22, ఆగస్టు 2019, గురువారం

I got my dream job!!

గురువారం, ఆగస్టు 22, 2019 2 Comments

    I am glad to say you all that I got the job of my dreams. Kendriya Vidayalaya Sanghathan announced final result of Teaching recruitment recently and selected as Primary Teacher (PRT) in one of the Kendriya Vidyalayas situated in Chennai...I will continue my posts in the series of నా ఉద్యోగ ప్రయాణం...Keep in touch with my blog...


10, ఆగస్టు 2019, శనివారం

నా ఉద్యోగ ప్రయాణం - 4 (కొన్ని సంగతులు)

శనివారం, ఆగస్టు 10, 2019 4 Comments
ముందు మూడు భాగాల్లోను అక్కడక్కడా ప్రస్తావించడం మరచిపోయిన విషయాలను ఈ టపాలో చెప్పాలనుకుంటున్నాను. అప్పటికి ఇవి అప్రాధాన్య సంగతులే...కానీ ఇప్పుడు ఇవే చాలా ముఖ్యం😁

2017 సంవత్సరం చివర్లో కేంద్రీయ విద్యాలయ సంఘఠన్ సుమారు 500 Lower division clerk పోస్టులకు ప్రకటన ఇచ్చింది. దీనికి ఇంటర్మీడియట్ అర్హత కావడంతో మా చెల్లీ, నేను ఇద్దరూ అప్లై చేశాం. దాని తాలూకు పరీక్ష 2018 ఫిబ్రవరి లో జరిగింది. మా ఇద్దరికీ పరీక్షా కేంద్రం విజయవాడలో ఒకటే వచ్చింది. కానీ తేదీలు వేరు. నాకేమో ఫిబ్రవరి 19 అయితే దానికి 20😢...అలా డాడీ పాపం రెండు సార్లు వెంటవెంటనే విజయవాడ తిరగాల్సి వచ్చింది.

తర్వాత మళ్లీ అదే ఫిబ్రవరి 23 న APTET పరీక్ష జరిగింది. నాకు శశి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లి గూడెం వచ్చింది. పరీక్ష బాగా అయినట్టు నాకు అనిపించలేదు. మొత్తం ప్రశ్నలన్నీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ లోనుండే ఇచ్చారు. మరీ అంతలా పేపరు ఉంటుందని అస్సలు అనుకోలేదు. చాలా నిరాశ పడ్డాను. మన ప్రభుత్వం మీద నమ్మకం లేక TET మీద ఆశలు వదులుకున్నాను. టెట్ ఫలితాలు 2018 మార్చిలో వచ్చాయి. నాకేమో 129/150 మార్కులు వచ్చాయి. సంతృప్తి గా అనిపించలేదు. 130+ నా టార్గెట్ మరి😒..


ఇక ఆ KVS LDC పరీక్ష ఫలితాలు మూడు నెలల తర్వాత మే నెలలో విడుదల అయ్యాయి. మార్కులు ఇవ్వకుండా తర్వాతి టైపింగ్ టెస్ట్ కి ఎంపికైన వారి పేర్లు లిస్ట్ మాత్రమే web site లో పెట్టారు. అందులో నా పేరు ఉంది.😍😍..కానీ ఆ టెస్ట్ ఎప్పుడు జరిగేదీ తేదీ అదేమీ ఇవ్వలేదు..ఢిల్లీ లో మాత్రం జరుగుతుంది అని తెలిసింది. దానికి మానసికంగా తయారవుతూ రోజూ laptop ముందేసుకుని టైపింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. దానికోసం lappy తో పాటు ఒక హిందూ పేపరు ఇంకా స్టాప్ వాచ్ పెట్టుకునే దాన్ని. MS Word లో ఒక నిముషంలో ఎన్ని పదాలు వచ్చేవో చూసుకుంటూ టైపింగ్ చేసేదాన్ని. మొదట్లో 30 కన్నా ఎక్కువ వచ్చేది కాదు. అలా అలా చేస్తుంటే 35 దాటగలిగాను.

2018 ఆగస్టులో నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న CTET నోటిఫికేషన్ CBSE ప్రకటించింది. దానికి పుస్తకాలు ముందే కొని పెట్టుకున్నా అని చెప్పాను కదా!! అప్పుడప్పుడు వాటి దుమ్ము దులిపే దాన్ని. CTET పరీక్ష తేదీ ముందే తెల్సు..డిసెంబరులో అని. అందుకే ఎక్కువ చదివేదాన్ని కాదు...చాలా సమయం ఉందని నిర్లక్ష్యం😝


