ఆదివారం మా చెల్లి ని చూడటానికి పెదవేగి(ఏలూరు)వెళ్ళాము.నేను ఇంటి దగ్గరే ఉన్నాను కదా.మా చెల్లి నన్ను రమ్మని గొడవ చేస్తే నేను,అమ్మా వెళ్ళాం.ఉదయం ఎనిమిదన్నర ఎక్స్ ప్రెస్ కి బయల్దేరాం.చాలా నెమ్మదిగా వెళ్ళింది బస్సు.స్కూలు కి వెళ్ళేసరికి ఒంటిగంట అయ్యింది.అప్పుడే చిన్నా కి క్లాస్ అయ్యి వచ్చింది.మేము తెచ్చినవి ఇచ్చాము.ఒక ప్లెయిన్ చీర తెమ్మంది.వాళ్ళకి మగ్గం వర్క్ నేర్పారట.చీర మీద కుట్టి చూపాలట.నేను చిన్న హాస్టల్ రూం కి వెళ్ళా.
నా బయాలజీ,మ్యాధ్స్ బుక్స్ ఇచ్చా.వాళ్ళది NCERT సిలబస్ కదా.మాకు దగ్గరగానే ఉంటుంది.వాళ్ళకి జూనియర్స్ ఆరవ తరగతి పిల్లలు వచ్చారు.చాలా చిన్న పిల్లలు.మా చెల్లిని కూడా ఆరవ తరగతిలోనే చేర్చాం.ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం M.Bi.P.C చదువుతుంది.
అమ్మా,నేను,చిన్న కూర్చుని మాట్లాడుకుంటుండగా ఒకమ్మాయి మాదగ్గరకు వచ్చింది.మేము చిన్నా స్నేహితురాలేమో అనుకున్నాం.కానీ చిన్నా చెప్పింది ఆ అమ్మాయి RIE మైసూరు లో చదువుతుందట.40 రోజుల శిక్షణ కోసం నవోదయ కు వచ్చారట.ఆ అమ్మాయితో పాటు ఎనిమిది మంది వచ్చారట.ఆ అమ్మాయి పేరు మమత,తనది మహారాష్ట్ర అట.తను ఎంత బాగా మాట్లాడుతుందో.ఇంగ్లీషులో మాట్లాడుతుంది.తెలుగు వచ్చా అని అడిగితే కొంచెం కొంచెం అర్ధమవుతుంది అని చెప్పింది.ఎవరిని పలకరించినా మొదట నమస్కారం చెప్తుంది.RIE లో తను B.Sc.Ed చదువుతుందట.చాలా బాగా అంటే చాలా సంవత్సరాలుగా మనతో పరిచయం ఉన్నట్టు మాట్లాడుతుంది.మా చెల్లి చెప్పింది అలా వచ్చిన వారు పదవ తరగతి లోపు పిల్లలకి చెప్తారట.తను మల్టీ టాలెంటెడ్ అంట.ఫొటోగ్రఫీ,పెయింటింగ్,పాటలు అన్నిట్లో తనకు ప్రవేశం ఉందట.నాకైతే ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది.
మళ్ళీ నాలుగు గంటలకి మేము తిరుగు ప్రయాణమయ్యాం.చిన్నా,నేను మళ్ళీ దసరా దాకా కలుసుకోము.
మోహన

Your last template is much better than this ra chinnammalu..!
రిప్లయితొలగించండి