26, జూన్ 2014, గురువారం

పిల్లి....పిల్లి

గురువారం, జూన్ 26, 2014 1 Comments

ఇది రోజూ మా ఇంటికి వచ్చేది.మేము మజ్జిగన్నం పెట్టేవాళ్ళం.తినేసి వెళ్ళిపోయేది.సమయానికి వచ్చేసేది.ఇప్పుడు అది ఏమయిపోయిందో కనిపించట్లేదు.చూడండి!ఎన్ని స్టిల్స్ ఇచ్చిందో!దాని స్థానంలో ఒక నల్ల పిల్లి వస్తుంది.
పిల్లులు భలే అరుస్తాయి కదా!నాకైతే అలానే వినాలనిపిస్తుంది.


ఓ!నిద్రొస్తుంది..

జో..జో..జో


ఇప్పుడే లేచా!



నా మూతి బావుందా?





అదిగో! ఏదో అలికిడి



25, జూన్ 2014, బుధవారం

22, జూన్ 2014, ఆదివారం

కార్టూన్స్

ఆదివారం, జూన్ 22, 2014 0 Comments

ఒక విషయం మామూలుగా చెప్పేకంటే బొమ్మల ద్వారా చెబితే ఎలాంటివారికైనా ఇట్టే అర్థమవుతుంది.కార్టూన్స్ కూడా అలాంటివే.చిన్న చిన్న బొమ్మలతో హాస్యాన్ని పండించవచ్చు,అలాగే చెప్పదలచుకున్న విషయాన్ని కూడా చెప్పవచ్చు.ఇంతవరకు ఫర్వాలేదు కానీ కొన్ని కార్టూన్లు మన సంస్కృతిని కించపర్చేలా ఉంటాయి.ఉగాదిపచ్చడిపైనా,భార్యలపై వేసే జోక్స్ కొంచెం వికారాన్ని కలిగిస్తాయి.
నాకు బాగా నచ్చేవి సరసి మరియు శ్రీధర్ గారి కార్టూన్స్.వాటిని చూడగానే మన బాధని మర్చిపోయి చిరునవ్వు మన ముఖం మీదకు చేరుతుంది.
శ్రీధర్ గారి కార్టూన్స్ లో కొన్ని.(ఈనాడు లోనివి)








17, జూన్ 2014, మంగళవారం

ఫోటో గ్రిడ్ ఆప్

మంగళవారం, జూన్ 17, 2014 1 Comments


ఛాయాచిత్రాల కొల్లేజ్ లు చెయ్యడానికి అనువైన మరియు అందమైన ఆండ్రాయిడ్ ఆప్.
ఇందులో కొల్లేజ్ లే కాకుండా ఫొటో ఎడిటింగ్,చిత్రాలతో ఒక వీడియో తయారు చెయ్యటం,చిత్రాలన్నిటినీ ఒక వరుసలో కాకుండా చెల్లాచెదురుగా పేర్చి ఒక చిత్రాన్ని తయారు చెయ్యొచ్చు.
ఈ ఆప్ చాలా చాలా బాగుంది.మీరూ ప్రయత్నించండి.
ఫోటో గ్రిడ్ దిగుమతికై ఇక్కడ నొక్కండి-Photogrid Collage makerఅలాంటిదే ఇంకొకటి- Pics Art