7, మే 2015, గురువారం

గుడ్డులో మొక్కలు!

గురువారం, మే 07, 2015 0 Comments

గింజలు వేశాక..




ఇప్పుడే మొలకలు వస్తున్నాయ్..


మొక్కలు వచ్చేశాయ్..


                  ఏప్రిల్ నెల బాలభారతం మాసపత్రికలో చూసి మా చెల్లి వీటిని తయారు చేసింది.వాడేసిన గుడ్లలో మట్టి వేసి దానిలో మెంతులు,ధనియాలు వేసింది.ధనియాలను పగులగొట్టి వేయాలట కదా...!దానికి తెలియక అలాగే వేసేసింది..అవి మొలకెత్తలేదు.కేవలం మెంతికూర మాత్రమే మొలిచింది.

                పందికొక్కు ఒకటి ఎప్పుడూ ఇలాంటి వాటి కోసమే కాచుక్కూచుంటుంది.వీటిని రాత్రి పూట లోపల పెట్టేవాళ్ళం.కానీ దురదృష్టవశాత్తూ ఒక రోజు మాత్రం మర్చిపోయి అలాగే బయటే గుడ్లను వదిలేశాం.

          తెల్లారేసరికీ ఆ పందికొక్కు వాటిని చెల్లచెదురు చేసేసింది.మొలిచిన మొక్కలు కాస్తా విరిగిపోయాయి.ప్చ్...అక్కడితో ఆ ప్రహసనం పూర్తయింది..




10, మార్చి 2015, మంగళవారం

"అతడు అడవిని జయించాడు" ను నేనూ చదివాను!

మంగళవారం, మార్చి 10, 2015 0 Comments

నిన్న నేను "అతడు అడవిని జయించాడు" నవలను చదివాను.అది పూర్తిగా రాయలసీమ మాండలికంలో ఉన్నట్లుంది.నేను అర్ధం చేసుకోవడానికి "ఇంచుక" సమయం పట్టింది.అదొక విభిన్నమైన కథాంశం.నాకు సాధారణంగా కుటుంబ కథలంటే ఇష్టం...కానీ ఈ నవలను చదివాక ఇలాంటి కథలంటే కూడా నాకు ఇష్టం కలిగింది.



ఆ కథ చదువుతుంటే నేనూ ఆ ముసలివానితో పక్కనే తిరుగుతూ జరిగినదంతా గమనిస్తున్నట్టు అనిపించింది.చదువూన్నంతసేపూ పుస్తకాన్ని పక్కన పెట్టాలనిపించలేదు.మొత్తానికి రెండు గంటల్లో పూర్తి చేసేసాను.అందులో నాకు చాలా పదాలకు అర్ధం తెలియలేదు...అందులో నాకు బాగా గుర్తు ఉన్న పదాలు..."సుంక్రేసు చెట్టు","తీంట్ర పొదలు",తోటి గువ్వ"...ముఖ్యంగా "సుక్క పంది"..ఈ పదాలకు అర్ధం మీకు తెలిస్తే నాకు చెప్పరూ....!

ఈ నవల్లో నాకు నచ్చిన వాక్యాల్లో ఓ రెండు..."పందులు గునగున నడచివస్తుంటే నల్లగుండ్లు దొర్లుకుని వస్తున్నట్లుంది"...
"పక్షికి గాని,జంతువుకు గాను మానవుడు చేయగల మహోపకారం-వాటి మానాన వాటిని వదిలిపెట్టడమే"


చివరగా నేను చెప్పేదేంటంటే పుస్తక ప్రియులంతా తప్పకుండా...చదవవల్సిన ముఖ్య నవల "అతడు అడవిని జయించాడు"

