29, ఏప్రిల్ 2013, సోమవారం

Exams

సోమవారం, ఏప్రిల్ 29, 2013 0 Comments
RGUKT లో  పరీక్షలు బయటి పరీక్షల వలె ఉండవు. 70%వరకూ Online test లే. మాకు ప్రతీ వారం శనివారం పరీక్షలు ఉంటాయి.ఒక్కో Subject అరగంట చొప్పున 5 పరీక్షలు జరుగుతాయి.10 మార్కులకి పరీక్ష ఉంటుంది.మొత్తం Online Exam.
మళ్ళీ నెలకొకసారి Monthly Test ఉంటుంది.అది 15మార్కులకి.  అందులో అయితే రాయడం కూడా ఉంటుంది.అది 5 మార్కులకి. మళ్ళీ 10మార్కులకి Objective. 3 నెలలు కలిపి ఒక Semester.3 Monthly Testలు. Semester చివర్లో End Semester పరీక్షలు జరుగుతాయి.అవి రోజుకొక్కటి ఉంటాయి.అవి 30 మార్కులకి Objective,30 మార్కులకి Discriptive.
సంవత్సరానికి 2 Semester లు.
అన్ని పరీక్షలకి Shuffle ఉంటుంది. మనకి ఏ Room allot అయ్యిందో ఆన్ లైన్ లోనే చూసుకోవాలి.ఆ Laptop ఓపెన్ చేసి మనకిచ్చిన IP Adress లోకి వెళ్ళి ఒక ZAR or ZIP ఫైల్ ని Download చేసుకోవాలి. దానిని Terminal  సహాయంతో Extract చేసాక మన ID Number,Exam password తో లాగిన్ అవ్వాలి.అప్పుడు పేపర్ ఓపెన్ అవుతుంది. ఆ Exam software రన్ అవుతున్నప్పుడు మరో Programme ఏదీ ఓపెన్ అవ్వదు.పేపర్ minimize కూడా అవ్వదు.అదంతే.మనం Options అన్నీ పెట్టేసి Submit చెయ్యాలి.అప్పుడు Desktop మీద ఒక TAR ఫైల్ వస్తుంది.దాన్ని File upload link కి అప్ లోడ్ చెయ్యాలి. ఇంక రాసే పరీక్ష అయితే అది మామూలుగానే జరుగుతుంది.అక్కడితో పరీక్ష అవుతుంది. అప్ లోడ్ చెయ్యకపోతే Absent పడుతుంది.
చివర్లో CGPA(Cumulative grade point average) కి Semester మొత్తం జరిగిన పరీక్ష లన్నీ లెక్క చేస్తారు.Practical exams కూడా.ఒక వేళ  Fail అయితే  Remedial Exams రాయాలి.

