7, జూన్ 2013, శుక్రవారం

మా ఇంట్లోని బొమ్మలు

శుక్రవారం, జూన్ 07, 2013 0 Comments







ఈ పూల కుండీల పైన ఎంసీల్ తో పువ్వులు చేసి అతికించాం.బావున్నాయా.పువ్వులు మాత్రం కృత్రిమమైనవే.

లాఫింగ్ బుద్ద


బగ్స్ బన్నీ సైకిల్ మీద ఎలా షికారుకు వెళ్తూ మన బ్లాగులోకి వచ్చింది.



ఇవి ఏటికొప్పాక లక్క బొమ్మలు.మా అత్తయ్య మా కోసం చిన్నప్పుడు తెచ్చింది.ఎప్పటివో కదా రంగులు పోయాయి.




వివిధ జంతువుల బొమ్మలు


దీన్ని మా చెల్లి తెల్ల సాక్సు క్లాత్ తో తయారు చేసింది.


ఈ బొమ్మకి బట్టలు కుట్టి మేమే అలంకరించాం.

పాటల సైట్

శుక్రవారం, జూన్ 07, 2013 1 Comments
మీకేమైనా తెలుసా శీర్షిక తో నేను చేసిన పోస్ట్ కి జవాబు నాకు దొరికింది.తెలుగు పాత పాటల కోసం ఒక సైట్ దొరికింది.అదే www.oldtelugusongs.com

5, జూన్ 2013, బుధవారం

వేసవి సెలవులు-నా బ్లాగు

బుధవారం, జూన్ 05, 2013 13 Comments
ఈ వేసవి సెలవులను నేను అస్సలు మర్చిపోలేను.ఎందుకంటే నాకంటూ ఒకబ్లాగు ప్రారంభించుకున్నాను.అసలు బ్లాగు అంటే ఏంటో కూడా  తెలియదు నేను బ్లాగు ప్రారంభించేనాటికి.అప్పుడు ఏం రాయాలో తెలియలేదు.ఏదో రాశాను.ఏప్రిల్,మే రెండు నెలలు అనుకోకుండా మాకు సెలవులు ఇచ్చారు.ఈ రెండు నెలలూ కూడా నాకు ఈ బ్లాగుతోనే సరిపోయింది.


ఉదయం 7 గంటలకి లేవడం.9గంటలకల్లా Laptop ముందు కూర్చోవడం.విద్యుత్తు సరఫరా ఉన్న లేకపోయినా ఏం ఫరవాలేదు కదా..ముందు నేనేమైనా టపాలు వేయాలనుకుంటే వాటిని ప్రచురించేసి, ఆ తర్వాత కూడలి,జల్లెడ,హారం,మాలిక,బ్లాగిల్లు మరియు సంకలిని లలో కొత్త బ్లాగులు వెతికి చూడడం, నాకు నచ్చితే వ్యాఖ్యలు పెట్టడం,ఇంకా కావాలనుకున్న పాటలు దిగుమతి చేసుకోవడం ...ఇదే నా పని.

నా టపాలకి ఏమైనా వ్యాఖ్యలొస్తే ఎంత ఆనందపడేదాన్నో.ప్చ్ అప్పుడే సెలవులయిపోయాయే అనిపిస్తుంది.నా బ్లాగుకి ఎన్ని Templates మార్చానో నాకే తెలియదు.నచ్చిన template పెడితేనేమో లే అవుట్ లో page elements అన్నీ చిందరవందర గా ఉండేవి.ఎంత చిరాకొచ్చేదో.చివరికి ఇప్పుడున్న Template ఉంచా.బాగుందా..

రోజూ కొత్త బ్లాగులు వెతుకుతుంటే కనీసం రోజుకొక పదివరకూ కొత్తబ్లాగులు కనిపించేవి.నాకు ఆశ్చర్యమనిపించిన బ్లాగు యశోదకృష్ణ.సాహితి గారు రోజూ ఒక టపా ను ప్రచురిస్తారు.అది కూడా ఉదయం 10:10ని. లకు.కావాలంటే మీరూ చూడండి.