8, ఫిబ్రవరి 2015, ఆదివారం

చిన్ని అతిథులు

ఆదివారం, ఫిబ్రవరి 08, 2015 2 Comments

మా ఇంటికి రోజూ ఈ అతిథులు వస్తాయి..మా నాన్న గారు వీటిని అలవాటు చేసారు.ఉదయాన్నే 8 అవకుండా వచ్చేస్తాయి.టోపీ పిట్టలు,పిచ్చుకలు,తోక కింద ఎర్రగా ఉండే నల్ల పిట్టలు(నాకు పేరు తెలీదు) ఇంకా కాకులు వస్తాయి..మేమేమి తింటే అదే కొంచెం పెడతాం..టోపీ పిట్టలు సపోటా,అరటి పళ్ళను ఎంత ఇష్టంగా తింటాయో!సంక్రాంతికి నాన్నగారికి,ఎవరో వరి ధాన్యాలు గుత్తు ఇచ్చారు..దాన్ని ఇంటి ముందు వేలాడదీస్తే పిచ్చుకలు రోజూ వస్తున్నాయి..అవి దాని మీద వాలి,ధాన్యంపైన ఉండే పొట్టును వొలిచి మరీ తింటున్నాయి..
ఇక టోపీ పిట్టలు ఉన్నాయంటే మేము దాని దగ్గర్నునంచి వెళ్తున్నా,అవి కదలవు.అదంతా మా మీద నమ్మకమే!వీటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది.ఒకేసారి నాలుగైదు తింటానికి వస్తాయి.ఒకటి తిన్న తర్వాతే ఇంకోటి తింటుంది!అంతవరకు పక్కనే నిల్చుని చూస్తుంది!బకెట్లలో ఉండే నీటిలో జలకాలాటలు కూడా ఆడతాయి..
నాకు పేరు తెలియని పిట్టలు,మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి ఎంత గోల చేస్తాయో!(సరదాగా)..ఆ గోల వినసొంపుగా ఉంటుంది.
ఈ చిత్రాలన్నీ ఐదు రోజులు కష్టపడి తీశాను.

విద్యుత్తీగే ఊయల


క్షీరన్నం తింటూ..


ఫ్రెండ్ కోసం..


ఇదిగో వచ్చేసింది..


మధ్యాహ్నం కిలకిలలు





ఇంటి పైకెక్కి


స్థంభం పైన..




గులాబ్ జాం తినాలా వద్దా?


సర్లే తిందాం!


ఎడమొహం పెడమొహం..ఇప్పుడే గొడవయింది.







15, జనవరి 2015, గురువారం

పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు

గురువారం, జనవరి 15, 2015 0 Comments

నిన్న పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో సంక్రాంతి సంబరాలు మా పాఠశాల లో జరిగాయి.దీనికి MLA Dr.నిమ్మల రామానాయుడు గారు అధ్యక్షత వహించారు.
నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు జరిగాయి.ఆ ప్రాంగణానికి సంక్రాంతి శోభ వచ్చింది.నిజంగా పల్లెలో ఉన్నట్టు అనిపించింది.ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు బాగున్నాయి.ప్రభుత్వ పాఠశాలలకు అవకాశం ఇవ్వలేదేమో!మా పాఠశాలకి పెద్ద మైదానం ఉంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీమతి పీతల సుజాత పాల్గొన్నారు."సంక్రాంతి వచ్చిందె తుమ్మెదా" పాట సుమారు పది సార్లు విని ఉంటాం..ఆకాశంలో టపాకాయల వెలుగులు కన్నుల విందుగా ఉన్నాయి.
గంగిరెద్దుల విన్యాసాలు,హరిదాసులు,రంగురంగుల రంగవల్లులు,పిట్టలదొర,సోదెమ్మల వేషాలు,దేశవాళీ ఆవులు,కపిల ఆవులూ...అబ్బో...ఇలా ఎన్నో...కనులవిందుగా ఉన్నాయి.
























30, నవంబర్ 2014, ఆదివారం

జనగణమన...

ఆదివారం, నవంబర్ 30, 2014 0 Comments




జనగణమన గీతం మొత్తం ఐదు చరణాలు.మొదటిది మన జాతీయ గీతం,మనందరికీ తెలుసు.మిగతా నాలుగు చరణాలు ఇవిగో...

