16, జులై 2013, మంగళవారం

నేనొచ్చేశా!!!



హాయ్!!!! నేనొచ్చేశా.అదేంటీ దశరా వరకూ రానని అప్పుడే వచ్చేసిందని అనుకుంటున్నారా?? అవునండీ మాకు జీవశాస్త్రం తరగతులు అయిపోయాయి.మమ్మల్ని ఇక పంపించరనుకున్నాం కానీ వేసవి శెలవులు ఇంకా అవనందువల్ల ఇంటికి రావల్సివచ్చింది.ముందుగా నేను లేనపుడు నా బ్లాగును సందర్శించినవారికి మరియు వ్యాఖ్యానించిన వారికి నా ధన్యవాదాలు.

మేము ఒక సంవత్సరంలో నేర్చుకునే జీవాశాస్త్రం మొత్తం ముప్పై ఐదు రోజులలో నేర్చేసుకున్నాం.పోయిన నెల 26 న ఒక సెమిస్టరు,నిన్న ఒక సెమిస్టరు పరీక్షలు రాశాము.నాకైతే MPC సబ్జెక్టులకంటే జీవశాస్త్రం చాలా నచ్చింది.మన పరిసరాల గురించీ,మన గురించీ తెలుసుకోవడం చాలా బాగుంది.

నేను తెలుసుకున్న విషయాలలో కొన్ని

పెద్ద వృక్షాలలో Annual rings ఏర్పడటం

మొక్కలలో పువ్వులు,ఆకుల అమరిక

వృక్ష,జంతు రాజ్యాల వర్గీకరణ.....

నా ఈ అనుభవాల గురించి ముందు ముందు చెప్తానే.

నేను మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యేది 28 న

మా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన వారిని అనౌన్స్ చేసేశారు.ఈ సంవత్సరం మా మండలం నుండి ఇద్దరు అమ్మాయిలకి ప్రవేశం లభించింది.




5 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...