మధ్యాహ్న సమయంలో నండూరి రామ్మోహనరావు గారు రచించిన "విశ్వరూపం" పుస్తకం చదివేదాన్ని.అందులో విషయాలు ఎంతో ఆశక్తికరంగా ఉంటాయి.అది ఎంతో ఉపయోగకరమైన పుస్తకం.

అసలైతే మాకు సెలవులు జూలై 21వరకు.నేను జీవశాస్త్రం అదనంగా తీసుకున్నందువల్ల ముందు వెళ్ళవల్సి వస్తుంది.మళ్ళి ఐటీ ని ఒక ఐచ్చికాంశం గా పెట్టారట.దానికి మా స్నేహితులు జీవశాస్త్రం తీసుకోని వారు నమోదు అయ్యారు.

తెలుగులో టైపు చెయ్యడం అంత కష్టం కాలేదు.ఎందుకంటే మా కళాశాలలో టైపింగ్ మేము నేర్చుకోవాలి.అక్కడ అది తప్పనిసరి.


మొదట బ్లాగు ప్రారంభించాలనుకున్నప్పుడు దేని గురించి రాద్దామూ అని ఆలోచిస్తే మా విశ్వవిద్యాలయం గురించి రాద్దాం అని RGUKT జీవితం అని శీర్షిక పెట్టాను.ఒక నెల తర్వాత ఒక్క RGUKT గురించే అయితే కుదరట్లేదు అని నా పేరు మీదే శీర్షిక పెట్టేశా.


మీకేమైనా తెలుసా???

బుధవారం, జూన్ 05, 2013 1 Comments
ఘంటశాల గారి పాటలు శివశంకరి,మల్లియలారా,ఊహలు గుసగుసలాడే,నన్ను వదలి నీవు వీటి కోసం అంతర్జాలంలో ఎంత వెతికినా కనిపించలేదు.4shared లో ఖాతా ఉంటేనె కానీ దిగుమతి వీలు కావడం లేదు.ఈ పాటలు ఉచితం గా ఎక్కద దిగుమతి చేసుకోవచ్చునో మీకు తెలిస్తే చెప్పండి.

4, జూన్ 2013, మంగళవారం

మేఘాలు

మంగళవారం, జూన్ 04, 2013 3 Comments
 











నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రం లోనికి ప్రవేశించి మన అందరిని తొలకరి పులకింతల్లో ముంచేశాయి.మేఘాలు చూడండి వర్షపు నీటితో నిండుగా ఉన్నాయి.

దేశాలమ్మ జాతర

మంగళవారం, జూన్ 04, 2013 0 Comments


పాలకొల్లు లోని కాటన్ దొర విగ్రహం





















మొన్న సోమవారం నుండి పాలకొల్లు పట్టణ ఇలవేలుపు అయిన దేశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

3, జూన్ 2013, సోమవారం

బాలభారతం

సోమవారం, జూన్ 03, 2013 1 Comments
ఎప్పట్నుంచో బాలభారతం మాసపత్రిక గురించి ఈనాడు లో ప్రకటిస్తున్నారు.అది ఎప్పుడు వెలువడుతుందో అని ఎదురు చూసే దాన్ని.ఈ జూన్ నెలకి విడులవతుందని తెలిసింది.నిన్న నాన్న గారు తెచ్చారు.తెలుగువెలుగు తో పాటు బాలభారతం ని కూడా తెచ్చారు.అసలు పత్రిక మొత్తం రంగులతో ఎంతో బావుంది.పిల్లలు చాలా ఇష్టంగా చదువుతారేమో అని అనిపించింది.పత్రిక మొత్తం ఒక్క పుట కూడా వదలకుండా ఇంటిల్లపాదినీ చదివిస్తుంది అనడంలో సందేహం లేదేమో.మొదటి సంచిక కానుకగా పుస్తకాలపై అంటించుకునే లేబుల్స్ ఉచితంగా ఇచ్చారు.పత్రిక వెల 20 రూపాయలు.ముఖ చిత్రమే చాలా ఆకర్షణీయంగా ఉంది.పత్రికకి మస్కట్ కిట్టూ.


