19, మే 2014, సోమవారం

కొత్త పుస్తకాలు

ఒక ఆదివారం మా కళాశాలకి విశాలాంధ్ర మొబైల్ వ్యాన్ వచ్చింది.వెంటనే వెళ్ళి చూడాలనిపించింది.పుస్తకాలు తప్పకుండా కొనాలనుకున్నా.అప్పటి వరకు దాచుకున్న డబ్బులు 300 రూపాయలు ఉన్నాయి.నేను కొనాలనుకున్న పుస్తకాల మొత్తం ధర సుమారు 600 అయింది.ఆ పుస్తకాలలో ఖరీదైనది బారిష్టర్ పార్వతీశం.అదొక్కటీ 300/- దాన్ని మార్చేసి చిన్న పుస్తకాలు తీసుకున్నా.నాక్కవల్సిన 300/- నా స్నేహితురాలి నాన్న గారి దగ్గర తీసుకున్నా.మా నాన్న గారు డబ్బులు నా బ్యాంకు ఖాతాలో వేశాక నేను వాటిని తీసుకుని తనకు ఇచ్చేశా.మొత్తానికి మంచి పుస్తకాలు కొన్నాననిపించింది.నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులుంటే ఇంకొన్ని మంచి పుస్తకాలు కొనేదాన్ని ప్చ్.నాకైతే మొత్తం పుస్తకాలు కొనుక్కోవాలనిపించింది.అలా కుదరదు కదా!!!
మరి ఈ పుస్తకాలు బావున్నాయా?  మొత్తానికి ఈ "కొత్త పుస్తకాలు" మా చిన్న గ్రంథాలయం లోకి చేరాయి.


 
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...