21, మే 2020, గురువారం

కరోనా కాలంలో నేను -118 మార్చి 2020 నుండి  మొదలుపెడదాం.....

ఆరోజు పదవ తరగతి సి బి ఎస్ ఈ సోషల్ పరీక్ష. నాకు ఇన్విజిలేషన్ రావడం రెండోసారి. కరోనా వ్యాధి నేపధ్యంలో సి బి ఎస్ ఈ పరీక్షలకి సంబంధించి కొన్ని మార్పులు చేసింది . అందరూ మాస్కులు వేసుకోవాలి శానిటైజర్ నీళ్ల సీసా లాంటివి తెచ్చుకోవచ్చు.. గదిలో ఇద్దరి మధ్య ఒక మీటరు దూరం ఉండాలి ఇలా అన్నమాట.. అప్పటివరకు ఒక గదిలో 25 మంది విద్యార్థులు, ఇద్దరు ఇన్విజిలేటర్లు (అసిస్టెంట్ సూపరింటెండెంట్) తో పరీక్షలు జరిగాయి. కానీ ఇప్పుడు ఒక గదిలో 12మంది విద్యార్థులు ఒక ఇన్విజిలేటర్ మాత్రమే ఉంటారు. దానికోసం ప్రైమరీ తరగతి గదులను కూడా వాడాల్సి వచ్చింది. కంట్రోల్ రూమ్ కి కొంచెం ముందుగానే వెళ్ళాం. తర్వాత మాకు కేటాయించిన రూములోకి వెళ్ళిపోయాం. నా రూమ్ లో అందరూ అమ్మాయిలే ఉన్నారు. వాళ్ళందర్నీ  చూస్తే నా పదవ తరగతి రోజులు గుర్తుకు వచ్చాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు ఏ ఒక్కరూ మాస్క్ వేసుకోవడం కానీ ముఖాన్ని కప్పుకోవడం కానీ చేయలేదు. నేను కూడా. నిజం చెప్పాలంటే అప్పట్లో మాస్కులు శానిటైజర్ లు ఎక్కడా దొరికేవి కాదు.. స్టాకు ఖాళీ అయిపోయేది.🥺

ఆ తర్వాతి రోజు పొద్దున్నే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మార్చి 31 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను సి బి ఎస్ ఈ వాయిదా వేసిందని. అలాగే 31 వరకు అన్ని స్కూళ్లను మూసేయాలని కె వి ఎస్ హెచ్ క్యూ నుండి  ఆర్డర్ వచ్చింది. మార్చి 20న మాకు ఒక సర్క్యులర్ వచ్చింది. ప్రైమరీ స్టాఫ్ కి మొదట మూడు రోజులు సెలవులు ఆ తర్వాత సెకండరీ స్టాఫ్ కి సెలవులు. వాళ్లకి సెలవులు అయినప్పుడు మేం వెళ్ళాలి అన్నమాట. ఆ ఆదివారమే ప్రధాని జనతా కర్ఫ్యూ ప్రకటించారు (మార్చి 22).సోమవారం సాయంత్రం హాస్టల్ వార్డెన్ వచ్చి చెప్పింది .."మంగళవారం అర్ధరాత్రి నుండి 31 దాకా తమిళనాడులో కర్ఫ్యూ అంట. హాస్టల్ మూస్తున్నాం" అని. నాకేం చెయ్యాలో తోచలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అనుకున్నా కానీ మరీ మొత్తానికి మూస్తుంది అని అనుకోలేదు.🤯😵😫 మా రూమ్ లో లో అప్పటికి ఇద్దరమే ఉన్నాం. ఆ అమ్మాయి ఆ రాత్రికే ఏదో కార్ పట్టుకొని వాళ్ల ఊరు trichy వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే మిగిలాను. ఇక చేసేది ఏమి లేక రేణు ని అడిగా... కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను అని.. తన ఒప్పుకుంది. 

మంగళవారం హాస్టల్లో నేనొక్కదాన్నే ఉన్నాను. అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఆ రోజున చాలా ఒంటరితనం అనిపించి ఏడ్చేశా🤧. సాయంత్రం 3:30 కి నాలుగు జతల బట్టలు ఇంకా కొన్ని నిత్య అవసరం అనిపించినవి బ్యాక్ పాక్లో సర్దుకొని నా సైకిల్ మీద రేణు వాళ్ల ఇంటికి బయలుదేరాను. అప్పటిదాకా హాస్టల్ గది నాలుగు గోడల కి పరిమితమైన నాకు మనుషుల్ని చూడగానే కొంచెం బాగా అనిపించింది. ఆ రోజే ఇరవై ఒక్క రోజుల లాక్ డౌన్ ప్రకటన చేశారు. ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. కొత్త ప్రదేశం ఇంకా 21 రోజులు... 31 దాకానే అనుకున్న.. అన్ని రోజులు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండటం అని… వీళ్ళకి ఇబ్బంది అవుతానేమో అని.. ఇవే ఆలోచనలు బుర్రనిండా..🙄😣

తర్వాత జరిగింది తర్వాతి టపా లో....🥴


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...