25, ఏప్రిల్ 2013, గురువారం

One day in RGUKT &Class

గురువారం, ఏప్రిల్ 25, 2013 4 Comments
ఉదయం 6గంటలకి నిద్ర లేస్తాను.అదే పరీక్షల సమయంలో ఐతే 4గంటలకి.స్నానాదికాలు పూర్తి చేసి,మేమందరం 7 గంటలకే మెస్ కి వెళ్తాం.సోమవారం ఇడ్లీ,మంగళవారం పులిహోర,బుధవారం గారె,గురువారం ఉప్మా,శుక్రవారం దోశె కానీ ఊతప్పం,శనివారం మళ్ళీ ఇడ్లీ,ఆదివారం చపాతి.అది మా Break fast menu.
7:30 కల్లా తరగతి కి వెళ్ళిపోతాం.ఎందుకంటే Internet ఒపెన్ చేసి e-papers చదవాలి.8 గంటలకి Assembly కి వెళ్తాం.8:30 నుండి 12:30 వరకూ గంట చొప్పున తరగతులు జరుగుతాయి.మాకందరికీ English class అంటే ఇష్టం. 12:30 నుండి 1:30 వరకూ భోజన విరామం.ఇష్టం లేని భోజనం అయితే కొంచెమే తింటా.అక్కడ చాలా ఆహారం వృధాగా పోతుంది.చూస్తే బాధేస్తుంది.1:30 నుండి 5గంటల వరకూ తరగతి లో కూర్చుని ఉదయం చెప్పిన పాఠాలను చూసుకుంటాము.లేకపోతే ఎవరో ఒక Mentorవచ్చి Class చెప్తారు.అదీ కాకపోతే net browsing చేస్తాం. 5గంటల నుండి 7గంటల వరకూ ఖాళీయే.అప్పుడు చదువుకోవడమో,బట్టలు ఉతుక్కోవడమో ఏదో ఒకటి చేస్తాము.మాకు Mobile phone allow కూడా ఉంది. Cantene ఆ సమయములో అస్సలు ఖాళీ ఊండదు.మళ్ళీ 7 గంటలకల్లా మెస్ కి వెళ్తాము.
8గంటల నుండి 10గంటల వరకూ Study hours.HRTలు తరగతి లో ఉంటారు.HRT అంటే Home Room Tutor.మా Laptopస్ కి ఏదైనా problemవస్తే బాగుచేస్తారు.
అంతే కాదు HRT లు మాకు కావాల్సిన Materials pdfల రూపంలో ఇస్తారు.10 గంటలకి Dormitoryకి వెళ్ళిపోతాం.నేనైతే వెంటనే Diary రాసి పడుకుంటా.నా స్నేహితులు మాత్రం అంత తొందరగా పడుకోరు.
.ఇవి మా తరగతి లోపలి చిత్రాలు.తరగతులు అత్యాధునికంగా ఉంటాయి.50 Revolving chairs, Desk లు,4 AC లు, 6 fans, 6 LED lights, 2 Projectors, 2 Projection screens, One Board etc....
Campus మొత్తం LAN అనుసంధానించబడి ఉంటుంది.అంతా Wired Network.Wire less లేదు. Local Net work అయితే Proxy అవసరం లేదు. Internet కోసం Proxy settings చెయ్యాలి. అక్కడ మా Laptops లో Mozilla Firefox Browser ఉంటుంది.Media players అయితే VLC, Banshee Media players &Movie Player ఉంటాయి.MS Office  బదులు Libre Office ఉంటుంది. మాకు Python language నేర్పుతారు. Typing Softwares  ద్వారా అది కూడా నేర్చుకోవాలి.Exams లో Typing అవసరం.Ubuntu చాలా వేగంగా పని చేస్తుంది.Windows కన్నా వేగంగా Run అవుతుంది.  వచ్చే post లో RGUKT లో జరిగే Examinations గురించి చెప్తా




19, ఏప్రిల్ 2013, శుక్రవారం

First Sunday

శుక్రవారం, ఏప్రిల్ 19, 2013 0 Comments

చాలా రోజుల తర్వాత బ్లాగు రాస్తున్నాను.నేను RGUKT లో చేరేక తర్వాతి వారం అమ్మ,నాన్న,చిన్నా(మా చెల్లి హరిత)వచ్చారు.చిన్నా పెదవేగి(ఏలూరు) నవోదయ లో పదవ తరగతి చదువుతుంది.అమ్మా వాళ్లు ముందు అక్కడికి వెళ్లి చిన్నా ని తీసుకుని నా దగ్గర కి వచ్చారు. వాళ్ళని చూడగానే నాకు ఏడుపు ఆగలేదు.ఎందుకో అలా ఏడ్చేశాను.వాళ్ళు రావడమే మధ్యాహ్నం వచ్చారు. ఆదివారం తల్లిదండ్రులకు కూడా భోజనం పెడతారు.ఫ్లేటు 30/-. చిన్నా మాత్రం నాతో పాటే మా మెస్స్ లో తినేసింది. PUC అమ్మాయిలకు 3 భోజనశాలలు ఉన్నాయి.వాటి పేర్లు Windows,Linux ,Mac Operating Systems కదూ. ఆదివారం తల్లిదండ్రుల కోసం ఒక మెస్స్ ను కేటాయిస్తారు. అందులో కూర్చుని మాట్లాడుకున్నాం. నాకు అప్పటి వరకూ నాకు Mobile Phone లేదు. చాలా మంది తెచ్చుకున్నారు.కానీ నాకు తెలియక తెచ్చుకోలేదు. ఆ రోజు డాడీ తెచ్చారు. దాన్ని కొన్ని నెలల ముందు కొన్నారు. ఇంట్లోకని. కానీ నాకు దక్కింది.అది Intex 2020 QT Memory Card కూడా ఉంది. పాటలు కూడా ఉన్నాయి.నాకు పాటలు వినడం చాలా ఇష్టం.సాయంత్రం 4 గంటలకు వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్నా ని డాడీ తీసుకెళ్ళారు. అమ్మ ఏమో ఇంటికి వెళ్ళి పోయింది.
అంతకు ముందు రోజు మాకు సినిమా వేశారు,అది "దూకుడు" సినిమా.ఎక్కడో తెలుశా మా తరగతి లోనే. Projectors ఉన్నాయి కదా.అందులో. మాది Kappa-1 కదా. మా Room లో అమ్మాయిలని, Kappa2 లో అబ్బాయిలని కూర్చోబెట్టారు. అలా చూడడం చాలా బాగుంది. ప్రతీ శనివారం సినిమా వేస్తానన్నరు. కానీ పరీక్షల సమయములో వెయ్యరట.అక్కడితో ఒక వారం పూర్తయ్యింది.

