28, మే 2014, బుధవారం

ప్లీజ్ చెప్పరూ....


మా విశ్వవిద్యాలయంలో మాకు ఉబుంటు OS ఉంటుందని చెప్పా కదా!ఉబుంటు 11.10 వర్షన్ మాది.అందులో టెర్మినల్ లో ఫైల్స్ ని జిప్ చేసుకుంటాం.అందులో కంప్రెస్స్ అనే ఆప్షన్ లేదు.అలా కొన్ని ఫైల్స్ జిప్ చేసి డ్రైవ్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చా.మొత్తం పూర్తయ్యాకే టెర్మినల్ ని క్లోజ్ చేశా.ఆ జిప్ ఫైల్స్ మా విండోస్ 7 లో ఓపెన్ కావట్లేదు.అందులో కొన్ని ఓపెన్ అయ్యాయి.కొన్ని కావట్లేదు.అవి జిప్ సరిగా కాలేదని ఎర్రర్ వస్తుంది.ఇక జిప్ లోని ఫైల్స్ బయటికి రావా?అందులో ముఖ్యమైన బుక్స్ అవీ తెచ్చుకున్నా! ప్లీజ్ తెలిస్తే చెప్పరూ....3 కామెంట్‌లు:

 1. జిప్ లో సరిగా compress అవ్వకపోతే CRC error వస్తుంది. అంటే ఇంక పని చేయదు. మీరు తెచ్చుకున్నది textbooks అయితే online లో e-books దొరికే అవకాశం ఉంది. ప్రయత్నిచండి.

  రిప్లయితొలగించండి
 2. కొన్ని ఓపెన్ అయ్యి ఇంకొన్ని కావటం లేదంటే బహుశా జిప్ అయినప్పుడో లేదా కాపి అయినప్పుడో ఎదో సమస్య వచ్చి ఉండాలి. ఒక సారి మీ పెన్ డ్రైవ్ నుండి ఓపెన్ చెయ్యటానికి ప్రయత్నం చెయ్యండి, లేదంటే మళ్ళి మీ ఉబుంటు కంప్యుటర్ నుండి కాపి చెయ్యటానికి ప్రయత్నం చెయ్యండి.

  మీకు కంప్రెస్ ఆప్షన్ లేదు అంటే ఏమిటో అర్థం కాలేదు? మీరు 'archive manager' అనే ప్రోగ్రాం వెతికితే, దానితో ఫైల్స్ కంప్రేస్స్ చేసుకోవచ్చు. లేదంటే ఈ లింకులో చూపిన విధానం ద్వారా చేసుకోవచ్చు. http://bit.ly/SQMNKH
  కంప్రేస్స్ చేసుకునేప్పుడు .zip ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అవి విండోస్ లో ఓపెన్ అవ్వటానికి ఇబ్బంది ఉండదు.


  ఇక ప్రస్తుతం మీ దగ్గర ఉన్న జిప్ ఫైల్స్ ను 7 zip లేదా win rar లాంటి ప్రోగ్రామ్స్ తో ఓపెన్ చెయ్యటానికి ట్రై చెయ్యండి. లేదంటే ఆ ఫైల్స్ ను గూగుల్ డాక్స్ కు అప్లోడ్ చేసి చూడండి. గూగుల్ డాక్స్ లో జిప్ ఫైల్ పై కిల్క్ చేస్తే అవి ఆన్ జిప్ అవుతాయి.

  good luck మోహన గారు.

  రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...