18, జులై 2013, గురువారం

స్నేహితులు

ఈరోజు మా రూంలో ఉండే నా స్నేహితులను మీకు పరిచయం చేస్తాను.

నేను

రాధారమ్య - పశ్చిమగోదావరి

మీనాక్షి - తూర్పుగోదావరి

మణిమాల - తూర్పుగోదావరి

తబిత - తూర్పుగోదావరి

ఆశ - తూర్పుగోదావరి

సరిత - తూర్పుగోదావరి

సునీత - ప్రకాశం

దివ్య - తూర్పుగోదావరి

స్వాతి - తూర్పుగోదావరి

నవ్య -  ఖమ్మం

అశ్విని - ఖమ్మం

శారదా దేవి -  కృష్ణా

మౌనికా సుస్రీ - కృష్ణా

అనూష - గుంటూరు

పల్లవి - గుంటూరు

ప్రజ్ఞ - ప్రకాశం

రమ్య నాగ శిరీష -  తూర్పుగోదావరి

గిరి సత్య కరుణ కుమారి - తూర్పుగోదావరి

షణ్ముఖ రాజేశ్వరి - తూర్పుగోదావరి

ఫాతిమున్నీసా - గుంటూరు

శ్యామలా దేవి - వైజాగ్

సంధ్యా రాణి - శ్రీకాకుళం

రామ సీత - గుంటూరు

ఇలా ఇన్ని జిల్లాల వాళ్ళందరూ ఒక రూంలో ఉంటే భలే ఉంటుంది.మా ముందు బ్యాచ్ ను అయితే జిల్లాల ప్రకారం గదులు కేటాయించారంట.కానీ ఒక్కో సారి జిల్లాల ప్రస్తావన వచ్చినపుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి.మళ్ళీ కలిసిపోతాం.ఒక ఉదాహరణ చెప్పనా.మాకు ఒక రోజు బజ్జీలు టిఫిన్ పెట్టారు.తూర్పు,పశ్చిమ గోదావరి వాళ్ళు వాటిని బజ్జీలు అనీ,కొందరేమో మైసూరు బజ్జీలు అని అన్నారు.గుంటూరు వాళ్ళేమో బోండాలు అని అన్నారు.ప్రకాశం వాళ్ళేమో పునుకులు అన్నారు.వాళ్ళు బజ్జీలు అంటే అరటికాయ,మిరపకాయలతో వేసేవాటిని బజ్జీలు అంటారట.గోదావరి వాళ్ళు పెసరపిండితో వేస్తే వాటిని పునుకులు అంటారు కదా.

మొత్తానికి రెండు సార్లు ఇలా వాదించుకున్నాం.



2 కామెంట్‌లు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...