2, ఆగస్టు 2015, ఆదివారం

పొట్టిక్కలూ..అప్పనపల్లి..!!

ఈ రోజు మా కుటుంబ సమేతంగా అయినవిల్లి మరియు అప్పనపల్లి వెళ్ళాము..దారిలో చించినాడ గోదావరి రేవు దగ్గర ఆగి..గోదావరి అందాలను మా కేమేరాలో బంధించి తర్వాత..డొక్కా సీతమ్మ ఆక్విడక్టు ను కూడా చూసి...దారిలో అంబాజీపేట హోటల్లో "పొట్టిక్కలు"ను రుచి చూశాం...అవి చాలా బాగున్నాయి...తర్వాత అయినవిల్లి శ్రీ వరసిద్ధివినాయక స్వామిని దర్శనం చేసుకున్నాం..అక్కడే భోజనం చేసి అక్కడ్నించి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామిని దర్శనం చేసుకున్నాం..





చించినాడ వంతెన కింద ప్రభాత గోదావరి


డొక్కా సీతమ్మ ఆక్విడక్టు


వేడి వేడి పొట్టిక్కలు తయారు..!!


దారిలో...ఒక సారి గైల్ ఇండియా గ్యాస్ లీక్ ప్రమాదం జరిగింది కదా..ఆ ఊరి పేరు "నగరం"...అక్కడ ఇవి రహదారి పక్కన అమ్ముతుంటే కొన్నా...అంతకుముందు కూడా కొన్నిసార్లు తిన్నాం..చాలా బావుంటాయి...వీటి పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి..!!


వీటి పేరే తెలియనిది..??


6 కామెంట్‌లు:

  1. // "వీటి పేరే తెలియనిది..??" //

    ఈ కోనసీమ స్వీటుని "గరాజీలు" లేదా "పిచ్చుకగూళ్ళు" అంటారట. ఈ క్రింది లింక్ చూడండి.

    గరాజీలు (కోనసీమ స్వీట్)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిచ్చుక గూళ్ళు అని తెలుసు కాని గరాజీలు అని ఇపుడే తెల్సుకున్నా...ధన్యవాదాలు..

      తొలగించండి
  2. మా బంధువులు మాకు తెచ్చి ఇస్తే పాతబస్తీలో అమ్మే సేమియాలాంటివే అనుకున్నా.వీటి పేరు ఇపుడే తెలిసింది.చాలా రోజులు నిలవ ఉన్నాయి.భలే క్రిస్పీ గా ఉండి టేస్టీగా ఉన్నాయి.ఈ వీడియో చూపిస్తే మావారు తినడం మానేస్తారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ..భలే కరకరలాడతాయి..థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్!!

      తొలగించండి
  3. చక్కటి తెలుగు పదజాలంతో వివరించారు

    రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...