సుమారు 70 సం. నాడు క్షీరపురి పురపాలక పితామహులు శ్రీ బోళ్ళ వెంకట అసుబ్బారావు గారి మనోగగనంలో మెరిసిన మెరుపు రేఖ ఈ నాటి B.R.M.V మున్సిపల్ హైస్కూలు.
నాటి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ జి.రంగారావునాయుడు తమ అమృతహస్తాలతో సహకారం అందించారు.ప్రధమంగా మాధ్యమిక పాఠశాలగా అవతరించి 4వ తరగతి నుండి 8వ తరగతి వరకు 260 మంది విద్యార్థులతో మిడిల్ స్కూలు గా ఆవిర్భవించింది.ఆనాడు అద్దె భవనంలోనే నివాసం.
నాటి పురపాలక సంఘాధ్యక్షులుగా ఉన్న డా.ఆచంట గోపాలం గారి చేత ప్రారంభించబడిన స్వంత నూతన భవన నిర్మాణం,తర్వాత పురపాలక సంఘాధ్యక్షులైన శ్రీ పోలిశెట్టి వెంకట సుబ్బారావు గారి కృషి ఫలితంగా ది.25-6-1954న అద్దె భవనం నూండి స్వంత భవనానికి తరలించబడింది.
1956 నాటి మిడిల్ స్కూలు ప్రధానోపాధ్యాయులుగా శ్రీ నందుల బుచ్చి రామయ్య గారు వసతి చాలకపోవుట గుర్తించి పౌరుల విరాళంతో ఉపాధ్యాయుల,విద్యార్థుల శ్రమదానం తో శ్రీ యుతులు వస్తాదురాజు,మానెం నరసిమ్హమూర్తి,ఆండ్ర శేషగిరిరావు గార్ల సహకారంతో మరో అదనపు షెడ్డు సమకూర్చుకుంది.
1958లో నాటి పురపాలక సంఘాధ్యక్షులైన శ్రీ చోడిశెట్టి సూర్యారావు,కౌన్సిలర్ శ్రీ ఆండ్ర నారాయణ గార్ల కృషి ఫలితంగా ఉన్నత పాఠశాలగా పదోన్నతి పొంది 9వ తరగతి ప్రారంభించబడింది.
1959లో 10వతరగతి ప్రారంభించబడుటలో నాటి డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ సూరాబత్తుల సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు లభించడం అదృష్టం..ఇలా..శైశనావస్థ దాటి ...బాల్యాన్ని అధిగమించి,అంతస్థు పెంచుకుని యౌవన ప్రాధుర్భావంతో విరాజిల్లి...నేటికి 70 వసంతాలు పూర్తి చేసుకుని పట్టణ,పరిసర గ్రామ విద్యార్థులకు పట్టుకొమ్మగా భాసిస్తోంది,నేటిB.R.M.V మున్సిపల్ ఉన్నత పాఠశాల.
శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానమగుచున్న ఈ పాఠశాలకు వదాన్య శేఖరులు శ్రీ బంగారు రామారావు,శ్రీ మాచేపల్లి వెంకట రత్నం గార్లు చెరొక 20,000/- ద్రవ్య సహాయం అందించగా రెండు పక్కా భవనాలు నిర్మించటమే కాక వారి పేరున శ్రీ బంగారు రామారావు మాచేపల్లి వెంకట్ రత్నం మున్సిపల్ హైస్కూలుగా పేరు పెట్టబడి మధ్యందిన మార్తాండునిలావెలుగుతోంది.అనంతరం పురపాలక సంఘం వారిచే పై అంతస్థులో కూదా షెడ్ల నిర్మాణంజరిగి నాటికి వసతి కొరత తీర్చబడింది.
స్కౌటు ఉద్యమములో పాఠశాలదొక ప్రత్యేక చరిత్ర....1968లో 10వ జిల్లా స్కౌటు ర్యాలీ ఈ పాఠశాలలో నిర్వహించబది పలువురు జిల్లా ప్రముఖుల ప్రశంసలందుకుంది.జిల్లా స్కౌటు ర్యాలీ లో అనేక పర్యాయాలు అనేక అంశాలలో అత్యధిక బహుమతులను గెల్చుకోవడం అనేక పార్యాయాలు All round efficiency&profficiency షీల్డులు గెల్చుకుని పురప్రముఖుల ప్రశంసలందుకుంది.
1964-65 సం.లో అంతర్ జిల్లా ఆటలపోటీలు ఈ పాఠశాలలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
1970 లో కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ఈ పాఠశాల సందర్శించి ఆశీర్వదించి ప్రశంసించటం ఒక ప్రత్యేకత.శ్రీయుతులు కాశీనాధుని సత్యారాయణ,ఆండ్ర శేషగిరిరావు,దుర్వాసుల వెంకట శాస్త్రి,డి.వి సుబ్బరాయ శాస్త్రి,భమిడిపాటి శ్రీరామమూర్తి,అత్తిలి మాణిక్యాలరావు,మావూరి సూర్యప్రకాశరావు,ఈడూరి రామచంద్రరావు,N.S.ప్రకాశరావు,వంగా నరసిమ్హా రావు వంటి కళా సాహితీరంగ ప్రముఖులైన ఉపాధ్యాయుల కృషి ఫలితంగా ఆయా రంగాలలో కీర్తి గడించింది.
1958వ సంవత్సరం నుండి వృత్తి విద్యాకోర్సులు ప్రవేశ పెట్టబడ్డాయి.ప్రభుత్వం వారి సహకారంతో మండల వృత్తి విద్యా కేంద్రం భవనం ఇక్కద ఏర్పాటు చేయటం జరిగింది.విద్యా విషయకంగా ఎన్నో మంచి ఫలితాలు సాధించిన ఈ పాఠశాల అనేక సార్లు రాష్ట్ర స్థాయిలోనూ,జిల్లాస్థాయిలోనూ,పట్టణ స్థాయిలోనూ,అనేక్ ర్యాంకులు సాధించుట జరిగినది.
పాలకొల్లు శాసనసభ్యులు శ్రీ అల్లు వెంకట సత్యనారాయణ,మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ శిడగం పాపారావు,మాజీ వైస్ చైర్మన్ డా.ఆర్.వి.సుబ్బారావు వంటి రాజకీయ ప్రముఖులు,టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ విప్పర్తి సూర్య శ్రీ రాములు వంటి ఉన్నత ఉద్యోగులు ఎంతోమంది పాత్రికేయులు,న్యాయవాదులు,కళాకారులు,క్రీడాకారులు,ఈ పాఠశాల విద్యార్థులు కావటం ఈ విద్యా సంస్థ యొక్క ప్రత్యేకత.సుమారు 100కు పైగా పాఠశాల విద్యార్థులు విదేశాలలో డాక్టర్లుగా,ఇంజనీర్లుగా స్థిరపడటం ఈ పాఠశాలకు గర్వకారణం.
జాతీయ అవార్డు గ్రహీత శ్రీ వంగా నరసిమ్హారావు,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ డి.వి.సుబ్బరాయశాస్త్రి,ఇంకా ఎంతో మంది అవార్డు గ్రహీతలయిన ఉపాధ్యాయులౌ ఈ విద్యాలయంలో పనిచేయటం ఈ పట్టణానికి గర్వకారణం.

Please give full form of RGUKT
రిప్లయితొలగించండిRGUKT means Rajiv gandhi university of knowledge and technology.
రిప్లయితొలగించండిWow...sweet memories.
రిప్లయితొలగించండి