వెంటనే ఆ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినాన ఓ చల్లని కబురు తెల్సింది. మళ్లీ KVS advertisement 14 పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అందులో రకరకాల పోస్టులు మొత్తం 8000 ఉంటే కేవలం Primary Teacher (PRT) పోస్టులు 5300 ఉన్నాయి. నేను అప్లై చేసుకోదగింది PRT మాత్రమే. కానీ ఆనంద పడేలోగా ఇంకోటి తెల్సింది. దానికి అంతకు ముందే CTET అర్హత కలిగి ఉండాలట. కానీ నాకేమో లేదాయే. లేదు అంటే నా D.Ed అయ్యాక అసలు ఆ పరీక్షే పెట్టలేదు. కొత్తగా వ్రాస్తున్న. అలాంటపుడు ఇంకెలా ఉంటుంది. 😫😫..చాలా బాధేసింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు CTET తయారైంది. కానీ కొన్ని రోజులకు KVS నా ఘోష విన్నదో ఏమో కానీ...CTET 2018 వ్రాయబోతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది. దానికోసం CTET రిజిస్ట్రేషన్ సంఖ్య ఇస్తే చాలు...😇😇.. ఇంక దేనికి ఆలస్యం అని..దానికి కూడా అప్లై చేసేసా. ఓకే దెబ్బకి రెండు పిట్టలు..🐤🐤..ఆ రెండు పరీక్షలకు అటుఇటుగా సిలబస్ ఒకలానే ఉంటుంది. కాకపోతే PRT పరిధి ఎక్కువ. CTET కేవలం అర్హత కోసమే కాబట్టి అది కొంచెం సులువే.


రెండిటికీ అప్లై చేయడం అయితే చేశాను కానీ...చదివింది అంతంత మాత్రమే...😔వీలైనపుడు YouTube videos చూస్తూ notes రాసుకునే దాన్ని. అంతే….తర్వాత కథంతా హైదరాబాదు లోనే..అంటే జాబ్ లో చేరాక….

(సశేషం)

5, ఆగస్టు 2019, సోమవారం

భీమవరం - మర మెట్లు

సోమవారం, ఆగస్టు 05, 2019 0 Comments
ఎప్పుడో రెండేళ్ల కిందటి మాట. ఒక ఆదివారం ఖాళీ గా ఉన్నామని భీమవరం వెళ్దామని నిర్ణయించుకున్నాం. డాడీ డిగ్రీ క్లాస్ మేట్ ఒకావిడ ఎప్పటి నుండో వాళ్ళింటికి రమ్మని అంటుందట. అలా వాళ్ళింటికి వెళ్లి రిలయన్స్ కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. మా పాలకొల్లుకి, భీమవరానికి దూరం 20 Kms యే కావడం వల్ల ఈ ఊళ్ళ మధ్య రాకపోకలు చాలా ఎక్కువ. ఏ పెద్ద వస్తువు కొనుక్కోవాలి అన్నా మా వాళ్ళందరూ భీమవరం వైపే చూస్తారు.

ఆ ఉదయం 9:30 కల్లా తయారై పోయి మేం నలుగురం బస్సు కోసం బస్టాప్ కి వచ్చేశాం. అదేంటో గానీ ఉత్తపుడు ప్రతీ పావుగంట కీ ఉండే బస్సు ఆ రోజు అరగంట నిలబడితే గానీ దొరకలేదు. బస్సులో భీమవరానికి అరగంట నుండి ముప్పావు గంట సమయం పడుతుంది.🚌 అలా భీమవరం లో బస్సు దిగి, నడుచుకుంటూ వాళ్ళింటికి వెళ్ళాం. ఆవిడ మమ్మల్ని చూసి చాలా ఆనంద పడింది. వాళ్ళిల్లు చాలా బాగుంది. పెద్ద పెద్ద సీతాఫలాలు నలుగురికీ నాలుగు పెట్టింది. ఎంత రుచిగా , ఉన్నాయంటే😋😋..నా వరకూ సీతాఫలాలు తినడం అంటే అదృష్టం అనే అనుకుంటాను..ఆవిడకి నేనూ మా చెల్లీ తెగ నచ్చేసినట్టున్నాం. "మీ పిల్లలు మంచి హైటున్నారు బుజ్జీ" అని ఎన్ని సార్లు అన్నదో...😊..ఎప్పుడూ మా చుట్టాల నుండి "మీ పిల్లలు ఎంత పొడుగో!!..వెతకడం కష్టమే!!" ..ఇలాంటి పిచ్చి డైలాగులు 😬😠వినీ వినీ విసిగిపోయిన మాకు ఆవిడ పాజిటివ్ గా అన్న మాటలు మా చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించాయి. సంతోషంగా ఆవిడ దగ్గర సెలవు తీసుకుని హోటల్ కెళ్ళి భోజనం చేశాం.

Google image

అసలు ప్లాన్ ప్రకారం తర్వాత వెళ్ళాల్సింది బస్టాండ్ దగ్గరున్న రిలయన్స్ సూపర్ కి. కానీ ఎప్పుడూ గీతా మల్టీప్లెక్స్ చూడలేదని ముందు అక్కడికి వెళ్ళాం. ఆ బిల్డింగ్ పేరు కోస్టల్ సిటీ సెంటర్. ఎక్కడ చూసినా జనమే..ఆదివారం ఎఫెక్టు. అందులోనే రిలయన్స్ ట్రెండ్స్ ఇంకా డిజిటల్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. పైనేమో మల్టీ ప్లెక్స్. మూడు థియేటర్లు ఉన్నాయి. ఇలాంటి ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళడం నాకదే మొదటి సారి.