8, ఏప్రిల్ 2013, సోమవారం

Laptops

సోమవారం, ఏప్రిల్ 08, 2013 0 Comments
Acer Travelmate P243(front view)
Back view
ఒక రోజు మధ్యాహ్నం మమ్మల్ని పిలిచి వరుసలో నిల్చోమన్నారు.Laptops ID నంబరు వారీగా ఇచ్చారు.ముందు నేనేగా.పైన చిత్రం లొ కనిపిస్తున్నవి మాకిచ్చిన Laptops.మావి Acer P243 series .RGUKT లో విద్యార్ధులందరికీ ఆపరేటింగ్ సిస్టం Linux కి సంబంధించి ఉంటాయి.First Batch కి Windows 7 ఇచ్చారు.మా బ్యాచ్ కి Ubuntu 11.10.కానీ మా ముందు batch కి Fedora Operating System ఇచ్చారు.
ఇదీ మాకిచ్చిన Ubuntu Desktop.
Ubuntu in Tablet also

తరగతులు

సోమవారం, ఏప్రిల్ 08, 2013 0 Comments


రెండవ రోజున తరగతులకెళ్లాము.టైంటేబుల్ చెప్పారు.వరుసగా నాలుగు తరగతులు జరుగుతాయి.గణితం,భౌతికశాస్త్రం,రసాయనశాస్త్రం,ఆంగ్లం.తెలుగు వారానికొకసారి సోమవారం జరుగుతుంది.జీవశాస్త్రాన్ని ఐచ్చికాంశంగా వేసవి శెలవుల్లో పెడతారట. అక్కడి లెక్చరర్స్ ని మెంటార్స్ అని పిలుస్తారు. మ్యాథ్స్ కి మీనాక్షి ,ఫిజిక్స్ కి స్వప్న కెమిస్ట్రీ కి వెంకట రావు ,ఇంగ్లీషు కి శ్రీనివాసరావ్,తెలుగుకి హరిబాబు.
ఆ రోజు అందరూ మా పరిచయాలు అడిగారు.ప్రతీ ఒక్కరికీ మా గురించి చెప్పాం.ఫిజిక్స్ మాడం అయితే పాఠాలు మొదలు పెట్టేసింది.పిల్లలందరూ ఆవిడ అడిగిన వాటికి సమాధానాలు చెప్పేస్తున్నారు.నాకేమో ఏమీ అర్ధం కావట్లేదు.వాళ్ళందరూ ఇక్కడ చేరక ముందు కార్పొరేట్ కళాశాలల్లో చదువుకున్నారు.అందుకే అన్నీ చెప్పేస్తున్నారు.
మధ్యాహ్నం తరగతులు జరగవు.అప్పటి విధానం ప్రకారం (అక్కడి పాఠాలను Modules అంటారు) ఉదయం జరిగిన moduleకి మధ్యాహ్నం పరీక్ష రాయాలి. అన్ని సబ్జెక్టులకీ. కానీ ఇప్పుడు ఆ పధ్ధతి లేదు.ఇప్పుదు ఏంటంటే వారాంతపు పరీక్షలన్నమాట.అప్పటికి మాకు Laptops ఇవ్వలేదు.NCERT పుస్తకాలు ఇచ్చారు. మా Syllabus వేరుగా ఉంటుంది.NCERT కాదు,తెలుగు అకాడెమీ కూడా కాదు.రెండూ కలిపి ఉంటుంది.కాకపోతే NCERT కి దగ్గరగా ఉంటుంది.మా తరగతి లో అబ్బాయిలు చాలా చురుకుగా ఉంటారు. వాళ్ళళ్ళో నలుగురికి పదవ తరగతిలో 10GPA వచ్చింది.

