7, ఏప్రిల్ 2013, ఆదివారం

1st post

ముందుగా నా బ్లాగ్ ను చదువుతున్న మీకు నమస్కారం. నాకు జీవశాస్త్రం,వృక్షశాస్త్రం అంటే ఇష్టం.IIIT లో కూడా జీవశాస్త్రం బోధిస్తారని తెలిసి అందులో చేరిపోయాను.అంటే MBiPC అని. IIIT లో సీటు వచ్చిందని తెలీగానే మంచి అవకాశం వచ్చిందని ఆనందపడాలో,లేక ఇల్లు వదలాలని బాధపడాలో తెలియలేదు. నూజివీడు అంటే మాకు 5 గంటలు ప్రయాణం. ముందు కౌన్సిలింగ్ కి నాన్న తీసుకువెళ్ళారు. ప్రవేశ ద్వారం చూడగానే చాలా బావుందనిపించింది.లోపలికెళ్ళాక ఒక వరుసలో పిల్లలందరినీ నిల్చోమన్నారు.నాన్న ఏమో ముందు నిల్చోమని, నాకేమో భయం.ముందు ఒకమ్మాయి తర్వాత రెండవ స్థానం లో నిల్చున్నాను.కానీ ఆ అమ్మాయి వివరాలు,పత్రాలు ఇవ్వడం లో తనకి ఆలస్యం అయింది. దాంతో మొదట కౌన్సిలింగ్ అయిన వ్యక్తిని నేనే.అంతే కాదు ఈ సంవత్సరం చేరిన విద్యార్ధులందరిలో నాదే మొదటి ID సంఖ్య  N120001. జూలై లో కౌన్సిలింగ్ అయింది.ఆగష్టు 1 నుండి తరగతులు ప్రారంభమవుతాయట. అప్పుడే మొత్తం పెట్టే బేడా సర్దుకుని వచ్చేయాలంట.మా దగ్గర 3వేలు తప్ప ఇంకేమీ కట్టించుకోలేదు. ఆ రోజు కళాశాల చూద్దామనుకున్నాం,కానీ బస్సులు త్వరగా దొరకవని వెంటనే బయల్దేరిపోయాం. ముందుగా కౌన్సిలింగ్ మాకయిందికదా.
ముందు ముందు నా బ్లాగు పోస్టులను చదివి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ.................మోహన.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...