13, జనవరి 2020, సోమవారం

2019 లో ఏమైందంటే....మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు...🤝👍2019 ...నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరం🤗🤩. మర్చిపోలేని సంఘటన ఏమిటంటే కేంద్రీయ విద్యాలయ లో టీచరుగా👩‍🏫 ఉద్యోగం రావడం...అదీ ఒక ఉద్యోగం లో చేరిన కొద్ది నెలలకే..ఇంతకంటే గొప్ప విషయం నాకేం ఉంటుంది. నెలల వారీగా జరిగిన కథేంటో చెప్తా మరి...సరేనా…!!!😉

జనవరి: మొదటి రోజును నల్ల డ్రెస్సు తో మొదలు పెట్టాను. మా అమ్మకి తెలీదు కానీ...తెలిస్తే "కొత్త సంవత్సరం మొదటి రోజున ఆ రంగు ఎవరైనా వేస్తారెంటే..నీకు నేను చెప్పలేను..మతానికి ఎదురు మంచానికి అడ్డం" అని పురాణం విప్పుతుంది😁🤓...మనం అవన్నీ నమ్మం కాబట్టి లైట్ తీసుకుంటాం. KVS PRT పరీక్ష 'key' చూసుకుంటే...ఆశలు పెట్టుకునే లా మార్కులు వచ్చాయి. ఈ లోపు నా పని చూసుకుంటూ ఇంటర్వ్యూ కి తయారయ్యే దాన్ని. చిన్నా తో గోల్కొండ వెళ్ళటం మర్చిపోలేని అనుభూతి 😊 మేమిద్దరమే ఉంటే ఇంకెవరూ అక్కర్లేదు👭 ఇక..నెలాఖరున ఇంటర్వ్యూ selected list వచ్చింది. అందులో నా పేరు చూసుకుని ఎగిరి గంతేశా. ఇక ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ముమ్మరం చేశాను. ఒక్క నెల మాత్రమే టైముంది మరి. మధ్యలో ఈ NOC గోల ఒకటి..అప్పటికే ఉద్యోగంలో ఉండటంతో...ఆ తర్వాత మళ్లీ PRT పోస్టులను నోటిఫికేషన్ లో ఇచ్చినట్టు కాక 5300 నుండి 3000 కి తగ్గించేయటం తో ఒక్కసారిగా నిరాశలో కి వెళ్ళిపోయాను. పోటీ ఇప్పుడు ఇంకా పెరిగింది గా మరి. గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇంటర్వ్యూ కోసం ఏ ఢిల్లీ కో వెళ్ళాలేమో అని డబ్బులు పోగేసుకున్నా...కానీ ఎంచక్కా హైదరాబాదే వచ్చింది పెద్ద కష్టం లేకుండా..😋

ఫిబ్రవరి: ఈ నెల మొత్తం ఇంటర్వ్యూ..ఇంటర్వ్యూ..ఇంటర్వ్యూ...ఒక మూడు రోజులు సెలవులు పెట్టీ ఇంట్లో ప్రిపేరయ్యా. అక్కడ సరిగ్గా సాగటం లేదని. ఇక ఇంటర్వ్యూ రోజు..బాగుంది అని చెప్పలేను..బాగోలేదు అని కూడా చెప్పలేను🤷 ఎంతైనా మొదటి ఇంటర్వ్యూ కదా..60 కి ఒక 40 మార్కులు వస్తే చాలు అనుకున్నా..చివరికి అలాగే వచ్చాయి లే..😉 అది వేరే విషయం.

