతమ్మ ఆక్విడక్టు


వేడి వేడి పొట్టిక్కలు తయారు..!!


దారిలో...ఒక సారి గైల్ ఇండియా గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది కదా..ఆ ఊరి పేరు "నగరం"...అక్కడ ఇవి రహదారి పక్కన అమ్ముతుంటే కొన్నా...అంతకుముందు కూడా కొన్నిసార్లు తిన్నాం..చాలా బావుంటాయి...వీటి పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి..!!


వీటి పేరే తెలియనిది..??


21, జూన్ 2015, ఆదివారం

క్విల్లింగ్...Jewellery

ఆదివారం, జూన్ 21, 2015 0 Comments

ఫేస్ బుక్ లో క్విల్లింగ్ చెవి జుంకాలు ఎన్ని ఉన్నాయో!!!మాకూ అలాగ చెయ్యాలనిపించింది..చిన్నచిన్న పువ్వులు,ఆకులు లాంటివి చెయ్యడం వచ్చు కానీ..ఇలా చెవి జుంకాలు చెయ్యడం తెలియదు..అయితే ఈ అంతర్జాలం ద్వారా నేర్చుకోలేనివి ఏమున్నాయి..ఫలానాది చెయ్యడం నాకు రాదు అనడానికి లేదు....అలా అంతర్జాలం ద్వారా చూసి నేర్చుకున్నాం..ఇంతకీ చెయ్యడం వచ్చేసింది..సరే...మరి అవి తయారు చెయ్యడానికి కావల్సిన సామాగ్రి కావాలి కదా!!

ఆన్ లైన్ అంగళ్ళలో ఉన్నాయి కానీ...షిప్పింగ్ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి..ఏం చెయ్యాలో అర్ధం కాలేదు...ఫేస్ బుక్ లో అలాంటివి అమ్మే కొన్ని పేజీలు దొరికాయి...వాటిలో కూడా ఆ కొరియర్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి..చివరికి మా పాలకొల్లులోనే మామిడిపల్లి ఫ్యాన్సీ దుకాణం లో దొరికాయి...హమ్మయ్య...దొరికేసాయ్...అని కొనుక్కుని తెచ్చేసుకున్నాం..కానీ అక్కడ సిల్వర్ కలర్ వి లేవట...ప్చ్..క్విల్లింగ్ పేపర్స్ అమెజాన్ ద్వారా తెప్పించుకున్నాం..
ఆ తర్వాత ఇలా....





7, మే 2015, గురువారం

గుడ్డులో మొక్కలు!

గురువారం, మే 07, 2015 0 Comments

గింజలు వేశాక..




ఇప్పుడే మొలకలు వస్తున్నాయ్..


మొక్కలు వచ్చేశాయ్..


                  ఏప్రిల్ నెల బాలభారతం మాసపత్రికలో చూసి మా చెల్లి వీటిని తయారు చేసింది.వాడేసిన గుడ్లలో మట్టి వేసి దానిలో మెంతులు,ధనియాలు వేసింది.ధనియాలను పగులగొట్టి వేయాలట కదా...!దానికి తెలియక అలాగే వేసేసింది..అవి మొలకెత్తలేదు.కేవలం మెంతికూర మాత్రమే మొలిచింది.

                పందికొక్కు ఒకటి ఎప్పుడూ ఇలాంటి వాటి కోసమే కాచుక్కూచుంటుంది.వీటిని రాత్రి పూట లోపల పెట్టేవాళ్ళం.కానీ దురదృష్టవశాత్తూ ఒక రోజు మాత్రం మర్చిపోయి అలాగే బయటే గుడ్లను వదిలేశాం.

          తెల్లారేసరికీ ఆ పందికొక్కు వాటిని చెల్లచెదురు చేసేసింది.మొలిచిన మొక్కలు కాస్తా విరిగిపోయాయి.ప్చ్...అక్కడితో ఆ ప్రహసనం పూర్తయింది..




10, మార్చి 2015, మంగళవారం

"అతడు అడవిని జయించాడు" ను నేనూ చదివాను!

మంగళవారం, మార్చి 10, 2015 0 Comments

నిన్న నేను "అతడు అడవిని జయించాడు" నవలను చదివాను.అది పూర్తిగా రాయలసీమ మాండలికంలో ఉన్నట్లుంది.నేను అర్ధం చేసుకోవడానికి "ఇంచుక" సమయం పట్టింది.అదొక విభిన్నమైన కథాంశం.నాకు సాధారణంగా కుటుంబ కథలంటే ఇష్టం...కానీ ఈ నవలను చదివాక ఇలాంటి కథలంటే కూడా నాకు ఇష్టం కలిగింది.



