8, ఏప్రిల్ 2013, సోమవారం

Hostel

హాస్టల్ లో చేరే రోజున అమ్మా,నాన్నా, నేను ముగ్గురం వెళ్ళాము.పాలకొల్లు నుండి ఏలూరు వెళ్ళి,అక్కడినుండి నూజివీడు కు బస్సు దొరికితే సరే. లేకపోతే హనుమాన్ జంక్షన్ వెళ్ళి, అక్కడ నూజివీడు బస్సు ఎక్కాలి.అక్కడితో ప్రయాణం అయిపోలేదు.మళ్ళీ అక్కడ మైలవరం వెళ్ళే బస్సు ఎక్కి IIIT  దగ్గర దిగాలి.మేము ఉదయమే బయలుదేరాము.అక్కడికి వెళ్ళే సరికీ 10AM అయింది.అందరి దగ్గర సంతకాలు తీసుకుని గదికి పంపేశారు.నేను ఇంక అమ్మానాన్న తో మాట్లాడలేదు.వాళ్ళు వెళ్ళిపోయారు.గదిలో కూర్చుని యేడ్చాను. అప్పటికీ ఒకమ్మాయి ఉంది లోపల.తనది శ్రీకాకుళం అంట.మాట్లాడుకున్నాం.నేనొక మంచం తీసుకుని దుప్పటి వేశాను.బీరువాలో నా బట్టలు అవీ సర్దాను. చాలా మంది వచ్చారు.24మంది కదా.కొంతమంది పరిచయమయ్యారు.మణిమాల(తూ.గో),రమ్య(ప.గో),తబిత(తూ.గో),సరిత(తూగో),సంధ్య(శ్రీకాకుళం),సునీత(ప్రకాశం).కానీ నాకు చాలా భయం వేసేది.అందరూ ఎలా ఉంటారోఅని ఎందుకంటే హాస్టల్ లూ ఉండడం మొదటిసారికదా.మధ్యాహ్నం భోజనం చేయలేదు.వచ్చిన రోజే అందరూ బట్టలు ఉతికేశారు.ఎందుకో నాకర్ద్ధo కాలేదు.  రేపట్నుంచే తరగతులు మొదలు అని వార్డెన్ చెప్పింది.ఆరోజు అలా గడిచింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...