మార్చి: హ్మ్...పెద్ద విషయం ఏంటంటే ctet కి ఎలా తయారవ్వాలి అని ఒక వీడియో తెలుగులో చేసి YouTube లో పెట్టాను. 2500+ వీక్షణలు వచ్చాయి ఇప్పటిదాకా😇..మా ఆఫీసు లో నిర్వహించే సాంస్కృతిక అవగాహనా కార్యక్రమంలో భాగంగా వరంగల్ కోటను సందర్శించే భాగ్యం దక్కింది. ఆ kvs ఫలితాలు గురించి ఈ రోజు కాదు రేపు..రేపు కాదు ఎల్లుండి అని డ్రామా సాగింది. నాకేమో టెన్షన్ ఒక వైపు..ఎప్పుడు వస్తాయా అని. ఎంతకీ విడుదల చేయకపోవడం తో పట్టించుకోవటం మానేశా. (ఆశ నిరాశ పాఠం లోలా)

ఏప్రిల్: 2018 సెప్టెంబరు తర్వాత ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ పెట్టాను చంద్రముఖి మీద. రెండు కామెంట్లు వచ్చేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది💃

మే: చాలా భయపెట్టిన సంఘటన..నా ఫోన్ మొత్తం లాక్ పడిపోయింది📴 ఏం టచ్ అయిందో తెలీదు కానీ..ఎంత ప్రయత్నించినా వల్ల కాలేదు. కొన్నాళ్ళు టాబ్ నే ఫోనుగా వాడుకోవలసి వచ్చింది. ఇంకా చిన్నాకి NIT AP లో లాబ్ టెక్నీషియన్ గా పోస్ట్ రావడం మా కుటుంబం లో ఆనందాన్ని నింపింది. మధ్య మధ్య నా result ఎప్పుడు వస్తుంది దేవుడా అని ఆలోచనలు..ఎలక్షన్ కోడ్ అదీ ఇదీ అని కారణాలు చెప్పారు..సర్లే ఇక వాళ్ళు result ఇచ్చినట్టే అనుకున్నా. క్యాలెండర్ లో పేజీలు అయితే మారుతున్నాయి కానీ నా జీవితం ఏం మారట్లేదు అనే నిరాశలో బతికేదాన్ని అప్పట్లో..😒

జూన్: ఉష్…! సైలెన్స్...పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు మరి😛

జూలై: ఎదురుచూపు కి తెరపడింది. మా KVS పరీక్ష ఫలితాలు ఇచ్చేశారు. నాకు PRT జాబ్ వచ్చేసిందోచ్. 🤩🤗 ఇప్పుడు ఇంకో సమస్య ..రాజీనామా ఎప్పుడు చేయాలి అని ..ఎందుకంటే పోస్టింగులు ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇంకా.. resignation ఢిల్లీ లో ఆమోదం పొంది రావాలి అంటే కొంచెం టైం పడుతుంది..ఇలా అన్నమాట🤦

ఆగస్టు: కొత్త ఫోన్ LG W30 కొనటం నేను చేసిన ఒక తెలివైన పని. 🤪 9 వేలకే మంచి ఫోను వచ్చేసింది. 20 వ తారీఖున పోస్టింగ్ ఎక్కడ వచ్చిందీ తెలిసిపోయింది. Ernakulam, Bangalore, Hyderabad అన్నీ పోగా నా పేరు చెన్నై రీజన్ లో కనబడింది🧐. చాలా కంగారు పడ్డాను. నేనేంటి..చెన్నై ఏంటీ అని. కానీ తప్పదుగా. అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు నాకు తమిళనాడు వచ్చినందుకు కాదు కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరికీ ఆంధ్ర నే రావడం చాలా బాధ అనిపించింది😯 ప్చ్..ఇక ఇంకా 20 రోజులే టైము ఇవ్వడంతో ఆ జాబుకి రాజీనామా చేసేసా. హైదరాబాదు ని విడిచి వచ్చేసేటపుడు చివరిగా చార్మినార్ చూసాను..చాలా నచ్చింది😻

సెప్టెంబరు: ఇంకేముంటుంది….నా రాజీనామా పని మా మేడం వల్ల త్వరగా అవ్వడం, చెన్నై లో పడటం, కొత్త జాబ్, కొత్త మనుషులు, కొత్త ప్రదేశం..సర్దుబాటు సమస్యలు..వాటి మధ్య నేను.. అంతే ఇక💁👩‍🏫

అక్టోబరు: చెన్నైలో చేరాక మొదటి సారి దసరా కి ఇంటికొచ్చాను. ఇంట్లో వాళ్ళతో ఆ పది రోజులు సరదాగా గడిచిపోయాయి. సిటీ బస్సులతో..క్యాబ్ లతో అష్టకష్టాలు పడలేక శుభ్రంగా ఒక సైకిలు కొనేసుకున్నాను🚲 ఇప్పుడిక ప్రశాంతంగా ఉంది. 

