26, మే 2013, ఆదివారం

Food in RGUKT

ఈ రోజు RGUKTమెస్ గురించి తెల్సుకుందాం.PUC అమ్మాయిలందరికీ 3 మెస్ లు ఉన్నాయి.వాటి పేర్లు Windows,linux,mac. మొదటిదానిలో మెంటార్లు కూడా విద్యార్థులతో పాటు భోజనం చేస్తారు.

అక్కడ వంటలు అన్నీ ఆధునిక పద్ధ్హతుల్లో తయారు చేస్తారు.మా అందరికీ గురువారం రాత్రి చేసే ఆలూ65 అంటే చాలా ఇష్టం.ప్రతీ ఆదివారం రాత్రి చికెన్ పెడతారు.కొంతమంది వల్ల తెలిసినదేమిటంటే ఇదివరకు అన్నంలో ఇసుక ఉండేదట.కానీ ఇప్పుడలా కాదు.చాలా బావుంటుంది.మేము చేరిన మొదట్లో ఎగ్ రైస్ కానీ వెజిటెబుల్ రైస్ కానీ చేసేవారు.కానీ ఇప్పుడు చెయ్యట్లేదు.దాని బదులు టమాట రైస్ చేస్తున్నారు.వారానికి రెండు సార్లు ఇడ్లి ఉంటుంది.ప్రతీ రోజు మధ్యాహ్నం భోజనంలో ఉడికించిన గుడ్డు ఉంటుంది.రాత్రి భొజనంలో అరటిపండు ఇస్తారు.ప్రతీ రోజు ఏదో ఒక పచ్చడి లేక చట్నీఉంటుంది.


సాయంత్రం 5 గంటలకి టీ తోపాటు బిస్కెట్లు ఇస్తారు.కనీ వారానికొకసారి శెనగలు ఇస్తారు.మధ్యాహ్నం భోజనం 12:30కి,రాత్రి భోజనం 7గంటలకి పెడతారు.ఏదైనా పండుగ ఉంటే స్పెషల్ పెడతారు.ఇక్కడ ఆహార ప్రమాణాలు చాలా బాగుంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...