19, జులై 2013, శుక్రవారం

మా ప్రయాణం

మాకు మొన్న సోమవారంతో జీవశాస్త్రం అయిపోయింది.అంటే ఆ రోజు ఉదయం పరీక్ష రాసేశాం.ఆ రోజు మధ్యాహ్నం అందరూ అవుట్ పాస్ లు PRO దగ్గర్నుంచి తీసుకున్నాం.చల్ల మంది ఆరోజే వెళ్ళిపోయారు,కానీ మేమందరం మంగళవారం వెళ్దామనుకున్నాం.ఆ రోజంతా చాలా బోర్ కొట్టింది.అక్కడ ఒకేసారి పెద్ద వాన మొదలవుతుంది.అకస్మాత్తుగా ఆగిపోతుంది.పెద్ద పెద్ద చినుకులు పడతాయి,నీటి బాంబులు మీద పడ్డట్టు ఉంటాయి.అప్పటికి మూడు రోజులక్రితం నుండి వాన పడుతూ ఉండేది.వెళ్ళే రోజు మాత్రం వాన పడకూడదు అనుకున్నాం.కానీ పడింది.

సాయంత్రం బట్టలు అన్నీ సర్దేసుకున్నాక,ఏమీ తోచట్లేదని మేమందరూ అంత్యాక్షరి ఆడుకుందాం అని మొదలుపెట్టాం.ఒక రౌండు కూడా అవ్వనేలేదు వార్డెన్ వచ్చింది.అంత గట్టిగా పాడుతున్నారేంటి అని తిట్టి వెళ్ళిపోయింది.మా రూం ఒక మూలన ఉంటే,ఆవిడ రూం మరో మూల ఉంటుంది.అసలే మాకు కొంచెం భయం ఎక్కువ,అందుకని మెల్లగానే పాడుతున్నాం.కానీ వినిపించేసింది.మా దురదృష్టం ఏంటో గానీ ఏదైనా  చెయ్యక చెయ్యక చేస్తామా అప్పుడే దొరికిపోతాం.ప్చ్ ఏంచేస్తాం.అప్పుదు మెస్ కి వెళ్ళి భోజనం చేశాం.రేపు ఇంటికి వెళ్తామనే ఆనందం లో ఏం తింటాం.ఏదో కానిచ్చాం.

ఆరోజు అందరూ తొందరగానే పడుకున్నాం.మామూలుగా అయితే పన్నెండు దాకా పడుకోము(నేను కాదు).ఉదయాన్నే టిఫిన్ చేసి బయల్దేరదామనుకున్నాం.



తర్వాతి రోజు ఉదయమే ఐదున్నరకి లేచాము.వెంటనే తయారయిపోయి టిఫిన్ చేశాం.ఉదయం నుండీ వాన పడుతుంది.కొంచెం సేపు తగ్గుతుందేమో అని చూశాం.తగ్గదే.ఇలా అయితే ఆలస్యం అవుతుందని అందరూ రూం బయటకి వచ్చేశాం.మా రూంస్ దాగర సెక్యురిటీ వాళ్ళ దగ్గర మేము వెళ్తున్నామని పేర్లు రాయాలి.మా అందరి పేర్లు తబిత రాసింది.ముందే చెప్పాను కదా రమ్య్ అనేను కలిసి వెళ్ళాలనుకున్నాం అని.తనూ,నేను మా బ్యాగులతో గేటు వద్దకి బయల్దేరాం.మీకు చెప్పలేదు కదూ,నాకు ఇదే మొదటిసారి ఓన్లీ కాలేజీ బ్యాగుతో ఇంటికి రావడం.ఎప్పుడూ కనీసం రెండు బ్యాగులతో వస్తాను.

