నిన్న సాయంత్రం వంట మా చెల్లీ,నేను చేసుకోవల్సి వచ్చింది.అమ్మ,నాన్న పెళ్ళికి వెళ్ళారు.అందుకని.ముందు మమ్మల్ని కొడా తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్ళలేదు.అన్నం వండడానికి కుక్కర్ పెట్టాం.ఇంట్లో రెండు కుక్కర్లు ఉన్నాయి.ఒకటి పెద్దది,ఇంకోటి చిన్నది.మా చెల్లి ఏం చేసిందంటే పెద్ద కుక్కర్ వెయిట్ తీసుకొచ్చి చిన్న కుక్కర్ కి పెట్టింది.మా ఇద్దరికీ తెలియలేదు.అది కాస్తా విసిల్ వచ్చినపుడు పైకి ఎగిరిపోయింది.ఆవిరి అంతా పైకి పోయింది.ఇంకా నయం అన్నం పైకి రాలేదు.ఏం చెయ్యలో తెలియలేదు.ఆ ఆవిరి ని ఎలా ఆపాలో తెలియక స్టౌ ఆపేసి కుక్కర్ ని కింద పెట్టేశాం.ఆవిరి మొత్తం పైకి వెళ్ళిపోయింది.కాసేపయ్యాక కుక్కర్ మూత తెరిస్తే అన్నం ఇంకా సరిగా ఉడకలేదు.ఇంకా కింద నీరు ఉంది.అప్పుడు కుక్కర్ ని మూత తీసేసి స్టౌ మీద పెట్టాం,నీరు ఆవిరౌతుందని.కుక్కర్ అడుగు భాగం మాడిపోయింది.
ఇక ఏం చేస్తాం.మాడిన అన్నం తీసేసి మిగిలినది తిన్నాం.ఇక కూర విషయానికొస్తే మాకు కూరలు చెయ్యడం అంత బాగా రాదు.ఉప్పూ,కారం ఎంతెంత వెయ్యలో సరిగా తెలియదు.అందుకని తేలిక గా అయిపోద్దని గుడ్లు కూర చేసేశాం.కూర చాలా బాగా కుదిరింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...