30, నవంబర్ 2013, శనివారం

RGUKT లో సమైఖ్యాంధ్ర

శనివారం, నవంబర్ 30, 2013 3 Comments

మా విశ్వవిద్యాలయంలో మేము కూడా సమైఖ్యంధ్ర ఉద్యమం చేసాము.

ఒకరోజు సాయంత్రం నూజివీడు సమైఖ్యాంధ్ర JAC వ్యవస్థాపకులు వచ్చి మాకు సమైఖ్యంధ్ర మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేసారు.చాలా స్పూర్తిదాయకంగా అనిపించింది.

మాకు పోయిన సెమిష్టరు లో చాలా సెలవులు సమైఖ్యంధ్ర వల్ల వచ్చాయి.బయటి ప్రభావం మా మీద ఉండకపోయినా ఎందుకు ఇచ్చారో తెలియలేదు.పోనీ మమ్మల్ని బయటికి తీసుకెళ్తారా అంటే అదీ లేదు.ఆ సెలవులు ఎలాంటివంటే తరగతులలో కూర్చొని చదువుకోవడమే.మెంటార్స్ రారు.అలాంటప్పుడు ఇవ్వడం ఎందుకో.బయట విద్యార్థులేమో వాళ్ళ చదువులు వదిలేసి సమైఖ్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తుంటే మేము మాత్రం హాయిగా కూర్చొని చదువుకుంటున్నాము.నాకిది నచ్చలేదు.

ఓ రోజు(నవంబర్ 1 న) అసెంబ్లీ అవ్వగానే మా PUC కో ఆర్డినేటర్ గారు ఇప్పుడు సమైఖ్యాంధ్ర విద్యార్థి గర్జన కు PUC 2 వాళ్ళని తీసుకెళ్తానన్నారు.మేము నమ్మలేకపోయాము.అంతకుముందు ఒకసారి మొత్తం విద్యార్థులందరూ క్యాంపస్ మొత్తం ఒకసారి తిరిగి సమైఖ్యాంధ్ర నినాదాలు చేశాము,కానీ బయటకు వెళ్ళలేదు.కానీ ఇప్పుడు నూజివీడు సెంటరులో ఉన్న పెద్దగాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలి.ఆరోజూ ఎండ గొప్పగా ఉంది.మాకదేమీ బాధనిపించలేదు.మేమందరం వెయ్యి మంది ఉన్నాము.మమ్మల్ని ఫిసికల్ డైరెక్టర్స్ కంట్రోల్ చేసారు.ఇద్దరిద్దరు కలిసి నడవమన్నారు.నేను ,రమ్య నడిచాము.అమ్మో చాలా దూరం ఉంది.ప్రతీ సారీ ఆటోలో వస్తాం కదా తెలియలేదు.చివరికి అక్కడికి వెళ్తే అక్కడ కూర్చోవడానికి స్థలం లేదు.అంటే అంతమంది వస్తారని నిర్వాహకులు ఊహించి ఉండరు.మమ్మల్నందర్నీ రోడ్డు పై కాసేపు కూర్చోబెట్టారు.మేము సమైఖ్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసాము.ఫోటోలు తీసుకున్నారు.మంచినీళ్ళు కూడా లేవు.నాకైతే కొంతసేపుంటే పడిపోతానేమో అనిపించింది.కొంతసేపటికి అక్కడ్నుంచి సబ్ కలెక్టరు కార్యాలయానికి వెళ్ళాము.అక్కడ చిన్నపాటి సభ జరిగింది.తిరిగొచ్చేటప్పుడు మా మొహాలు వాడిపోయాయి.కనీసం డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు.చేతులూపుకుంటూ వెళ్ళాను.ఒకవేళ తీసుకెళ్ళుంటే ఏమైనా కొనుకొచ్చేదాన్ని.ప్చ్..ఏం చేస్తాం.అవకాశం చేజారింది.ఇదండీ మా సమైఖ్యాంధ్ర.


కొసమెరుపు:- మా కళాశాలలో తెలంగాణ విద్యార్థులు కూడా ఉన్నారు.

29, నవంబర్ 2013, శుక్రవారం

మీకోసం కొన్ని

శుక్రవారం, నవంబర్ 29, 2013 2 Comments

మీకోసం కొన్ని

పాకుడు రాళ్ళు నవల

మా విశ్వవిద్యాలయం ఉపయోగించే భారతీయ  భాషల అనువాద పరికరం.విడి విడి ఫైల్స్ కాకుండా మొత్తం జిప్ ఫోల్డర్ ను దిగుమతి చేసుకుని దానిని ఎక్స్ ట్రాక్ట్ చేసి,అందులోని HTML పేజీని బ్రౌజరుతో తెరవండి.

మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమా.ఈ ఆట ద్వారా మీకు నచ్చినట్లు బట్టలను అలంకరించండి.Click here.


దీన్ని ఆడాలంటే అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ప్లగిన్ 11.9 మీ బ్రౌసర్ లో ఉండాలి.
నేను చేసినవి కొన్ని ఇవిగో.



 

RGUKT లో నాకిష్టమైనవి

శుక్రవారం, నవంబర్ 29, 2013 1 Comments

RGUKT లో నాకు నచ్చినవి చెప్పమంటే ముఖ్యంగా ల్యాప్ టాప్.నాకు ఏదైనా విషయం అర్ధం కాకపోతే వెంటనే చలో Google లేకపోతే Wikipedia.మా తరగతి అమ్మాయిల్లో అంతర్జాలాన్ని ఎక్కువ వాడేది నేనేనేమో.ఏదైనా పోటీ ఉంటే వెంటనే నోటీస్ బోర్డ్ లో ప్రకటిస్తారు.మొన్న కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ కి మా తరగతి నుండి నేను,అనూష మా కథలు పంపిచాము.పాల్గొందాము అనుకుందే తడవుగా,తర్వాత వచ్చిన వినాయక చవితి రెండు రోజుల సెలవుల్లో కథ తయారు చేసేసుకుని,వెంటనే మా తెలుగు అనువాద పరికరం ద్వారా కథ మొత్తం టైపు చేసి,మా HRT సార్ ని అడిగి మా మెయిలు ద్వారా పంపించాము.మాకు పూర్తి అంతర్జాల సౌకర్యం లేనందువల్ల సార్ ని అడగాల్సి వచ్చింది.

  అక్కడ వసతి సదుపాయాలు చాలా బాగుంటాయి.కొన్ని వెబ్ సైట్స్ లో నుండి పుస్తకాలు దిగుమతి చేస్తాను.ఖాళీ దొరికినప్పుడు అంటే పరీక్షలు ముగిసిన సందర్భాల్లో చదువుతా.రోజూ ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి,హిందు పత్రికలు చూసి ఏమైనా ఆశక్తి కరమైన అంశాలను స్క్రీన్ షాట్ తీసి ఉంచుకుంటాను.ప్రతీ గురువారం భవిత,ఈనాడు ప్రతిభ,సాక్షి ఎడ్యుకేషన్ లను చూస్తుంటాను.

సెమిష్టరు పరీక్షలప్పుడు అంతర్జాల సౌకర్యాన్ని తీసేస్తారు.ఆ పరీక్షలు మొన్న జరిగాయి కదా,ఆ వారమంతా బయట ఏంజరుగుతుందో తెలియక పిచ్చెక్కినట్లు అనిపించింది.ఇంటికి వచ్చేతప్పుడు కూడా నెట్ రాలేదు.ఆ రాత్రి మాకు అత్తారింటికి దారేది చిత్రం వేసారు.

 మొత్తానికి ల్యాప్ టాప్ లేని RGUKT ని ఊహించుకోవడం కష్టం.కాదు కాదు...ఊహించుకోలేము.

27, నవంబర్ 2013, బుధవారం

Some Events

బుధవారం, నవంబర్ 27, 2013 0 Comments

మా కళశాలలో జరిగిన కొన్ని సంఘటనల గూర్చి చెప్తానే.


