17, జులై 2013, బుధవారం

"భయా"లజీ

నేను జూన్ తొమ్మిదవ తేదీన కళాశాలకి వెళ్ళాను కదా.పదవ తారీఖు నుండి తరగతులు ప్రారంభం అయ్యాయి.కానీ ఆరోజున ఏమీ చెప్పలేదు.జీవాశాస్త్రం గురించి ఓ నాలుగు మాటలు చెప్పారు.

మాకిచ్చిన కాల పట్టిక (Time table) ప్రకారం 35 రోజులలో ఇంచుమించు 100 మాడ్యూల్సు పూర్తి అవ్వాలి.ఒక మాడ్యూల్ అంటే ఒక పాఠ్యాశం అన్నమాట.రోజుకు 4 మాడ్యూల్స్,రోజుకి నలుగురు మెంటార్లు చెపుతారు.మర్నాడు ఉదయం ఆ నాలుగు పాఠాల మీద వీక్లీ టెస్ట్ ఉంటుంది.అదేంటీ వారం అవ్వకుండా వీక్లీ టెస్ట్ ఏంటీ అనుకుంటున్నారా,అది అంతే.మూడు వారపరీక్షల తర్వాతి రోజు మంత్లీ టెస్ట్ ఉంటుంది.వారపరీక్షలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 12 ఉంటే,నెల పరీక్షలో ఈ 12 తో సహా మరో5 మార్కులకి పేపర్ బేస్డ్ టెస్ట్ రాయాలి.ఈ వరసంతా చూసి కొంతమంది విద్యార్ధులు ముందు జీవశాస్త్రాన్ని తీసుకుని మళ్ళీ మాకు వద్దని Withdraw చేసుకున్నారు.నాకైతే వాళ్ళు తప్పుచేశారేమో అనిపించింది.నిజం చెప్పాలంటే నాకూ ముందు భయం వేసింది.కానీ మెంటార్లు నాలోని,మాలోని భయాలను పోగొట్టారు.

అందరు మెంటార్లు చాలా బాగా వివరించి చెప్పేవారు.పరీక్షలు కూడా ఇంచుమించు అందరూ బాగా రాసేవాళ్ళం.అసలు పరీక్షకి ఇచ్చే సమయం 45 నిముషాలైతే మేము 19 నిముషాలలో పరీక్షపూర్తిచేసేవాళ్ళం.ఆన్ లైన్ పరీక్ష కదా.

అందరూ జీవాశాస్త్రం అంటే భయపడేది దానిలో ఉండే పదాల గురించి,కానీ నాకైతే ఏమీ కష్టం కాలేదు.ఎందుకంటే అదంటే ఇష్టం కనుకేమో.అయినా ఒక్కసారొ వచ్చిన కొత్తపదం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది.ఉదయమే జంతుశాస్త్రం తెలుగు మాధ్యమ పుస్తకం చూశాను.తెలుగు కంటే ఇంగ్లీషే నయమేమో అనిపించింది.ఎందుకంటే పదాల ఉచ్ఛారణ అలా ఉంది.









1 కామెంట్‌:

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...