చిన్నపిల్లలు చదివేలా ఇందులో చాలా నీతికథలు,జానపద కథలు ఉన్నాయి.చిన్నారులకి మాత్రమే కాకుండా పెద్దలకు కూడా ఎంతో ఉపయోగకరంగా సంపాదకులు దీనిని తీర్చిదిద్దారు.

ఈ నెల పత్రిక విశేషాలేంటంటే
1.గణితశాస్త్రంలో ఇచ్చే ప్రపంచములో గొప్ప పురస్కారమైన ఎబెల్ బహుమతి.
2.నీలం రంగు గురించి.
3.జీబ్రా చారల గురించి
4.రాకెట్ ప్రయాణించే వేగం
5.అంతర్జాలాన్ని చిన్నారులు ఎలా ఉపయోగించుకోవాలి.
6.మండే మంచు గురించి
7.వానా కాలంలో వచ్చే వ్యాధులు,అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
8.జ్ఞాపక శక్తి పెరగాలంటే..
9.భయాన్ని భయపెదడాం అంటూ మనలో ఉండే రకరకాల భయాల గురించి.
10.ఎస్కలేటర్ గురించి
11.ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ గారి సారధ్యంలో బొమ్మలు వేయడంలో మెళుకువలు.
12.అంతరిక్షంలో వాడే కొలమానాలు
13.మానసికంగా ఎదుగుదల లేని వారికి నిర్వహించే ప్రత్యేక ఒలింపిక్స్
14.వృధా చెత్తతో విలువైన ఎరువును తయారు చేసుకోవడం
15.సూక్ష్మ జీవులూ నేస్తాలే అంటూ మేలు చేసే సూక్ష్మ జీవులు గురించి.
16.చిన్న సైన్సు ప్రయోగం.....

ఇలా ఎన్నో... చెప్తే ఏం బావుంటుంది.మీరే చదవండి.

1, జూన్ 2013, శనివారం

మొదటి ట్యాబ్లెట్ అనుభవం

శనివారం, జూన్ 01, 2013 0 Comments
ఒక వారం క్రితం స్పీడు పొస్టులో ఒక ప్యాకెట్ వచ్చింది.దాని పైన ఉన్న స్టిక్కర్ బట్టి అందులో ఉన్నది ట్యాబ్లెట్ అని తెలిసింది.దానిని తెరవమని నాన్న గార్ని అడిగితే ఇప్పుడొద్దు,రేపు తెరుద్దాం అన్నారు.ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు.


నాకు,మా చెల్లికి మొబైల్స్ అన్నా కంప్యూటర్స్ అన్నా చాలా పిచ్చి.నాకైతే మరీను.అప్పటి వరకూ ట్యాబ్లెట్ ని స్వయంగా ఎప్పుడూ చూడలేదు.ట్యాబ్లెట్ గురించి తెలిసినప్పట్నుంచీ దానిని ముట్టుకోవాలనీ,ఆపరేట్ చెయ్యాలని ఉండేది.నాకెక్కడా కనిపించలేదు.రిలయన్స్ సూపర్ లో కూడా లేదు.ఇదిగో ఇన్నాళ్ళకు చూసే అవకాశం వచ్చింది.


ఉదయమే నాన్న గారు కాలేజీకి ఏడున్నరకే వెళ్ళిపోతారు.అందుకని ఆ ప్యాకెట్ ని తెరవమన్నాం.అది ఇదిగో ఇలా ఉంది.


అది Simmetronics XPAD ధర 6,000/- దానిని ఆన్ లైన్ షాపింగ్ ద్వారా  తెప్పించారు.అయినా అది మాకోసం కాదు.నాన్న గారి స్నేహితుడు ఒకరు తెప్పించమంటే...మేము దాన్ని ఆన్ చేసి ఏమేం ఆప్స్ ఉన్నాయో చూశాం.ఎంత బావుందో.....