మళ్ళి ఎంట్రన్స్ దగ్గర అవుట్ పాస్ లు చూపించి సంతకం పెట్టాలి.అయిపోయాక బయట ఒక ఆటో ఉంది.దాన్లోకి ఎక్కేశాం.అక్కడ్నుంచి నూజివీడు బస్టాండ్ కి వెళ్ళాలి.మమూలుగా అయితే బస్సు చార్జ్ ఐదు రూపాయలు.కనీ ఆటోకి పది రూపాయలు.ఆటువైపు బస్సులు సమయానికి రావు,అందుకని ఆటోలే శరణ్యం.అప్పటికే ఎనిమిది అయిపోయింది,తూర్పు గోదావరికి వెళ్ళేవాళ్ళందరూ సిమ్హాద్రి కి వెళ్తారు.అది తొమ్మిదికో,తొమ్మిదిన్నరకో నాకు తెలియదు.రమ్య,నేను,ఇంకో మచిలీపట్నం అమ్మాయి ఒక ఆటోలో ఉన్నాం.మా స్నేహితులందరూ ఇంకో ఆటోలో ఉన్నారు.


నూజివీడుకెళ్ళాక అక్కడ్నుంచి నేరుగా ఏలూరుకి బస్సులు అప్పుడు లేవంట,హనుమాన్ జంక్షన్ కి వెళ్ళాలి.H.జంక్షన్ బస్సులు కూదా రావట్లేదు.గుడివాడ వెళ్ళే బస్సెక్కాం.పాలకొల్లు వెళ్ళాలంటే గుడివాడ వెళ్ళి అక్కడ్నుంచి భీమవరం బస్సులు బోలెడు ఉంటాయి.అక్కడ్నుంచి పాలకొల్లు చాలా సులువుగా వెళ్ళొచ్చు.కానీ అలాగయితే ఎక్కువ దూరం అవుతుందని వెళ్ళలేదు.మేము హనుమాన్ జంక్షన్ లో దిగిపోయాం.అక్కడ అరగంట పాటు నించున్నాం.ఒక వైపు వాన అంతా తడిసిపోయింది.కూర్చోడానికి చోటులేదు.మేము ఏలూరు కొత్త బస్టాండ్ అని ఉన్న బస్సుకోసం వెతుకుతున్నాం.కానీ ఇంతకీ మాకు తెలియని విషయం ఏంటంటే అక్కడ్నుంచి ఎక్కువ బస్సులు ఏలూరు కి వెళ్తాయంట.చివరికి కాకినాడ బస్సు ఎక్కాం.అది లగ్జరీ బస్సు.చార్జ్ కొంచెం ఎక్కువ.కానీ చాలా బావుంది.అందులో ఉన్నది పదై నిముషాలే.అందులో నాయక్ సినిమా వస్తుంది.


ఏలూరు బస్టాండ్లో  దిగగానే నరసాపురం బస్సు ఉంది.నించోవల్సిన పనిలేకుండానే బస్సు దొరికిందని ఆనందపడి ఎక్కాము.రెండు ఉన్న సీట్లలో నేను,రమ్య కూర్చున్నాం.అప్పటికి సమయం పది అయింది.వెళ్ళేసరికి పన్నెండున్నర అవుతుందని అనుకున్న్నాం.తను మొబైల్ ఫోన్లో పాటలు వింటుంది.కానీ నా ఇయర్ ఫోన్స్ పని చెయ్యట్లేదు.చిన్న సౌండ్ పెట్టుకుని చెవి దగ్గర పెట్టుకుని విన్నా.


ఒంటిగంటకి ఇంటికి చేరుకున్నా.నేను పాలకొల్లు బస్టాండ్ వరకూ రాలేదు.కానీ తను పాలకొల్లు దాటి వెళ్ళాలి.అందుకని బస్టాండ్ కి వెళ్ళింది.

భోజనం చేశాక ల్యాప్ టాప్ ముందేసుకుని కూర్చున్న.అమ్మేమో అక్కడి సంగతులు చెప్పమని కూర్చుంది.మాకిది మామూలే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...