2.అహరహతవ అవ్భాన్ ప్రచరిరిత
సునితవ ఉదార వాణి
హిందు బౌద్ధ శిఖ్ జైన్ పార్శిక్ ముసల్మాన్ క్రీస్తానీ
పూరబ్ పశ్చిమ ఆషె
తవ సింఘాసన్ ఆషె
ప్రేం హొర్ ఎ గాధా
జన గణ ఎక్-విధాయక జయహే
భారత భాగ్య విధాత
జయహే జయహే జయహే జయజయజయ జయహే


3.పతన అభ్యుద్ధయ్ బందూర్ పంథా
యుగ్ యుగ్ ధావిక్ యాత్రీ
హె చిరసారథి తవ రథ్ చక్రె
ముఖురిత్ పథ్ దిన్ రాత్రి
దారుణ విప్లవ్ మాఝే
తవ శంఖధ్వని భాఝే
సంకట దుఖ త్రార్థ
జనగణ  పథ పరిచాయక జయహే
భారత భాగ్య విధాత
జయహే జయహే జయహే జయజయజయ జయహే


4.ఘోర్ తిమిర్ ఘన నిబిడ్ నిషిథె
పీడిత్ మూర్చిత్ దేషే
జాగృర్ చిల తవ అవి చల్ మంగళ
నతనయనే అనిమేషే
దుస్వప్నే ఆతంకే రక్షాకరిలే అంకే
స్నేహమయి తుమీ మాత
జనగణ దుఖ త్రాయక జయహే
భారత భాగ్య విధాత
జయహే జయహే జయహే జయజయజయ జయహే


5.రాత్రి ప్రభతిల ఉదిల రవి ఛవ్వి
పూర్వ ఉదయగిరి భాలే
గాహె విహంగమ పుణ్య సమీర
నవ జీవన్ రస్ ఢాలే
తవ కరుణారుణ రాగే
నిద్రిత్ భారత్ జాగే
తవచరణే నథ్ మాథా
జయ జయ జయ హె జయ రాజేశ్వర్
భారత భాగ్య విధాత
జయహే జయహే జయహే జయజయజయ జయహే

16, నవంబర్ 2014, ఆదివారం

Ek Cup Chya-Movie

ఆదివారం, నవంబర్ 16, 2014 0 Comments

               ప్రతీ శనివారం సాయంత్రం 6.30 కి DDభారతి లో బహుమతులు పొందిన భారతీయ చలన చిత్రాలు ప్రసారం చేస్తున్నారు.అందులో నిన్న "Ek cup Chya"(2009) అనే మరాఠీ సినిమా వేసారు.సమాచార హక్కు చట్టం పై తీసిన సినిమా అది.


                ఒక బస్ కండక్టర్ కొంకణ్ తీరంలో తన కుటుంబంతో(భార్య,తల్లి,ఇద్దరు కొడుకులు,ఇద్దరు కుమార్తెలు)నివసిస్తుంటాడు.ఒక రోజు వారికి కరెంటు బిల్లు ఏకంగా 73,000 రూపాయలు వస్తుంది.సాధారణ కుటుంబమైన వారికి అంత మొత్తం ఎలా కట్టగలరు.అసలు సమస్యేంటో కనుక్కుందామని విద్యుత్ కార్యాలయానికి వెళ్తాడు.అక్కడ అందరూ ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే ఆ డబ్బులు కట్టెయ్యమని.కానీ తను ఎలా కట్టగలడు.అంతే కాకుండా పాత బిల్లులు తీసుకురమ్మంటారు.అవి వారి దగ్గర ఉండవు.చాలా ఒత్తిడికి లోనవుతాడు.భార్య అతణ్ణి ఓదారుస్తుంది. తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఆపేస్తారు.పై అధికారికి దరఖాస్తు చేస్తే దాన్ని వారు పట్టించుకోరు.తన రెండో కొడుకు పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్తాయి.
ఇంతలో తనతో పని చేసే బస్సు డ్రైవరు సహాయంతో సమాచార హక్కు చట్టం ద్వారా పల్లె ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న ఒక లేడీ డాక్టరు ను కలుసుకుంటాడు.ఆమె ద్వారా ఆ చట్టం గురించి తెలుసుకుని,దరఖాస్తు చేస్తాడు.


               చివరికి అతని ఇంటికి విద్యుత్ వస్తుంది.నాలుగు నెలలు నూనె దీపంలో చదువుకున్న రెండో కొడుకు పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలుస్తాడు.
సినిమా నాకు చాలా చాలా నచ్చింది.సాధారణమైన కుటుంబంలో ఉండే ప్రేమాభిమానాలను బాగా చూపించారు.అందరూ తప్పక చూడవల్సిన సినిమా అనిపించింది.