ఆ కథ చదువుతుంటే నేనూ ఆ ముసలివానితో పక్కనే తిరుగుతూ జరిగినదంతా గమనిస్తున్నట్టు అనిపించింది.చదువూన్నంతసేపూ పుస్తకాన్ని పక్కన పెట్టాలనిపించలేదు.మొత్తానికి రెండు గంటల్లో పూర్తి చేసేసాను.అందులో నాకు చాలా పదాలకు అర్ధం తెలియలేదు...అందులో నాకు బాగా గుర్తు ఉన్న పదాలు..."సుంక్రేసు చెట్టు","తీంట్ర పొదలు",తోటి గువ్వ"...ముఖ్యంగా "సుక్క పంది"..ఈ పదాలకు అర్ధం మీకు తెలిస్తే నాకు చెప్పరూ....!

ఈ నవల్లో నాకు నచ్చిన వాక్యాల్లో ఓ రెండు..."పందులు గునగున నడచివస్తుంటే నల్లగుండ్లు దొర్లుకుని వస్తున్నట్లుంది"...
"పక్షికి గాని,జంతువుకు గాను మానవుడు చేయగల మహోపకారం-వాటి మానాన వాటిని వదిలిపెట్టడమే"


చివరగా నేను చెప్పేదేంటంటే పుస్తక ప్రియులంతా తప్పకుండా...చదవవల్సిన ముఖ్య నవల "అతడు అడవిని జయించాడు"

8, ఫిబ్రవరి 2015, ఆదివారం

చిన్ని అతిథులు

ఆదివారం, ఫిబ్రవరి 08, 2015 2 Comments

మా ఇంటికి రోజూ ఈ అతిథులు వస్తాయి..మా నాన్న గారు వీటిని అలవాటు చేసారు.ఉదయాన్నే 8 అవకుండా వచ్చేస్తాయి.టోపీ పిట్టలు,పిచ్చుకలు,తోక కింద ఎర్రగా ఉండే నల్ల పిట్టలు(నాకు పేరు తెలీదు) ఇంకా కాకులు వస్తాయి..మేమేమి తింటే అదే కొంచెం పెడతాం..టోపీ పిట్టలు సపోటా,అరటి పళ్ళను ఎంత ఇష్టంగా తింటాయో!సంక్రాంతికి నాన్నగారికి,ఎవరో వరి ధాన్యాలు గుత్తు ఇచ్చారు..దాన్ని ఇంటి ముందు వేలాడదీస్తే పిచ్చుకలు రోజూ వస్తున్నాయి..అవి దాని మీద వాలి,ధాన్యంపైన ఉండే పొట్టును వొలిచి మరీ తింటున్నాయి..
ఇక టోపీ పిట్టలు ఉన్నాయంటే మేము దాని దగ్గర్నునంచి వెళ్తున్నా,అవి కదలవు.అదంతా మా మీద నమ్మకమే!వీటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది.ఒకేసారి నాలుగైదు తింటానికి వస్తాయి.ఒకటి తిన్న తర్వాతే ఇంకోటి తింటుంది!అంతవరకు పక్కనే నిల్చుని చూస్తుంది!బకెట్లలో ఉండే నీటిలో జలకాలాటలు కూడా ఆడతాయి..
నాకు పేరు తెలియని పిట్టలు,మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి ఎంత గోల చేస్తాయో!(సరదాగా)..ఆ గోల వినసొంపుగా ఉంటుంది.
ఈ చిత్రాలన్నీ ఐదు రోజులు కష్టపడి తీశాను.

విద్యుత్తీగే ఊయల


క్షీరన్నం తింటూ..


ఫ్రెండ్ కోసం..


ఇదిగో వచ్చేసింది..


మధ్యాహ్నం కిలకిలలు





ఇంటి పైకెక్కి


స్థంభం పైన..




గులాబ్ జాం తినాలా వద్దా?


సర్లే తిందాం!


ఎడమొహం పెడమొహం..ఇప్పుడే గొడవయింది.







15, జనవరి 2015, గురువారం

పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు

గురువారం, జనవరి 15, 2015 0 Comments

నిన్న పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో సంక్రాంతి సంబరాలు మా పాఠశాల లో జరిగాయి.దీనికి MLA Dr.నిమ్మల రామానాయుడు గారు అధ్యక్షత వహించారు.
నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు జరిగాయి.ఆ ప్రాంగణానికి సంక్రాంతి శోభ వచ్చింది.నిజంగా పల్లెలో ఉన్నట్టు అనిపించింది.ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు బాగున్నాయి.ప్రభుత్వ పాఠశాలలకు అవకాశం ఇవ్వలేదేమో!మా పాఠశాలకి పెద్ద మైదానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీమతి పీతల సుజాత పాల్గొన్నారు."సంక్రాంతి వచ్చిందె తుమ్మెదా" పాట సుమారు పది సార్లు విని ఉంటాం..ఆకాశంలో టపాకాయల వెలుగులు కన్నుల విందుగా ఉన్నాయి.
గంగిరెద్దుల విన్యాసాలు,హరిదాసులు,రంగురంగుల రంగవల్లులు,పిట్టలదొర,సోదెమ్మల వేషాలు,దేశవాళీ ఆవులు,కపిల ఆవులూ...అబ్బో...ఇలా ఎన్నో...కనులవిందుగా ఉన్నాయి.