1, జూన్ 2013, శనివారం

మొదటి ట్యాబ్లెట్ అనుభవం

ఒక వారం క్రితం స్పీడు పొస్టులో ఒక ప్యాకెట్ వచ్చింది.దాని పైన ఉన్న స్టిక్కర్ బట్టి అందులో ఉన్నది ట్యాబ్లెట్ అని తెలిసింది.దానిని తెరవమని నాన్న గార్ని అడిగితే ఇప్పుడొద్దు,రేపు తెరుద్దాం అన్నారు.ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు.


నాకు,మా చెల్లికి మొబైల్స్ అన్నా కంప్యూటర్స్ అన్నా చాలా పిచ్చి.నాకైతే మరీను.అప్పటి వరకూ ట్యాబ్లెట్ ని స్వయంగా ఎప్పుడూ చూడలేదు.ట్యాబ్లెట్ గురించి తెలిసినప్పట్నుంచీ దానిని ముట్టుకోవాలనీ,ఆపరేట్ చెయ్యాలని ఉండేది.నాకెక్కడా కనిపించలేదు.రిలయన్స్ సూపర్ లో కూడా లేదు.ఇదిగో ఇన్నాళ్ళకు చూసే అవకాశం వచ్చింది.


ఉదయమే నాన్న గారు కాలేజీకి ఏడున్నరకే వెళ్ళిపోతారు.అందుకని ఆ ప్యాకెట్ ని తెరవమన్నాం.అది ఇదిగో ఇలా ఉంది.


అది Simmetronics XPAD ధర 6,000/- దానిని ఆన్ లైన్ షాపింగ్ ద్వారా  తెప్పించారు.అయినా అది మాకోసం కాదు.నాన్న గారి స్నేహితుడు ఒకరు తెప్పించమంటే...మేము దాన్ని ఆన్ చేసి ఏమేం ఆప్స్ ఉన్నాయో చూశాం.ఎంత బావుందో.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...