మేము ఇల్లు కట్టుకున్న కొత్తలో అంటే నా 4వ తరగతిలో, మా ఇల్లు కట్టిన మేస్త్రి ఒక కుక్క పిల్లను తీసుకు వచ్చాడు.వాళ్ళింట్లో కుక్క, పిల్లలను పెట్టిందట.దానిని బుట్టలో తీసుకు వచ్చాడు.చిన్నది కదా.చాలా బుజ్జిగా ఉంది.అప్పటి వరకూ అమ్మదగ్గర ఉండి అంతలో వేరే ప్రదేశానికి వచ్చింది కదా.బిక్కుబిక్కుమంటూ ఉంది.దానిని చూస్తే జాలి వేసింది.పాలు పోస్తే తాగింది.రోజంతా బాగానే ఉంది.కానీ రాత్రి అది చేసిన గోల అంతా ఇంతా కాదు. గది అంతా కలయ తిరిగేసింది.అది అస్సలు నిద్ర పోలేదు.
కొద్ది రోజులలోనే మాకు అది బాగా అలవటైపోయింది.నాన్న దానికి జూజీ అని పేరు పెట్టారు.ప్రత్యేకంగా ఉంది కదా.దాన్ని గొలుసుతో కట్టకుండా ఉంచాలనుకున్నాం.కానీ బయట గేతు తెరిస్తే చాలు బయటికి వెళ్ళిపోయేది.అందుకని కట్టేసే వాళ్ళం.
ఉదయమే దానిని కట్టేవాళ్ళం కాదు.ఇల్లంతా తిరిగేది.ఒకసారి అమ్మ ముగ్గు వేయటానికి అని గేటు తెరిచింది.గొలుసు లేకుండా ఉంది ఏమో బయటికి పరుగెత్తింది.రోడ్డు పక్కన ఇల్లు కదా.కారు కింద పడబోయింది.డ్రైవరు సడెన్ బ్రేకు వేయటం వల్ల దానికేమీ కాలేదు.
ఇంకోసారి ఎక్కడ దొరికిందో ఏంటో ఏదో మాంసం ముక్క మింగేసింది.అది కాస్తా గొంతుకకి అడ్దం పడింది.ఆ విషయం మాకు తెలియలేదు.మాకు ఎలా తెలిసిందంటే ఎప్పుడూ మొరుగుతూ ఉండేది కాస్తా ఆ రోజు చాలా సైలెంట్ గా ఉంది.రక్తంతో వాంతులు అయ్యేవి.మాకు చాలా భయం వేసింది.మా మావయ్య గారు పశువైద్యుడు కావటం చేత ఆయన్ని కనుక్కుని మందులు కొని దానికి వేశాం.కొన్ని రోజులకి నయం అయింది.మేము ఏదన్నా తింటుంటే చాలు,దానికి తెలిసిపోయి అరిసేది.చికెన్ షాపు నుండి కొంచెం దీనికి మాత్రం చికెన్ తెచ్చి పెట్టేవాళ్ళం.
ఒక రోజు మేమందరూ ఫోటోలు తీసుకుంటున్నాం.అప్పుడు దీన్ని కూడా తీశాం.చూడండి ఎలా ఫోజులు ఇచ్చిందో.
మా చెప్పులు ఎన్ని కొరికేసిందో.గులాబీ,కనకాంబరం మొక్కలు తొక్కేసి పాడు చేసింది.కానీ అది ఇప్పుడు ఎక్కడుందో ఏంటో.దానిని నాన్న ఎవరికో ఇచ్చేశారు.ఎందుకంటే మేము ఎక్కువగా దానితోటే గడుపుతున్నామని.దాని గుర్తుగా ఈ చిత్రాలు మాత్రం మిగిలాయి.
దీనికంటే ముందు రాఖీ అనే పమేరియన్ కుక్కని పెంచాము.అది కొన్ని నెలలే ఉంది.అప్పుడు మాచెల్లీ, నేను చిన్న పిల్లలవడంతో దానితో అంత అనుబంధం ఏర్పడలేదు.

బావుందమ్మా మీ కుక్క తో నీ అనుభవాలు . మరి అట్లా పెంచుకున్న కుక్కని ఎట్లా ఇచ్చేశారు?
రిప్లయితొలగించండి