Hostel

సోమవారం, ఏప్రిల్ 08, 2013 0 Comments
హాస్టల్ లో చేరే రోజున అమ్మా,నాన్నా, నేను ముగ్గురం వెళ్ళాము.పాలకొల్లు నుండి ఏలూరు వెళ్ళి,అక్కడినుండి నూజివీడు కు బస్సు దొరికితే సరే. లేకపోతే హనుమాన్ జంక్షన్ వెళ్ళి, అక్కడ నూజివీడు బస్సు ఎక్కాలి.అక్కడితో ప్రయాణం అయిపోలేదు.మళ్ళీ అక్కడ మైలవరం వెళ్ళే బస్సు ఎక్కి IIIT  దగ్గర దిగాలి.మేము ఉదయమే బయలుదేరాము.అక్కడికి వెళ్ళే సరికీ 10AM అయింది.అందరి దగ్గర సంతకాలు తీసుకుని గదికి పంపేశారు.నేను ఇంక అమ్మానాన్న తో మాట్లాడలేదు.వాళ్ళు వెళ్ళిపోయారు.గదిలో కూర్చుని యేడ్చాను. అప్పటికీ ఒకమ్మాయి ఉంది లోపల.తనది శ్రీకాకుళం అంట.మాట్లాడుకున్నాం.నేనొక మంచం తీసుకుని దుప్పటి వేశాను.బీరువాలో నా బట్టలు అవీ సర్దాను. చాలా మంది వచ్చారు.24మంది కదా.కొంతమంది పరిచయమయ్యారు.మణిమాల(తూ.గో),రమ్య(ప.గో),తబిత(తూ.గో),సరిత(తూగో),సంధ్య(శ్రీకాకుళం),సునీత(ప్రకాశం).కానీ నాకు చాలా భయం వేసేది.అందరూ ఎలా ఉంటారోఅని ఎందుకంటే హాస్టల్ లూ ఉండడం మొదటిసారికదా.మధ్యాహ్నం భోజనం చేయలేదు.వచ్చిన రోజే అందరూ బట్టలు ఉతికేశారు.ఎందుకో నాకర్ద్ధo కాలేదు.  రేపట్నుంచే తరగతులు మొదలు అని వార్డెన్ చెప్పింది.ఆరోజు అలా గడిచింది.

7, ఏప్రిల్ 2013, ఆదివారం

Classes

ఆదివారం, ఏప్రిల్ 07, 2013 0 Comments




మొదటి సంఖ్య కదా అందుకు మొదటి 24 మందిని ఒక గది లో ఉంచుతారు.వసతి గృహమేమో Rho 1, తరగతి గది Kappa 1.తరగతి గదిలో 48 మంది ఉంటారు.వసతి గృహమును మేము డాం అని పిలుస్తాము.డాం లో 24 మంచాలు, 6 ఫ్యాన్స్, 12 బీరువాలు ఉంటాయి. ఒక్కొక్క బీరువా ఇద్దరు చొప్పున వాడుకోవాలి. ఒక బ్లాక్ లో 12 గదులు ఉంటాయి. PUC అమ్మాయిలకి 3 ఉన్నాయి.అవి Rho, Sigma, Theta.తరగతులు కూడా అంతే. 4 బ్లాక్స్ . అవి Kappa, Omega, Lamda, Mu.

1st post

ఆదివారం, ఏప్రిల్ 07, 2013 0 Comments
ముందుగా నా బ్లాగ్ ను చదువుతున్న మీకు నమస్కారం. నాకు జీవశాస్త్రం,వృక్షశాస్త్రం అంటే ఇష్టం.IIIT లో కూడా జీవశాస్త్రం బోధిస్తారని తెలిసి అందులో చేరిపోయాను.అంటే MBiPC అని. IIIT లో సీటు వచ్చిందని తెలీగానే మంచి అవకాశం వచ్చిందని ఆనందపడాలో,లేక ఇల్లు వదలాలని బాధపడాలో తెలియలేదు. నూజివీడు అంటే మాకు 5 గంటలు ప్రయాణం. ముందు కౌన్సిలింగ్ కి నాన్న తీసుకువెళ్ళారు. ప్రవేశ ద్వారం చూడగానే చాలా బావుందనిపించింది.లోపలికెళ్ళాక ఒక వరుసలో పిల్లలందరినీ నిల్చోమన్నారు.నాన్న ఏమో ముందు నిల్చోమని, నాకేమో భయం.ముందు ఒకమ్మాయి తర్వాత రెండవ స్థానం లో నిల్చున్నాను.కానీ ఆ అమ్మాయి వివరాలు,పత్రాలు ఇవ్వడం లో తనకి ఆలస్యం అయింది. దాంతో మొదట కౌన్సిలింగ్ అయిన వ్యక్తిని నేనే.అంతే కాదు ఈ సంవత్సరం చేరిన విద్యార్ధులందరిలో నాదే మొదటి ID సంఖ్య  N120001. జూలై లో కౌన్సిలింగ్ అయింది.ఆగష్టు 1 నుండి తరగతులు ప్రారంభమవుతాయట. అప్పుడే మొత్తం పెట్టే బేడా సర్దుకుని వచ్చేయాలంట.మా దగ్గర 3వేలు తప్ప ఇంకేమీ కట్టించుకోలేదు. ఆ రోజు కళాశాల చూద్దామనుకున్నాం,కానీ బస్సులు త్వరగా దొరకవని వెంటనే బయల్దేరిపోయాం. ముందుగా కౌన్సిలింగ్ మాకయిందికదా.
ముందు ముందు నా బ్లాగు పోస్టులను చదివి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ.................మోహన.