మా PET మేడం రోజూ PET  పెట్టే వారు.ఉదయమే 6 గంటలకి.చలిలో అన్నమాట.మేం రోజూ వెళ్ళేవాళ్లం.కానీ కొంతమంది రాకుండా రూం లోనె ఉండిపోయేవాళ్ళు.ఒక రోజు వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళకుండా రూం లోనే ఉండిపోయాం.నేను కూర్చునొ చదువుకుంటున్నా.ఇంతలో మేడం పైకి వస్తున్నారన్నారు.PET కి రాకుండా ఉన్నవాళ్ళని కిందకి రమ్మన్నారు.నేను,మీనాక్షికి కిందకి వెళ్లి ఆవిడ చేత తిట్టించుకోవడం ఇష్టం లేదు.ప్రతీరోజు వెళ్ళేవాళ్ళం,ఒక్కరోజు మానేస్తే ...ప్చ్..ఆవిడ రూం లోకి వస్తారేమోనని,మేము 3 అంతస్థులూ ఉంటాం కదా,కిందకి దిగిపోయాం. కింద ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు.నాకు తెలిసిన ఒకా అక్కరూం వెతుకున్నాం,అందులోకి దూరి తప్పించుకుందామని.కానీ రూం దొరకట్లేదు.అటు ఇటు తిరుగుతుంటే మేడం ఇటే వస్తున్నారు.వామ్మో దొరికితే ఏమైనా ఉందా అనుకుని పక్కనున్న రూం లోకి దూరేసాం.అందులోని అక్కవాళ్ళు కూడా ఏమీ అన్లేదు.ఒక పావుగంట ఉండి వెళ్ళిపోయాం.ఇంతకీ మేడం పైకే రాలేదు.మేము కంగారు పడి వెళ్ళామే గానీ చాలా మంది వెళ్ళకుండా రూముల్లోనే ఉన్నారు.
 నవంబర్ 11 తేదిన జాతీయ విద్యా దినోత్సవం కదా. రోజు మా కళశాలలో ఒక కార్యక్రమం జరిగింది.విద్యార్థులకి వ్యాస రచన పోటీలు నిర్వహించారు.సాయంత్రం  గంటలకి కార్యక్రమం మొదలయింది.దీనికి ముఖ్య అతిధిగా IAS 12 ర్యాంకర్ మరియు నూజివీడు డివిజన్ సబ్ కలెక్టరు అయిన కె.వి.ఎన్.చక్రధర్ బాబు గారు విచ్చేశారు.ఆయన ఇచ్చిన ఉపన్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది.ఆయన చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేవారట.గేట్,GRE లలో కూడా మంచి పర్సెంటేజ్ వచ్చిందట.సివిల్స్ మొదటి ప్రయత్నంలో IPS వచ్చిందట.రెండవ ప్రయత్నంలో మొత్తం దేశంలో 12 ర్యాంకు సాధించారు.ఆయన మాలాంటి వారికి స్పూర్తిదాయకం.ఉపన్యాస కార్యక్రమాలు అయ్యాక ఇంజనీరింగ్ విద్యార్థులు విద్య ఆవశ్యకత గురించి ఒక చిన్న నాటకం వేశారు.చాలా బావుంది.మంచి సందేశం ఇచ్చారు.
 13 తేదీన బ్రిగేడియర్ గణేశం గారు(Coordinator Honeybee network AP) మా కళాశాలని సందర్శించారు.మా అందరీకీ చాలా విషయాలు చెప్పారు.కొంత మంది నిరక్షరాస్యులు,పల్లెల్లో ఉండేవాళ్ళు చేస్తున్న కొన్ని ఆవిష్కరణలు మాకు చూపించారు.అవన్నీ చూసి వారిని అభినందించకుండా ఉండలేకపోయాం.మద్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకూ కార్యక్రమం జరిగింది.చాలా బాగుందిఆయన గురించి తెల్సుకోండి.




26, నవంబర్ 2013, మంగళవారం

తీపి గురుతులు

మంగళవారం, నవంబర్ 26, 2013 0 Comments

ఉదయం పాత చిత్రాలన్నీ స్కాన్ చేస్తుంటే ఇవి గుర్తుకు వచ్చి వీటిని కూడా స్కాన్ చేసా. 

ఇది మా పదవ తరగతి చిత్రం


 

ఇది ఐదవ తరగతిలో నవోదయ ప్రవేశ పరీక్ష కోసం చేరిన కోచింగ్ సెంటర్ లోనిది.


 ఇది ఏడవ తరగతిలోని మున్సిపల్ ప్రాధమికోన్నత పాఠశాల లోనిది.



 ఎనిమిదవ తరగతిలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలషిప్ పరీక్ష కోచింగ్ సెంటర్ లోనిది.



25, నవంబర్ 2013, సోమవారం

హాయ్!!!

సోమవారం, నవంబర్ 25, 2013 0 Comments
మిమ్మల్ని కొద్ది రోజుల్లోనే కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.మాకు శనివారం భౌతిక శాస్త్ర పరీక్షతో పీయూసీ రెండవ సంవత్సరం మొదటి సెమిస్టరు పరీక్షలు పూర్తయ్యాయి.నేను నిన్ననే ఇంటికి వచ్చాను.జనవరి 18 వరకూ మాకు సెమిస్టరు బ్రేక్.అంటే సెలవులన్నమాట.కానీ నేను ఇంతకు చెప్పినట్టు మాకు ఈ సెలవుల్లో జీవశాస్త్రం అదనంగా తీసుకున్నవారికి తరగతులు జరుగుతాయి.డిసెంబరు  2 నుండి 28 వరకూ ఉంటాయి.మొన్న జరిగిన వేసవి సెలవుల్లో మేము చదివిన జీవాశాస్త్రం మార్కులు మా జీపీయే లో కలిపారు.నాకు చాలా బాగ వచ్చాయి.నాకు చాలా ఆనందమేసింది.చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది.మున్ముందు చెప్తానే!!