మా పాఠశాల |
ఈ రోజు ఉదయం మా బడికి వెళ్ళాను.ఎందుకంటే వృత్తివిద్య సర్టిఫికేట్ 10వ తరగతిది నేను తీసుకోలేదు.మంగళవారం వెళ్తే చాలా మంది టీచర్లు ఎలక్షన్ డ్యూటీ కి వెళ్ళారట.ఈ రోజు రమ్మంటే వెళ్ళాను.
మా పాఠశాలలో వృత్తివిద్య 8,9,10 వ తరగతులకి ఉంది.మాకు రెండే విభాగాలు ఉన్నాయి.టైలరింగ్ మరియు ఎలక్ట్ర్రానిక్స్.నాది టైలరింగ్.కొంతమంది అమ్మాయిలు ఎలక్ట్ర్రానిక్స్ లో కూడా ఉన్నారు,కానీ అబ్బాయిలెవరూ టైలరింగ్ లో లేరు.
మాకు 8వతరగతిలో చిన్న చిన్నవి నేర్పించారు.అందులో ఒకటి తలదిండు గలేబు.
ఇక 9వ తరగతికొచ్చేసరికీ సారీ పెట్టీకోట్స్,పంజాబీ డ్రెస్స్ టాప్ నేర్పించారు.
పదవ తరగతిలో జాకెట్లు ఎలా కుట్టలో చెప్పారు.
అంతే మా టైలరింగ్ కోర్స్ అయిపోయింది.వారానికి రెండు క్లాసులు ఉండేవేమో.మొత్తం అన్ని తరగతులకూ కలిపి పదవ తరగతి పబ్లిక్ పరీక్ష,అన్ని పరీక్షల తర్వాత జరిగింది.కుట్టమంటే కుడతాం కానీ దాని గురించి రాయడం అంటే చిరాకు కదండీ.నాకైతే చాలా.ఏదో రాశాను.ప్రాక్టికల్ కూడా జరిగిందండోయ్,మా పాఠశాలలోనే.ఈ రోజు సర్టిఫికేట్ చూస్తేనే కానీ నాకు తెలీదు,పరీక్షలో ఎన్నిమార్కులు వచ్చాయో.ఎన్నో తెలుసా 86/100.సరిగ్గా రాయకపోయినా బాగానే వచ్చాయే అనుకున్నా.
అదలా ఉంటే బడికి వెళ్ళానా!! కలియతిరిగి మొత్తం చూస్తే ఎన్నో జ్ఞాపకాలు.అప్పుడు ఎలా ఉండేవాళ్ళము.ఎంతైనా పదవ తరగతి వరకూ ఉండేవాళ్ళే అసలైన స్నేహితులు అని నా అభిప్రాయం.మీరేమైనా అనుకోండి.నేను పాఠశాలను వదిలి ఒక సంవత్సరమే అవుతున్నా ఎన్నో ఏళ్ళు అవుతున్నట్టు అనిపిస్తోంది.నా స్నేహితులందరినీ కలవాలనుంది.కానీ అందరూ వారి వారి చదువుల్లో బిజీ అయిపోయుంటారు.నేనేమో వారందరికీ దూరంగా నూజివీడులో చదువుతున్నా.
పాఠశాలలో అందరు టీచర్లందరికీ నేను తెలుసు.ఏ పోటీ ఉన్నా నన్ను పంపేవారు.నేను కూడా బహుమతులు తెచ్చుకునేదాన్ని.స్వార్ధం కానీ ఏదైనా అవ్వనివ్వండి. నాకు క్విజ్ లలో పాల్గొనడం అంటే చాలా ఇష్టం.
ఇదిగో ఈ ఫోటో మా పదవతరగతిలో పాఠశాల స్థాయిలో టాపర్లు.ఇంగ్లీషు మీడియం వాళ్ళకి పదికి పది పాయింట్లు వచ్చినా మాది మాకే గొప్ప.ఇదివరకు అనుకునేదాన్ని,నాన్న మా చెల్లినీ,నన్ను ఆంగ్ల మాధ్యమం నుండి తీసుకొచ్చేసి మామూలు ప్రాధమికోన్నత పాఠశాలలో వేశారని.కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు,ఎందుకంటే మాతృభాషలోనే చదువుకోవడంలో ఆనందాన్ని నేను అనుభవించానని అనుకుంటా.ఆనందం ఏవుంటుందని అనుకోవచ్చు,కానీ అది తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది.నాన్న గారు చదువుకున్న ఉన్నత పాఠశాలలోనే నేనూ చదువుకున్నా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...