అప్పటికే చాలా మంది చెప్పగా విన్నాను. మాకు దగ్గర్లో ఉన్న ఎస్కలేటర్ ఆ మల్టీ ప్లెక్స్ లోనే అని. దాని దర్శన భాగ్యం ఇప్పుడు కలిగింది నాకు. చూసి ఊరుకోకుండా దాన్ని ఎక్కాలనిపించింది. కానీ ఒక పక్క భయం నన్ను వెనక్కి లాగుతుంది. చివరికి ఎక్కుదాం అని నేను చెల్లి అనుకుని పాములా కదులుతున్న దాని మొదటి మెట్టు మీద కాలు పెట్టాను...😦😧అమ్మ బాబోయ్...ఎవరో కిందకి తోసినట్టు అనిపించి వెంటనే పడిపోబోయాను. కింద ఉన్న అమ్మ పట్టుకుంది కాబట్టి సరిపోయింది. నాకైతే ఎంత సిగ్గేసిందో😷😖..ఒక్క క్షణం అందరూ నన్నే చూసారా ఏంటి అని అనిపించింది. పక్కల ఉండే రెయిలింగు పెట్టుకుందాం అంటే అది కూడా మెట్లతో పాటే పైకి పోతోంది😝.. మా చెల్లి, డాడీ మాత్రం ఇంతలో పైకెళ్ళిపోయారు. అదేమో నన్ను చూసి కోతిలా పళ్లు ఇకిలిస్తోంది. మా అమ్మకి కూడా భయం వేయడంతో కిందనే ఉండిపోయింది. ఇంక చేసేదేమీ లేక అమ్మా, నేను పక్కనే ఉన్న మామూలు మెట్లు ఎక్కేసి పైకెళ్ళాం. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారని ముందుగానే కనిపెట్టారేమో కట్టినవాళ్లు 😆..అక్కడితో ఆ కథ ముగిసినా ఎస్కలేటర్ అంటే భయం మాత్రం పోలేదు.

ఆ మాల్ అంతా ఒకసారి విండో షాపింగ్ చేసేసి తర్వాత రిలయన్స్ సూపర్ కి వెళ్ళాం. ఎప్పుడో ఒకసారి తప్పితే భీమవరం వెళ్ళినప్పుడు రిలయన్స్ ని దర్శించకుండా అస్సలు తిరిగి రాను. అది కూడా ఏమి కొన్నా కొనకపోయినా noodles family pack🍜 మాత్రం కొనుక్కుంటా. అంతిష్టం నాకు noodles అన్నా రిలయన్స్ అన్నా..Top Ramen, రిలయన్స్, సన్ ఫీస్ట్ యిప్పీ..ఇలా ఎన్ని వచ్చినా నా ఓటు మాత్రం మ్యాగీ కే😍..#ilovemaggi..అక్కడితో భీమవరం సంగతులు అయిపోయాయి. ఇప్పుడు మరమెట్ల దగ్గరికి వచ్చేద్దాం.ఎస్కలేటరు ను తెలుగులో మర మెట్లు అనొచ్చు అని తెలుగు వెలుగు పత్రిక ద్వారా తెలుసుకున్నాను. అందుకే నా ఈ టపాలో ఇలా వాడేస్తున్నా. ఉద్యోగంలో చేరడానికి మొట్ట మొదటి సారి సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో దిగినప్పుడు తప్పని సరిగా మర మెట్లని ఎక్కాల్సి వచ్చింది. అది ఎక్కాలంటేనే కంగారు వస్తుంది నాకు. డాడీ ఏమో "ఏం కాదు..అందరూ ఎక్కట్లేదూ" అంటూ ఆ మెట్ల దగ్గరికి తీసుకెళ్లారు.

Google image


నాకు భయం వేసి ఎక్కే ముందే డాడీ చేతిని పట్టుకున్నాను. 😿పైకెక్కే దాకా వదల్లేదు. పైకి ఎక్కాక మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం తూలినట్టు నేను కూడా ముందుకు పడబోయాను...కానీ వెంటనే నన్ను నేను సంభాళించుకున్నాను. హమ్మయ్య….! మొత్తానికి నేను కూడా ఎస్కలేటర్ ఎక్కేసాను👏. నన్ను నేనే మెచ్చుకున్నాను.

😜
ఇక ఆ తర్వాత మర మెట్లు అంటే భయం పోయింది. సికింద్రాబాద్ స్టేషన్ లో బోల్డు సార్లు..ఇంకా హిమాయత్ నగర్ Westside లో ..ఎక్కేసరికి ధైర్యం వచ్చేసింది😁.. అంతే కదండీ..ముందు మొదలు పెట్టేవరకే భయం..తర్వాత అన్నీ పరార్.. ఇదేనండీ నా ఎస్కలేటర్ కథ..👍