19, మే 2013, ఆదివారం

అంతర్జాలం-RGUKT

మాకు అంతా wired network అని చెప్పాను కదా.Internet ఉంటుంది.కానీ పూర్తిగా Net ఇవ్వరు. అంటే విద్యార్థులకు సంబంధించిన సైట్లు మాత్రమే ఓపెన్ అవుతాయి.మా అదృష్టం ఏమిటో.మేము చేరిన సంవత్సరం నుండే E-papers ఈనాడు,సాక్షి వస్తున్నాయి.మేము ఉదయమే తరగ్తికి వెళ్ళి అవి చదువుతాము.Gmail,Facebook ఇటువంటివి ఏమీ రావు.
కానీ ఒక్కో సారి ఒక 5 నిముషాల పాటు అలాంటివి కూడా వస్తాయి.అప్పుడు మేము చేసే గోల అంతా ఇంతా కాదు.
మాకు Net వాడుకోవడానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది.ఎవరు ఇష్టం వచ్చింది వారు పెట్టుకోవచ్చు.ఒక రోజుకి Net వాడుకోవడానికి ఒక Limit ఉంటుంది.అది అయిపోతే ఇక నెట్ రాదు.డౌన్లోడ్స్ కి కూడా అంతే.ఎర్ర రంగులోLimit Exceeded అని వస్తుంది.మేమంతా ఎక్కువగా చాయాచిత్రాల కోసం గూగుల్ లో వెతుకుతాం.సాక్షి ఎడ్యుకేషన్,ఈనాడు ప్రతిభ లాంటి సైట్లలో మాకు కావల్సిన మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుంటాము.లిమిట్ అవ్వకుండా ఉండాలంటే ఒక్కొక్కరు ఒక్కోటి డౌన్లోడ్ చేసి అంసరూ వాటిని షేర్ చేసుకుంటాము.HFS నుండి గానీ,Simple HTTP నుండి షేర్ చేసుకుంటాము.
అటెండెన్స్ కూడా ఆన్ లైన్ లో ప్రతి గంటకొకసారి లాగిన్ అవ్వాలి.8:30AM నుండి 12:30PM వరకూ.మొదటి అరగంటలో లాగిన్ అవ్వకపోతే మరి మన అటెండన్స్ పడదు.
ఏదైనా ఒక విషయం విద్యార్థులందరికీ తెలియాలంటే Notice board ఉంటుంది కదా.దానిని మేము Online Notice Board(ONB) అంటాము.అందులో పరీక్షల వేళ కాలపట్టికలు,సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు ఇటువంటివి పెడతారు.

4 వ్యాఖ్యలు:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...