3, జూన్ 2013, సోమవారం

బాలభారతం

ఎప్పట్నుంచో బాలభారతం మాసపత్రిక గురించి ఈనాడు లో ప్రకటిస్తున్నారు.అది ఎప్పుడు వెలువడుతుందో అని ఎదురు చూసే దాన్ని.ఈ జూన్ నెలకి విడులవతుందని తెలిసింది.నిన్న నాన్న గారు తెచ్చారు.తెలుగువెలుగు తో పాటు బాలభారతం ని కూడా తెచ్చారు.అసలు పత్రిక మొత్తం రంగులతో ఎంతో బావుంది.పిల్లలు చాలా ఇష్టంగా చదువుతారేమో అని అనిపించింది.పత్రిక మొత్తం ఒక్క పుట కూడా వదలకుండా ఇంటిల్లపాదినీ చదివిస్తుంది అనడంలో సందేహం లేదేమో.మొదటి సంచిక కానుకగా పుస్తకాలపై అంటించుకునే లేబుల్స్ ఉచితంగా ఇచ్చారు.పత్రిక వెల 20 రూపాయలు.ముఖ చిత్రమే చాలా ఆకర్షణీయంగా ఉంది.పత్రికకి మస్కట్ కిట్టూ.


చిన్నపిల్లలు చదివేలా ఇందులో చాలా నీతికథలు,జానపద కథలు ఉన్నాయి.చిన్నారులకి మాత్రమే కాకుండా పెద్దలకు కూడా ఎంతో ఉపయోగకరంగా సంపాదకులు దీనిని తీర్చిదిద్దారు.

ఈ నెల పత్రిక విశేషాలేంటంటే
1.గణితశాస్త్రంలో ఇచ్చే ప్రపంచములో గొప్ప పురస్కారమైన ఎబెల్ బహుమతి.
2.నీలం రంగు గురించి.
3.జీబ్రా చారల గురించి
4.రాకెట్ ప్రయాణించే వేగం
5.అంతర్జాలాన్ని చిన్నారులు ఎలా ఉపయోగించుకోవాలి.
6.మండే మంచు గురించి
7.వానా కాలంలో వచ్చే వ్యాధులు,అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
8.జ్ఞాపక శక్తి పెరగాలంటే..
9.భయాన్ని భయపెదడాం అంటూ మనలో ఉండే రకరకాల భయాల గురించి.
10.ఎస్కలేటర్ గురించి
11.ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ గారి సారధ్యంలో బొమ్మలు వేయడంలో మెళుకువలు.
12.అంతరిక్షంలో వాడే కొలమానాలు
13.మానసికంగా ఎదుగుదల లేని వారికి నిర్వహించే ప్రత్యేక ఒలింపిక్స్
14.వృధా చెత్తతో విలువైన ఎరువును తయారు చేసుకోవడం
15.సూక్ష్మ జీవులూ నేస్తాలే అంటూ మేలు చేసే సూక్ష్మ జీవులు గురించి.
16.చిన్న సైన్సు ప్రయోగం.....

ఇలా ఎన్నో... చెప్తే ఏం బావుంటుంది.మీరే చదవండి.

1 కామెంట్‌:

  1. మొదటిరోజే తెచ్చుకుందాం అనుకున్నా. మర్చిపోయాను. ఈ రోజు కొని చదువుతా.

    రిప్లయితొలగించండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...