నవంబరు: స్కూలు తరపున వర్క్ షాప్ లో పాల్గొనడానికి మైసూర్ వెళ్ళడం మర్చిపోలేను. ఆ ఊపిరి సలపని 3 రోజులు అస్సలు..మై గాడ్😵 మా స్టాఫ్ కొంతమంది తో మహాబలిపురం వెళ్ళడం మంచి అనుభవం. నేను చూసిన మొదటి ప్రపంచ వారసత్వ కట్టడం అదే అయింది. 

డిసెంబరు: ఆటం బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో పది రోజులు వింటర్ బ్రేక్. ఈ సారి మకాం వైజాగ్ లో వేశాం. చాలా బాగా అనిపించింది. 🤩🤩👌

మొత్తానికి ఇలా గడిచింది అన్నమాట...2019🤗😊13 కామెంట్‌లు:

 1. ఓహో బాగుంది... మీ ప్రయాణం

  రిప్లయితొలగించండి
 2. బాగుంది మోహన మీ ప్రయాణం , ఓకే విషయం లో నువ్వు నన్ను క్షమించాలి , ఎందుకు అంటే నీ అనుమతి లేకుండా నీ బ్లాగ్ చుడండి అని నా వద్దకు వచ్చే వారికీ నీ బ్లాగ్ పరిచయం చేస్తున్నాను , ఎందుకంటే నీ ఉద్యోగ ప్రయాణం పోస్ట్ లు చాలా ఇంస్పెర్ గ ఉన్నాయ్ , నా కూతురికి కూడా ఈ బ్లాగ్ చదవమని చెప్పను, నేను కూడా నా కూతురికి LG30 కొనిచ్చాను ఈ విషయం లో మన ఆలోచన ఒకే విధంగా ఉంది. నా బ్లాగ్ http://chaduvukundamrandi.blogspot.com/ ఒక్క సారి చూడు , నీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నా బ్లాగు నచ్చినందుకు చాలా సంతోషం అండి..🤗.. పది మందికి ఉపయోగపడుతుంది అంటే అంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుంది..మీ బ్లాగ్ చూసాను..బాగుంది..👍

   తొలగించండి
 3. సిటీ బస్సులతో..క్యాబ్ లతో అష్టకష్టాలు పడలేక శుభ్రంగా ఒక సైకిలు కొనేసుకున్నాను🚲 ఇప్పుడిక ప్రశాంతంగా ఉంది.

  Very nice...👌👌

  రిప్లయితొలగించండి
 4. మోహన గారూ, మీ ప్రయాణం స్పూర్తి దాయకంగా వుంది. మీ బ్లాగు ఇదివరలో చదివనట్లు గుర్తు. అందులో మీరు RGUKT లో చేరి చదువుతున్నారని వ్రాయగా చదివినట్లు లీలగా గుర్తు. మరి మీరు అందులో ఇంజనీరింగ్ చదవలేదా లేక ఇప్పుడు ఇంజనీరింగ్ కంటే ఉద్యోగమే ఉత్తమమనుకున్నారా? మీకు అభ్యంతరమైతే ఈ వ్యాఖ్య ప్రచురించనక్కరలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లేదండీ..అక్కడ ఇంటర్ పూర్తి చేశాక అక్కడి నుండి వచ్చేసి D.Ed చేశాను.. ఇంజనీరింగ్ అంటే ఆసక్తి లేక..

   తొలగించండి
 5. కారెక్కడం కంటే సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి మంచిది.

  జాల్రా
  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. అత్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు నాకు తమిళనాడు వచ్చినందుకు కాదు కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరికీ ఆంధ్ర నే రావడం చాలా బాధ అనిపించింది😯
  చాల బాగుంది..మా చెల్లి చదువుకుంటున్నా ఆపెసి మరీ..వినిపించా..😊😊

  రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...